పార్లమెంటరీ కార్యదర్శుల పదవులను ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది.
హైదరాబాద్ : పార్లమెంటరీ కార్యదర్శుల పదవులను ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. తెలంగాణ సర్కార్ పార్లమెంటరీ సెక్రటరీల నియామకాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ సర్కారు నియమించిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పార్లమెంటరీ సెక్రటరీల పోస్టులను రద్దు చేయాలని ఆదేశించింది.
ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా తెలంగాణ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. వి. సతీష్ కుమార్ (విద్యాశాఖ), జీ కిషోర్ కుమార్ (వైద్యశాఖ), శ్రీనివాస్గౌడ్ (రెవెన్యూ శాఖ), కోవా లక్ష్మీ (వ్యవసాయ శాఖ), జలగం వెంకట్రావ్, వినయ్ భాస్కర్ పదవులు కోల్పోయారు.