
త్వరలో స్పష్టత ఇస్తాం: కేసీఆర్
హైదరాబాద్: పార్లమెంటరీ సెక్రటరీల బాధ్యతలపై త్వరలో స్పష్టత ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. పాలనపై మంత్రులు పట్టు సాధించాలని ఆయన సూచినట్టు తెలిసింది. 10 నెలల పాలన పూర్తైన సందర్భంలో మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలు, ముఖ్యనేతలతో కేసీఆర్ బుధవారం సమావేశమయ్యారు.
మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల లోటుపాట్లపై ఆయన చర్చించినట్టు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ.. ప్రభుత్వం, పార్టీ వ్యూహంపై కూడా చర్చించినట్టు తెలిసింది. పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఈ నెలాఖరున నిర్వహించాల్సిన బహిరంగ సభపై సమాలోచనలు జరిపారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఈ భేటీలో చర్చించారు.