potholes on roads
-
Nitin Gadkari: రోడ్డు బాగాలేకపోతే టోల్ వసూలు చేయొద్దు
న్యూఢిల్లీ: రహదారి సరిగ్గా లేకపోతే వాహనదారుల నుంచి టోల్ రుసుము వసూలు చేయొద్దని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ రహదారుల నిర్వహణ సంస్థలను ఆదేశించారు. శాటిలైట్ ఆధారిత టోల్ రుసుముల వసూలుపై బుధవారం ఢిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించలేనప్పుడు టోల్ చార్జి వసూలు చేయొద్దని అన్నారు. గుంతలు, బురదతో నిండిన రోడ్లపై కూడా టోల్ వసూలు చేస్తే జనం నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,000 కిలోమీటర్ల మేర రహదారులపై ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
బాచుపల్లిలో విషాదం: రోడ్డుపై గుంతకు బలైన చిన్నారి
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై గుంతకు చిన్నారి బలైంది. గుంతలో బండి పడటంతో చిన్నారి ఎగిరి రోడ్డుపై పడింది. చిన్నారిపై నుంచి స్కూల్ బస్సు వెళ్లడంతో పాప అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నారిని తన తండ్రి బండి మీద తీసుకెళ్తుండగా బాచుపల్లి పరిధిలో రెడ్డీస్ ల్యాబ్ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. అతివేగంగా వెనుక నుంచి బైక్‌ను బస్సు డ్రైవర్ ఢీకొట్టాడు. బైక్‌పై నుంచి ఎగిరిపడిన ఎనిమిదేళ్ల దీక్షిత బస్సు వెనుక చక్రాల కింద పడి మృతిచెందింది. డ్రైవర్ రహీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దీక్షిత 2వ తరగతి చదువుతోంది. చదవండి: ఒక్కగానొక్క కుమార్తె.. స్నానం చేసేందుకు బాత్రూమ్కు వెళ్లి, నీటి కొళాయిని తాకగానే.. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రాణాన్ని బలితీసుకున్న గుంతల రోడ్డు
సాక్షి, చెన్నై: తమిళనాడులో గుంతల రోడ్డు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రాణాన్ని బలి తీసుకుంది. చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 22 ఏళ్ల యువతి మృత్యువాతపడింది. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి వాహనంపై నుంచి పడిపోవడంతో ఆమెను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మధుర వాయిల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. పోరూర్ లక్ష్మీనగర్‌కు చెందిన సెల్వకుమార్ కుమార్తె శోభన(22) ఓ ప్రైవేటు కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది.. నీట్ కోచింగ్ క్లాస్ కోసం మంగళవారం తన సోదరుడిని స్కూల్‌కు దింపేందుకు ఆమె వెళ్లింది. మంగళవారం ఉదయం తన సోదరుడు హరీష్‌ను నీట్ కోచింగ్ కోసం స్కూల్ వద్ద దింపేందుకు ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. మధురవాయిల్ ప్రాంతంలో వెళ్తుండగా సర్వీసు రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి వాహనంపై నుంచి జారి ఇద్దరు కిందపడిపోయారు. వెనకాల వెనుక వేగంగా వచ్చిన లారీ ఆమె మీదుగా వెళ్లడంతో శోభనా ఘటనా స్థలంలోనే మరణించింది. హరీష్ స్వల్ప గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఘటనా స్థలం నుంచి ట్రక్కు డ్రైవర్ పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: సీఐతో మహిళా ఎస్ఐ ప్రేమ వ్యవహారం.. సీపీ సంచలన నిర్ణయం -
వినూత్న నిరసన: నడి రోడ్డుపై భారీ గుంత.. ఇది పార్టీ టైం..!
-
గుంతల రోడ్డు.. బురద నీటిలో స్నానం చేసి గ్రామస్థుల నిరసన
బెంగళూరు: కర్ణాటక తముకురూ జిల్లాలో ప్రభుత్వంపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు గ్రామస్థులు. రోడ్డుపై బురద నీటిలో స్నానం చేశారు. ఇటీవల కరిసిన భారీ వర్షాల కారణంగా హులికేరి ప్రాంతంలో రోడ్లు బరద మడుగులను తలపించాయి. నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు దయనీయంగా తయారైంది. రోడ్డు మరమ్మతులు చేయాలని అధికారులను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోయారు. తమ దుస్థిని అందరికీ తెలియజేసేందుకే గుంతల రోడ్డులో బురద నీటితో స్నానం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో మరికొందరు కూడా తమమైన రితీలో నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్డుపైనే ఫోటో షూట్లు పెట్టారు. చదవండి: కూర మాడిందని భార్యను చంపేసి.. గుట్టుచప్పుడు కాకుండా..! -
ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం వల్లే...ప్రేమలో పడ్డా!: లవ్ స్టోరి వైరల్
బెంగుళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఒక పక్క ట్రాఫ్రిక్ సమస్య తోపాటు, గుంతలమయమైన రహదారులతో నిత్యం ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదర్కొంటున్న సంగతి తెలిసిందే. ఐతే ఇక్కడొక వ్యక్తి ఆ టాఫ్రిక్ సమస్య కారణంగానే తాను ప్రేమలో పడ్డానని, పెళ్లి కూడా చేసుకున్నానని చెబుతున్నాడు. వివరాల్లోకెళ్తే...బెంగళూరులోని ఒక వ్యక్తి ఎజిపురా ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల వారు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడు. అప్పుడే అతను తన భార్యని సోనీ వరల్డ్ సిగ్నల్ వద్ద చూసినట్లు చెబుతున్నాడు. ఆ రోజు విపరితమైన ట్రాఫిక్ కారణంగా... షార్ట్‌కట్‌లో వెళ్లే మరో మార్గాన్ని ఎంచుకోవాలసి వచ్చింది. ఆ రహదారి గుంతమయం కావడం, మరోవైపు బాగా ఆకలి దంచేయడంతో ఆ రోజు తాము ఒక రెస్టారెంట్‌కి వెళ్లాం. అప్పుడే తమ మధ్య ప్రేమ చిగురించిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తాము మూడేళ్లు డేటింగ్లో ఉన్నామని. తదనంతర పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తమ పెళ్లై రెండేళ్లవుతుందని చెబుతున్నాడు. ఐతే తాము ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం కూడా అయిపోయి దాదాపు ఐదేళ్లు అయినా... ఆ ఫ్లైఓవర్ మాత్రం నిర్మాణంలోనే ఉంది. ట్రాఫ్రిక్ సమస్య కూడా తీరలేదని వాపోయాడు. ఇలా అతను వినూత్నంగా తన ట్రాఫిక్ కష్టాలు కారణంగా తాను ఒక ఇంటివాడిని అయ్యానంటూనే...రహదారుల పరిస్థితి, ట్రాఫిక్ కష్టాలను వివరించాడు. ప్రస్తుతం ఈ లవ్ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అతని ప్రేమ కథను విని....ట్రాఫిక్ కొందరికి చేదు అనుభవాలు ఇస్తే, అతనికి మాత్ర మాత్రం మంచి అనుభవాన్ని ఇచ్చిందంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Top drawer stuff on Reddit today 😂😂@peakbengaluru pic.twitter.com/25H0wr526h — Aj (@babablahblah_) September 18, 2022 (చదవండి: సీఎం ముఖచిత్రంతో 'పేసీఎం'.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్ అస్త్రం) -
రోడ్డు పాడైందని ఆ ‘బడా గణేష్’ కమిటీకి భారీగా ఫైన్!
ముంబై: ఈ నెల తొలివారంలో దేశమంతా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడు పదోరోజు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఉత్సవాలు ముగిసిన వారం తర్వాత ముంబై నగర పాలక సంస్థ చేసిన పని ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. ముంబైలోని ప్రముఖ లాల్బాగ్చా రాజా గణేష్ ఉత్సవాల నిర్వహణ కమిటీకి భారీ జరిమానా విధించింది. మీ గణేష్ ఉత్సవాల కారణంగా రహదారిపై 183 గుంతలు పడి రోడ్డంతా పాడైపోయిందని నోటీసులు ఇచ్చింది. ఒక్కో గుంతకు రూ.2,000 చొప్పున మొత్తం రూ.3.66 లక్షలు చెల్లించాలని ఆదేశించింది బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ). గణేష్ ఉత్సవాలు ముగిసిన తర్వాత నగర పాలక సంస్థ అధికారులు తనిఖీలు చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. లాల్బాగ్చా రాజా గణేష్ ఉత్సవ కమిటీకి పంపించిన లేఖలో.. డాక్టర్ బాబాసాహేబ్ రోడ్ నుంచి టీబీ కడమ్ మార్గ్ వరకు రోడ్డు మొత్తం పాడైపోయిందని తెలిపింది బీఎంసీ ఈవార్డ్ కార్యాలయం. ఇదీ చదవండి: సీఎం ముఖచిత్రంతో ‘పేసీఎం’.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్ అస్త్రం! -
రోడ్డుపై గుంత ఎంతపని చేసింది.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణాలు!
ముంబై: రోడ్లపై పడిన గుంతలను సకాలంలో పూడ్చకుండా అధికారులు చేసిన నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. గుంత కారణంగా బైక్ అదుపుతప్పి లారీ టైర్ కింద పడి నుజ్జునుజ్జయ్యాడు ఓ యువకుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితుడిని గణేష్ ఫాలే(22)గా గుర్తించినట్లు థానే మున్సిపల్ కర్పోరేషన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు. అదుపుతప్పి లారీ టైర్ల కింద పడిపోయిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దివా-అగసాన్ రోడ్డులో యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. ఎదురుగా ట్యాంకర్ లారీ వస్తోంది. దీంతో పక్కనుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ మార్గంలో గుంత ఉంది. బైక్ వెనుక చక్రం అందులోకి వెళ్లగానే అదుపుతప్పింది. దీంతో లారీ వెనుక చక్రాల కింద పడిపోయాడు బాధితుడు. లారీ డ్రైవర్ చూసుకోకపోవటం వల్ల అతడిపై నుంచి వెళ్లింది. ఎదురుగా వస్తున్న కొందరు వెంటనే స్పందించి లారీ ఆపాలని సూచించారు. ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు తలెత్తాయి. బాధితుడిని వెంటనే కల్వా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చనిపోయినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌గా మారిన క్రమంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఎమ్మెల్యే రాజు పాటిల్ ట్వీట్ చేశారు. రోడ్డుపై గుంతల కారణంగా ఓ వ్యక్తి మరణించాడని అధికారులపై విమర్శలు చేశారు. ఏక్నాథ్ షిండేకు ట్యాగ్ చేస్తూ రోడ్డు పనులు కేవలం పేపర్‌పైనే ఉన్నాయని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. दिवा ठाण्यात, आणि ठाण्याचेच मुख्यमंत्री…..दिव्यात आज पुन्हा एकदा खड्ड्यामुळे बळी गेला. कामांच्या फक्त कागदावर घोषणा होत आहेत पण कामं होत नाहीत. @TMCaTweetAway अजून किती बळी घेणार ? @mieknathshinde @CMOMaharashtra pic.twitter.com/vKo3K8bBWa — Raju Patil ( प्रमोद (राजू) रतन पाटील ) (@rajupatilmanase) August 28, 2022 ఇదీ చదవండి: వాహనదారులకు అలర్ట్: ఆ హైవేపై భారీ వాహనాలకు నిషేధం -
ఎమ్మెల్యే కళ్లెదుటే.. బురద నీటిలో కేరళ వ్యక్తి స్నానం, యోగా..
నిత్యం వందలు, వేల సంఖ్యలో వాహనాలు వెళ్లే రహదారులు దాదాపు రాత్రింబవళ్లు రద్దీగా ఉంటాయి. అలాంటి రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారుతుంటాయి. ఇక వర్షాకాలంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం పడుతున్నంత సేపు వరద నీటితో రోడ్లు నిండిపోతే.. వాన వెలిసిన తర్వాత ఎక్కడ చూసినా సగం కొట్టుకుపోయిన రోడ్లు, గుంతలు, గతుకులే దర్శనమిస్తాయి.. ఇలాంటి రహదారులపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే రోడ్ల మరమ్మత్తులు చేపట్టడం లేదని తాజాగా కేరళలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. ఇటీవల కురిసిన వర్షానికి మలప్పురం ప్రాంతంలోని రోడ్లపై గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచిపోయాయి. అయితే దీనిని అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఓ వ్యక్తి స్వయంగా రంగంలోకి దిగాడు. స్థానిక ఎమ్మెల్యే యూఏ లతీఫ్ ముందు ఎమ్మెల్యే ఎదురుగానే గుంతల్లోని నీటిలో స్నానం చేశాడు. ఎమ్మెల్యే కారు సంఘటనా స్థలానికి చేరుకోగానే గుంతలో ధ్యానం చేయడం ప్రారంభించాడు. బురద నీటిలో యోగా చేశాడు. చెప్పులు శుభ్రం చేసుకొని, బట్టలు కూడా ఉతుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలోని వ్యక్తిని హంజా పోరాలిగా గుర్తించారు. #WATCH | Kerala: A man in Malappuram protested against potholes on roads in a unique way by bathing & performing yoga in a water-logged pothole in front of MLA on the way pic.twitter.com/XSOCPrwD5f— ANI (@ANI) August 9, 2022 కాగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి వ్యతిరేకంగా కేరళలో గత వారం అనేక నిరసనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఆందోళనలు ఏ రాజకీయ నాయకుడి దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఇదిలా ఉండగా అయిదు రోజుల క్రితం ఎర్నాకుళం జిల్లాలోని నెడుంబస్సేరి వద్ద జాతీయ రహదారిపై గుంతల కారణంగా 52 ఏళ్ల వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అతనిపై ట్రక్కు వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో వారం రోజుల్లోగా తమ ఆధీనంలోని ప్రతి రోడ్డును బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను కేరళ హైకోర్టు ఆదేశించింది. -
వైరల్: ధవణి దీనంగా.. ప్లీజ్ సీఎం తాతా వాటిని పూడ్చండి..
బెంగళూరు: నగరంలోని రోడ్లపై గుంతలను పూడ్చాలంటూ ఏడేళ్ల బాలిక కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి విజ్ఞప్తి చేసింది. వివరాల్లోకెళ్తే.. తుమకూరు జిల్లా తిప్టూర్ మండలం హెగ్గనహళ్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 2వ తరగతి విద్యార్థిని ధవణి నగరంలో గుంతల తొలగింపు కోసం తాను పొదుపు చేసిన పాకెట్ మనీని ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో ద్వారా వివరించింది. 73 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 'సీఎం తాతా.. మన బెంగుళూరులో రోడ్లు సరిగా లేవు. కొందరు కుటుంబ సభ్యులు పనికి వెళ్తారు. ఇంట్లో మిగిలిన వారు వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే, మా నాన్న క్షేమంగా ఇంటికి తిరిగొస్తారని నేను వేచి ఉంటాను. దయచేసి గుంతలను పూడ్చి వారి ప్రాణాలను కాపాడండి' అని కోరింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఓ ప్రమాదంలో తన తల్లికి కాలు విరిగిపోయి కుటుంబం పడుతున్న ఇబ్బందులను గుర్తుకు చేసుకుంది. ఇటీవల పశ్చిమ బెంగళూరులో జరిగిన ఓ ప్రమాదంలో 65 ఏళ్ల దివ్యాంగుడు మరణించిన ఘటన కలిచివేసినట్లు చెప్పుకొచ్చింది. తాత, ఈ కుటుంబాలు వారి మరణాలను ఎలా ఎదుర్కోవాలో దయచేసి మాకు చెప్పండి' అంటూ ధవణి దీనంగా అడుగుతోంది. అయితే ఈ విషయంపై ధవణిని సంప్రదించగా.. 'అనేక మంది గుంతల కారణంగా బైక్‌పై నుంచి పడి ప్రాణాలు కోల్పోవడం తను వీడియో తీసినట్లు వివరించింది. లైబ్రరీలో వార్తా పత్రికలు చదువుతున్నప్పుడు రోడ్లు సరిగా లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారని కూడా తను తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చింది. వీటిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే.. తనే ఒక్కొక్కటిగా పూడ్చడం ప్రారంభిస్తానని' ధవణి చెప్తోంది. చదవండి: (అమిత్ షా బర్త్‌డే రోజు ట్రెండ్ అయిన అంకుశం రామిరెడ్డి.. వైరల్ ట్వీట్) -
నడి రోడ్డుపై మహిళల ఫ్యాషన్ షో.. ఎందుకో తెలుసా?
భోపాల్: మహిళలు నడిరోడ్డుపై.. నీటి కుంటల వద్ద హొయలొలుకుతూ క్యాట్ వాక్ చేశారు. రోడ్డుపై ఫ్యాషన్ షో మొదలుపెట్టడం మధ్యప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. వారు అలా ఎందుకు చేశారో తెలుసా..? తమ ప్రాంతంలో రోడ్లు బాగా లేవని చెప్పేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు మహిళలు తెలిపారు. రోడ్డుపై గుంతలతో తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పేందుకు.. అధికారుల నిర్లక్ష్యం చూపించేందుకు తాము ఈ తరహా ఆందోళన చేసినట్లు వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: పదో తరగతి పాసయిన మాజీ సీఎం.. దాంతోపాటు ఇంటర్ కూడా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని హోషంగాబాద్, ధనిశ్‌నగర్‌లో రోడ్లు బాగా లేవు. గుంతలు తేలడంతో రోడ్డు ప్రమాదకరంగా మారింది. దీనికి తోడు వర్షాలకు నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టింపు లేకపోవడంతో నారీమణులు కొంగు బిగించి రోడ్డు బాట పట్టారు. ధర్నాలు, కార్యాలయాల ముట్టడితో పని లేదని విన్నూత్నంగా చేద్దామని ఫ్యాషన్ షో ప్లాన్ వేశారు. అనుకున్నదే తడువుగా ధనీశ్‌నగర్ మహిళలు బయటకు వచ్చారు. రోడ్డుపై గుంతలు ఉన్న చోట.. నీరు నిలిచిన చోట ప్రత్యక్షమయ్యారు. ఫ్యాషన్ షో మాదిరి క్యాట్ వాక్ చేస్తూ నడిచారు. బురదలోనే నడిచారు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలని తమ అందచందాలతో డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో తాము ఈ విధంగా నిరసన చేపట్టినట్లు మహిళలు తెలిపారు. రోడ్డుపై ప్రమాదకరంగా గుంతలు తయారయ్యాయని వాపోయారు. మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లపై చూపించే శ్రద్ధ ప్రజల సమస్యలను పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం చెల్లించే పన్నులను ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ మహిళల విన్నూత్న నిరసన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కోట్లు మింగుతున్న గుంతలు.. అయినా కనిపించని ప్రయోజనం
సాక్షి, హైదరాబాద్: భారీ ఫ్లై ఓవర్లు, కేబుల్ బ్రిడ్జిలు తదితరమైనవెన్నో నిర్మిస్తున్న బల్దియా రోడ్లపై గుంతలు(పాట్‌హోల్స్) సమస్యలను మాత్రం పరిష్కరించలేకపోతోంది. పాట్‌హోల్స్ సమస్యలు లేకుండా ఉండేందుకు రోడ్ల నిర్మాణంలో బలంగా ఉండే పాలిమర్ మోడిఫైడ్ బిటుమన్(పీఎంబీ), క్రంబ్ రబ్బర్ బిటుమన్(సీఆర్‌ఎంబీ) వాడుతున్నా ఒక్క వానకే చిల్లులు పడుతున్న రోడ్లపై ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. పాట్‌హోల్స్ లేకుండా చేసేందుకు జీహెచ్ఎంసీకి ఎంతకాలం కావాలంటూ ఇటీవలే æహైకోర్టు సైతం ప్రశి్నంచింది. జీహెచ్ఎంసీ ఇంజినీర్లకంటే భారీ కంపెనీల ప్రైవేట్ ఏజెన్సీల పర్యవేక్షణతో సమస్యలుండవని భావించి వాటికి కాంట్రాక్టులు ఇచ్చినా రోడ్ల సమస్యలు తీరలేదు. బల్దియా ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, సాంకేతికత వినియోగించినా, రీ కార్పెటింగ్ చేస్తున్నా సమస్యల పరిష్కారానికి మోక్షం లభించడం లేదు. ఖర్చవుతున్నా.. కనిపించని ప్రయోజనం రోడ్లను జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదనుకుంటే పొరపాటే. బల్దియా బడ్జెట్లో దాదాపు 16 శాతం రోడ్ల కోసమే కేటాయిస్తున్నారు. 2020–21 ఆరి్థక సంవత్సరమైతే, బల్దియా ఎన్నికల వల్లనో, మరో కారణమో కానీ ప్రతి సంవత్సరం కంటే రెట్టింపు నిధులు ఖర్చు చేశారు. మొత్తం రూ.1,126 కోట్లు రోడ్లపై కుమ్మరించారు. అయినా ప్రజల సమస్యలు తీరలేదు. రోడ్ల నిర్మాణాలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు, పాట్‌హోల్స్ పూడ్చివేతలకు.. ఇలా వివిధ అంశాల పేరిట నిధులు రోడ్లపాలవుతున్నాయే తప్ప జనం ఇబ్బందులు తీరడం లేదు. గడచిన నాలుగైదు సంవత్సరాలుగా జీహెచ్ఎంసీ చేసిన వ్యయం వివరాలను చూస్తే.. సమగ్ర రోడ్డు నిర్వహణ పేరిట ప్రధాన రహదారుల మార్గాల్లోని 709 కి.మీ.ల మేర రోడ్లను ఐదేళ్లపాటు కాంట్రాక్టును పెద్ద ఏజెన్సీలకు ఇచ్చారు. మార్గాలు ఎప్పుడూ సాఫీ ప్రయాణానికి అనుకూలంగా ఉండాలనేదే కాంట్రాక్టు ఒప్పందంలోని ప్రధానాంశం. కానీ వీటి దారుల్లో సైతం 11వేలకు పైగా గుంతలు పూడ్చినట్లు పేర్కొన్నారు. ప్రివెంటివ్ పీరియాడికల్ మెయింటెనెన్స్ పేరిట.. ► మనుషులు హెల్త్ చెకప్ చేయించుకుంటే వ్యాధి లక్షణాలు తొలిదశలోనే గుర్తించి, వ్యాధి తీవ్రత పెరగకుండా చూసుకున్నట్లు.. రోడ్లను కూడా పూర్తిగా దెబ్బతిన్నాక వేయడం కంటే ముందే నిర్ణీత వ్యవధుల్లో మరమ్మతులు చేస్తే ఎక్కువకాలం మన్నికగా ఉంటాయని 2018–19లో పీరియాడికల్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్(పీపీఎం) పేరిట మరమ్మతులు చేశారు. పీఎంబీ, సీఆర్‌ఎంబీ రోడ్లు వేసేందుకు మొత్తం 119 పనులకు రూ.712 .86 కోట్లు ఖర్చు చేశారు. ►రోడ్ల నాణ్యత బాగుండేందుకు నిర్వహణలు, కొత్త రోడ్ల పేరిట ఐదేళ్లలో మరో 11,897 పనుల పేరిట రూ.2,520.32 కోట్లు ఖర్చు చేశారు. ►ఇక ట్రాన్స్‌కో, బీఎస్ఎన్ఎల్, టీఎస్ఎస్పీడీసీఎల్, బీజీఎల్ తదితర సంస్థలు వాటి అవసరాల కోసం రోడ్ల తవ్వకాలు