సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ నివారణ, పర్యవేక్షణ, పటిష్టంగా వ్యాక్సినేషన్ అమలు, కమాండ్ కంట్రోల్‌ను పర్యవేక్షణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో ఒక కమిటీని నియమించింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 22వ తేది గురువారం ఉదయం 11గంటలకు మంగళగిరిలోని ఏపీఐసీసీ బిల్డింగ్‌లో మంత్రులు కమిటీ సమావేశం జరుగనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. ఈ కమిటీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్‌గా.. సభ్యులుగా రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత, మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఉంటారని తెలిపింది.
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలు, హాస్పిటల్స్‌లో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలు, కమాండ్ కంట్రోల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పలువురు ఉన్నతాదికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని పత్రికలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment