ప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలోని జాట్ కమిటి శుక్రవారం రోహ్‌తక్ సందర్శించనుంది. జాట్ రిజర్వేషన్ల ఆందోళన ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కమిటి జిల్లాలోని వివిధ విభాగాల అధికారులను కలిసి సమాచారాన్ని సేకరించనుంది. ఆందోళన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారి వివరాలను కూడ ఈ సందర్భంగా తెలుసుకోనుంది. అదే సమయంలో సమాజంలోని వివిధ విభాగాల ప్రజలను కూడ కమిటి సభ్యులు కలసి అధికారుల పాత్రపై ఆరా తీయనున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఆందోళన ప్రభావితన ప్రాంతాల్లో ఉదయం పది గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ పర్యటించనున్న కమిటి... మధ్యాహ్నం మూడు గంటలనుంచీ, సాయంత్రం ఐదు గంటల వరకూ పోలీసు, సివిల్ అధికారులతో సమావేశమవ్వనుంది. అనంతరం 5వ తేదీ కూడ పలువురు ప్రజలను కలసి సమాచారం సేకరించిన సభ్యులు సాయంత్రం నాలుగ్గంటల సమయంలో మీడియాకు వివరాలను సంక్షిప్తంగా వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. జాట్ల రిజర్వేషన్ ఆందోళనపై.. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రకాష్ సింగ్ అధ్యక్షతన హర్యానా ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
రోహ్‌తక్ సందర్శించనున్న ప్రకాష్ సింగ్ కమిటి
Published Thu, Mar 3 2016 9:38 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM
Advertisement
Advertisement