న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) లిక్విడేషన్ విలువ రూ.13,000 కోట్ల వరకు ఉంటుందని ఇండిపెండెంట్ వాల్యూయర్లు తేల్చారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దివాలా పక్రియ ప్రారంభించే తేదీ నాటికి ఆస్తిని విక్రయించినప్పుడు ఆ ఆస్తిపై అప్పులుపోను కొనుగోలుదారుకు అందే తుది విలువ అంచనానే లిక్విడేషన్ విలువ. రిలయన్స్ క్యాపిటల్ రుణ దాతల కమిటీ (సీఓసీ) సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో సంస్థకు సంబంధించి ఇండిపెండెంట్ వాల్యూయర్లు– డఫ్ అండ్ ఫెల్ప్సŠ, ఆర్‌బీఎస్‌ఏలు ఇచ్చిన లిక్విడేషన్ విలువ వివరాలను రిలయన్స్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటర్ సమర్పించారు. సంబంధిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
► ఆర్‌క్యాప్‌కు డఫ్ అండ్ ఫెల్పŠస్ రూ.12,500 కోట్ల లిక్విడేషన్ విలువ కడితే, ఆర్‌బీఎస్‌ఏ విలువ రూ.13,200 కోట్లుగా ఉంది.
► రిలయన్స్ క్యాపిటల్ కోసం నాలుగు సంస్థలు బిడ్డింగ్ వేశాయి. వీటి బిడ్డింగ్ విలువ తాజా లిక్విడేషన్ అంచనా విలువకంటే 30 నుంచి 40 శాతం తక్కువగా ఉండడం గమనార్హం.
► రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు అందుకున్న అత్యధిక బిడ్ విలువ చూస్తే... కాస్మియా ఫైనాన్షియల్, పిరమల్ గ్రూప్ కన్సార్టియంల ఆఫర్ రూ. 5,231 కోట్లు.
► హిందూజా రూ.5,060 కోట్లకు బిడ్ చేసింది.
► టొరెంట్, ఓక్‌ట్రీ బిడ్‌ల పరిమాణం వరుసగా రూ.4,500 కోట్లు, రూ.4,200 కోట్లుగా ఉంది.
► లిక్విడేషన్ విలువ– వాస్తవ బిడ్ విలువల మధ్య ఉన్న భారీ అంతరాన్ని దృష్టిలో ఉంచుకుని, తమ బిడ్‌లను సవరించమని సీఓసీ బిడ్డర్లను కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలుతెలిపాయి.
రిలయన్స్ క్యాప్ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ విలువలు ఇలా...
రిలయన్స్ క్యాపిటల్ వ్యాపారం విలువలో దాదాపు 90 శాతం వాటా కలిగిన ఆ సంస్థ– జీవితబీమా, సాధారణ బీమా వ్యాపారాల లిక్విడేషన్ విలువలు చూస్తే.. డఫ్ అండ్ ఫెల్పŠస్ వాల్యుయేషన్ నివేదిక ప్రకారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ లిక్విడేషన్ విలువ రూ.7,000 కోట్లు. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విలువ రూ.4,000 కోట్లు. ఆర్‌బీఎస్‌ఏ విషయంలో ఈ అంచనా వరుసగా రూ.7,500 కోట్లు, రూ.4,300 కోట్లుగా ఉన్నాయి. రిలయన్స్ క్యాపిటల్ రుణ దాతలు.. మొత్తం సంస్థకు అలాగే సంస్థలోని విభిన్న వ్యాపారాలకు వేర్వేరుగా బిడ్డింగ్‌ను పిలవడం జరిగింది. సంస్థ మొత్తం కొనుగోలుకు పైన పేర్కొన్న నాలుగు సంస్థలు బిడ్డింగ్ వేయగా, సెక్యూరిటీస్, రియల్టీ, ఏఆర్‌సీలకు మూడు బిడ్లు వచ్చాయి. మూడు బిడ్ల విలువ కేవలం రూ.120 కోట్లుగా ఉంది. అయితే డఫ్ అండ్ ఫెల్ప్సŠ, ఆర్‌బీఎస్‌ఏలు తాజాగా ఇచ్చిన లిక్విడేషన్ విలువలు వరుసగా రూ.280 కోట్లు, రూ.240 కోట్లుగా ఉన్నాయి. కాగా, జీవితబీమా, సాధారణ బీమా వ్యాపారాలకు మాత్రం వేర్వేరుగా ఎటువంటి బిడ్లు దాఖలు కాలేదు.
ఆర్‌క్యాప్ లిక్విడేషన్ విలువ రూ.13,000 కోట్లు?
Published Fri, Dec 2 2022 6:32 AM | Last Updated on Fri, Dec 2 2022 6:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment