నరసాపురం అర్బన్ : భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్ పార్క్ నిర్మాణంపై ప్రజల నుం చి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక కమిటీని నియమించనున్నట్టు నరసాపురం సబ్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ చెప్పారు. పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వేలాదిమంది ప్రజలు ఆక్వా పార్క్ నిర్మాణ ప్రాంతంలో ఆందోళనకు దిగటం, వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడం వంటి పరి ణామాల నేపథ్యంలో పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, పార్క్ యాజ మాన్య ప్రతినిధులతో శనివారం సబ్ కలెక్టర్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆక్వా పార్క్ విషయంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
పోరాట కమిటీ తరఫున సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, భీమవరం డివిజన్ కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్, నాయకులు కవురు పెద్దిరాజు, ఎం.త్రిమూర్తులు, తుందుర్రు, కంసాల బేతపూడి గ్రామాల పెద్దలు కొత్తపల్లి విశ్వనాథం, ఎస్.వెంకటేశ్వరరావు, చీడే మధు తదితరులు చర్చలకు హాజరయ్యారు. తుందుర్రులో శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలు, ఉద్రిక్తతకు దారితీసిన కారణాలను సబ్ కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సీపీఎం కార్యదర్శి బలరామ్ మాట్లాడుతూ ఆక్వాపార్క్ యాజ మాన్యం దుందుడుకు చర్య కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఆక్వా పార్క్ నిర్మిస్తే పంట పొలాలు నాశనమవుతాయని, మత్స్యకారులు జీవనోఫాది కోల్పోతారని వివరించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా పార్క్ నిర్మాణం సాగుతోందన్నారు. యాజమాన్యం చెబుతున్న విషయాల్లో ఏ మాత్రం వాస్తవం లేదని వివరించారు. అక్కడ ఆక్వా పార్క్ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. నాలుగు మండలాల ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇంతకుమించి రెండో మాట లేదని తెగేసి చెప్పారు. సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ దీనిపై ఓ కమిటీని నియమించి సమస్యను పరిష్కరిద్దామని ప్రతిపాదించగా, ఆలోచించి తమ నిర్ణయం చెబుతామన్న పోరాట కమిటీ ప్రతినిధులు చర్చలు ముగించి రాత్రి 9.30 గంటలకు బయటకు వచ్చారు.
ఇదిలావుండగా, ఆక్వాపార్క్ యాజమాన్యం తరఫున ముగ్గురు ప్రతినిధులు ఉదయం సబ్ కలెక్టర్‌ను కలిశారు. అన్ని అనుమతులతో, నిబంధనలకు లోబడి తాము ఆక్వాపార్క్ నిర్మిస్తున్నామన్నారు. పనులకు ఆటం కం లేకుండా చూడాలని కోరారు. ఇరువర్గాలతో చర్చిం చిన అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ నియమిస్తామని చెప్పారు. అందులో ఇద్దరు గ్రామస్తులు, ముగ్గురు నిపుణులు ఉండేలా చూస్తామన్నారు. వారిచ్చే నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామన్నారు.
‘ఆక్వా పార్క్’పై కమిటీ
Published Sun, Jan 24 2016 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM
Advertisement
Advertisement