telangana parliamentary secretaries
-
'పార్లమెంటరీ సెక్రటరీలను ఉపసంహరించుకుంటున్నాం'
హైదరాబాద్ : పార్లమెంటరీ కార్యదర్శుల పదవులను ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. తెలంగాణ సర్కార్ పార్లమెంటరీ సెక్రటరీల నియామకాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ సర్కారు నియమించిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పార్లమెంటరీ సెక్రటరీల పోస్టులను రద్దు చేయాలని ఆదేశించింది. ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా తెలంగాణ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. వి. సతీష్ కుమార్ (విద్యాశాఖ), జీ కిషోర్ కుమార్ (వైద్యశాఖ), శ్రీనివాస్‌గౌడ్ (రెవెన్యూ శాఖ), కోవా లక్ష్మీ (వ్యవసాయ శాఖ), జలగం వెంకట్రావ్, వినయ్ భాస్కర్ పదవులు కోల్పోయారు. -
'అదనపు సౌకర్యాలు ఆపేయండి'
హైదరాబాద్: పార్లమెంట్ సెక్రటరీలకు ఇస్తున్న అదనపు సౌకర్యాలను నిలిపి వేయాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన తెలంగాణ సీఎం కార్యాలయ అధికారులను కలిశారు. పార్లమెంట్ సెక్రటరీల నియామకం చెల్లదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వయంగా అధికారులకు అందజేశారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమలు చేయాలన్నారు. లేదంటే కోర్టు ధిక్కార కేసు పెడతామని హెచ్చరించారు. టీఆర్ఎస్ సర్కారు నియమించిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని న్యాయస్థానం ఈనెల 1న ఆదేశాలిచ్చింది. పార్లమెంటరీ సెక్రటరీల పోస్టులను రద్దు చేయాలని ఆదేశించింది. తదుపరి నియామకాలు హైకోర్టు అనుమతితో జరపాలని ఆదేశించింది. -
టీఆర్ఎస్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ సర్కారు నియమించిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పార్లమెంటరీ సెక్రటరీల పోస్టులను రద్దు చేయాలని ఆదేశించింది. తదుపరి నియామకాలు హైకోర్టు అనుమతితో జరపాలని ఆదేశించింది. పార్లమెంటరీ సెక్రటరీల నియామకాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ ఆదేశాల్చింది. హైకోర్టు తీర్పుతో పార్లమెంటరీ సెక్రటరీలుగా బాధ్యతలు చేపట్టిన వినయ్ భాస్కర్, జలగం వెంకట్రావు, గాదరి కిశోర్ కుమార్, సతీశ్ కుమార్, కోవాల లక్ష్మి పదవులు కోల్పోనున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన సంగతి తెలిసిందే. వి. సతీష్ కుమార్ (విద్యాశాఖ), జీ కిషోర్ కుమార్ (వైద్యశాఖ), శ్రీనివాస్‌గౌడ్ (రెవెన్యూ శాఖ), కోవా లక్ష్మీ (వ్యవసాయ శాఖ), జలగం వెంకట్రావ్, వినయ్ భాస్కర్లకు సీఎం కార్యాలయ శాఖలు కేటాయించారు. వీరికి సహాయ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
త్వరలో స్పష్టత ఇస్తాం: కేసీఆర్
హైదరాబాద్: పార్లమెంటరీ సెక్రటరీల బాధ్యతలపై త్వరలో స్పష్టత ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. పాలనపై మంత్రులు పట్టు సాధించాలని ఆయన సూచినట్టు తెలిసింది. 10 నెలల పాలన పూర్తైన సందర్భంలో మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలు, ముఖ్యనేతలతో కేసీఆర్ బుధవారం సమావేశమయ్యారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల లోటుపాట్లపై ఆయన చర్చించినట్టు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ.. ప్రభుత్వం, పార్టీ వ్యూహంపై కూడా చర్చించినట్టు తెలిసింది. పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఈ నెలాఖరున నిర్వహించాల్సిన బహిరంగ సభపై సమాలోచనలు జరిపారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఈ భేటీలో చర్చించారు.