Bengaluru Man Credits City Traffic For His Marriage, His Love Story Viral - Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వల్లే...ప్రేమలో పడ్డా!: లవ్‌ స్టోరి వైరల్‌

Published Wed, Sep 21 2022 12:32 PM | Last Updated on Wed, Sep 21 2022 1:36 PM

Man Shares His Love Story Credit Gives Bengalurus Traffic Goes Viral - Sakshi

బెంగుళూరులో ట్రాఫిక్‌ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఒక పక్క ట్రాఫ్రిక్‌ సమస్య తోపాటు, గుంతలమయమైన రహదారులతో నిత్యం ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదర్కొంటున్న సంగతి తెలిసిందే. ఐతే ఇక్కడొక వ్యక్తి ఆ టాఫ్రిక్‌ సమస్య కారణంగానే తాను ప్రేమలో పడ్డానని, పెళ్లి కూడా చేసుకున్నానని చెబుతున్నాడు. 

వివరాల్లోకెళ్తే...బెంగళూరులోని ఒక వ్యక్తి ఎజిపురా ఫ్లై ఓవర్‌ నిర్మాణం వల్ల వారు ట్రాఫిక్‌లో చిక్కు‍కున్నాడు. అప్పుడే అతను తన భార్యని సోనీ వరల్డ్‌ సిగ్నల్‌ వద్ద చూసినట్లు చెబుతున్నాడు. ఆ రోజు విపరితమైన ట్రాఫిక్‌ కారణంగా... షార్ట్‌కట్‌లో వెళ్లే మరో మార్గాన్ని ఎంచుకోవాలసి వచ్చింది. ఆ రహదారి గుంతమయం కావడం, మరోవైపు బాగా ఆకలి దంచేయడంతో ఆ రోజు తాము ఒక రెస్టారెంట్‌కి వెళ్లాం.

అప్పుడే తమ మధ్య ప్రేమ చిగురించిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తాము మూడేళ్లు డేటింగ్‌లో ఉన్నామని. తదనంతర పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తమ పెళ్లై రెండేళ్లవుతుందని చెబుతున్నాడు. ఐతే తాము ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం కూడా అయిపోయి దాదాపు ఐదేళ్లు అయినా... ఆ ఫ్లైఓవర్‌ మాత్రం నిర్మాణంలోనే ఉంది. ట్రాఫ్రిక్‌ సమస్య కూడా తీరలేదని వాపోయాడు.

ఇలా అతను వినూత్నంగా తన ట్రాఫిక్‌ కష్టాలు కారణంగా తాను ఒక ఇంటివాడిని అయ్యానంటూనే...రహదారుల పరిస్థితి, ట్రాఫిక్‌ కష్టాలను వివరించాడు. ప్రస్తుతం ఈ లవ్‌ స్టోరీ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు అతని ప్రేమ కథను విని....ట్రాఫిక్‌ కొందరికి చేదు అనుభవాలు ఇస్తే, అతనికి మాత్ర మాత్రం మంచి అనుభవాన్ని ఇచ్చిందంటూ ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. 

(చదవండి: సీఎం ముఖచిత్రంతో 'పేసీఎం'.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్‌ అస్త్రం)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement