సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ బుధవారం తన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు తెలిసింది. వివిధ ప్రభుత్వ శాఖలు, రెవెన్యూ వర్గాలు, పోర్టల్ నిర్వహణ కంపెనీలతో ప్రాథమికంగా జరిపిన చర్చల అనంతరం రూపొందించిన ప్రాథమిక స్థాయి నివేదికను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమర్పించే అవకాశమున్నట్లు సమాచారం.
బుధవారం సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, టీఎస్‌ఐఐసీతో కమిటీ భేటీ ముగిసిన తర్వాత మంత్రికి నివేదికను సమర్పించనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి జిల్లాలకు వెళ్లి క్ష్రేత్రస్థాయిలో వస్తున్న సమస్యలను తెలుసుకున్న తర్వాత మధ్యంతర నివేదిక ఇవ్వాలని సభ్యులు భావించారు. కానీ ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో బుధవారం నాడే సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అదే జరిగితే అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికపై కూడా చర్చించే అవకాశముందని చెబుతున్నారు. ధరణిపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి చెప్పిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment