
సాక్షి, హైదరాబాద్: ధరణిలో ఆస్తుల నమోదుపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. నవంబరు 3న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం వెకేట్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, సాగు భూముల యజమానుల ఆధార్, కులం వివరాలకు ఒత్తిడి చేయొద్దని నవంబరు 3న హైకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. సాగు భూములపై సబ్సిడీ పథకాలు అమలులో ఉన్నందున ఆధార్ వివరాలు అడగొచ్చని, ఆధార్‌ను గుర్తింపు కార్డు పరిగణనలోకి తీసుకోవచ్చని చట్టం చెబుతోందని ప్రభుత్వం.. హైకోర్టుకు వివరించింది. వెకేట్ పిటిషన్‌పై అభ్యంతరాలను ఈనెల 31లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ధరణిపై పిటిషన్ల విచారణ ఈనెల 31కి కోర్టు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment