![Seven Year Old Girl Urges Karnataka CM to Fix Potholes in Bengaluru - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/26/dhavani.jpg.webp?itok=mU2OM8TS)
బెంగళూరు: నగరంలోని రోడ్లపై గుంతలను పూడ్చాలంటూ ఏడేళ్ల బాలిక కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి విజ్ఞప్తి చేసింది. వివరాల్లోకెళ్తే.. తుమకూరు జిల్లా తిప్టూర్ మండలం హెగ్గనహళ్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 2వ తరగతి విద్యార్థిని ధవణి నగరంలో గుంతల తొలగింపు కోసం తాను పొదుపు చేసిన పాకెట్ మనీని ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో ద్వారా వివరించింది. 73 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
'సీఎం తాతా.. మన బెంగుళూరులో రోడ్లు సరిగా లేవు. కొందరు కుటుంబ సభ్యులు పనికి వెళ్తారు. ఇంట్లో మిగిలిన వారు వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే, మా నాన్న క్షేమంగా ఇంటికి తిరిగొస్తారని నేను వేచి ఉంటాను. దయచేసి గుంతలను పూడ్చి వారి ప్రాణాలను కాపాడండి' అని కోరింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఓ ప్రమాదంలో తన తల్లికి కాలు విరిగిపోయి కుటుంబం పడుతున్న ఇబ్బందులను గుర్తుకు చేసుకుంది. ఇటీవల పశ్చిమ బెంగళూరులో జరిగిన ఓ ప్రమాదంలో 65 ఏళ్ల దివ్యాంగుడు మరణించిన ఘటన కలిచివేసినట్లు చెప్పుకొచ్చింది. తాత, ఈ కుటుంబాలు వారి మరణాలను ఎలా ఎదుర్కోవాలో దయచేసి మాకు చెప్పండి' అంటూ ధవణి దీనంగా అడుగుతోంది.
అయితే ఈ విషయంపై ధవణిని సంప్రదించగా.. 'అనేక మంది గుంతల కారణంగా బైక్‌పై నుంచి పడి ప్రాణాలు కోల్పోవడం తను వీడియో తీసినట్లు వివరించింది. లైబ్రరీలో వార్తా పత్రికలు చదువుతున్నప్పుడు రోడ్లు సరిగా లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారని కూడా తను తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చింది. వీటిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే.. తనే ఒక్కొక్కటిగా పూడ్చడం ప్రారంభిస్తానని' ధవణి చెప్తోంది.
చదవండి: (అమిత్ షా బర్త్‌డే రోజు ట్రెండ్ అయిన అంకుశం రామిరెడ్డి.. వైరల్ ట్వీట్)
Comments
Please login to add a commentAdd a comment