జరపడం, వర్షాలకు ధ్వంసం కావడం వంటి కారణాలతో ఏర్పడ్డ పాట్‌హోల్స్ పూడ్చేందుకు ఐదేళ్లలో రూ.26.75 కోట్లు ఖర్చయింది. మొత్తం 2,43,455 పాట్‌హోల్స్ పూడ్చివేసినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ► వర్షాకాలంలో నిల్వనీటిని వెంటనే తోడిపోయడం, రోడ్లు మరమ్మతులు చేయడం వంటి వాటికోసం మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్(ఎంఈటీ), ఇన్స్టంట్ రిపేర్ టీమ్స్ పేరిట ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు, సామగ్రి తదితరమైన వాటి కోసం నాలుగేళ్లలో రూ.144.05 కోట్లు ఖర్చు చేశారు. పాట్‌హోల్స్ మాత్రమే కాకుండా పెద్దసైజు ప్యాచ్‌వర్క్‌లు తదితరమైనవి సత్వరం చేసేందుకని జెట్ ప్యాచర్స్ మెషిన్లను ఏటా దాదాపు రూ.15 కోట్ల అద్దెతో తీసుకున్నారు. అలా గడచిన మూడేళ్లలో దాదాపు రూ.45 కోట్లు చెల్లించారు. ఇలా వివిధ పనుల పేరిట నాలుగైదేళ్లలో దాదాపు రూ.4 వేల కోట్లయితే ఖర్చయింది కానీ, సమస్య మాత్రం తీరలేదు. -
3 రోజులు.. 3,069 గుంతలు
సాక్షి, సిటీబ్యూరో: వానొస్తే నగర జీవనం నరకం కాకూడదనే తలంపుతో సీఆర్ఎంపీ కింద ప్రధాన రహదారుల మార్గాల్లోని రోడ్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతల్ని ప్రైవేటు ఏజెన్సీలకిచ్చారు. రోడ్ల పరిస్థితి ఫర్వాలేదని భావిస్తున్న తరుణంలోనే.. ఇటీవల కురిసిన వరుస వర్షాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. జీహెచ్ఎంసీ నిర్వహణలోని రోడ్లతో పాటు సీఆర్ఎంపీ మార్గాల్లోనూ గుంతలు పడ్డాయి. ప్రయాణాలకు ఆటంకంగా మారి, అవస్థలుకలిగిస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీల మార్గాల్లో ఫిర్యాదు చేసేందుకుసంబంధిత ఏజెన్సీల ఫోన్ నంబర్లతో ఆయా మార్గాల్లో బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కే ఫిర్యాదు చేస్తున్నారు. ప్రధాన రహదారుల పరిస్థితి ఇలాఉండగా, కాలనీలు.. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వరుస వర్షాలతో నగరంలోని అనేక రహదారులు దెబ్బతిన్నాయి. నగరంలో వానొస్తే రోడ్లు జలమయం కావడం.. గుంతలమయం కావడం.. ప్రయాణం నరకప్రాయంగా మారడం.. నగర ప్రజలకు తెలిసిందే. ఈ సంవత్సరం ఇప్పటి వరకు వరుస వర్షాలు కురవకపోవడం.. కరోనా కారణంగా ప్రజలు చాలావరకు ఇళ్లల్లోనే ఉండటం.. లాక్డౌన్ తదితర కారణాలతో రోడ్ల సమస్యలు పెద్దగా దృష్టికి రాలేదు. ఈమధ్య వరుసబెట్టి కురిసిన వర్షాలతో అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. అధ్వానపు రోడ్ల సమస్యలు ఉండరాదనే తలంపుతో ఈ సంవత్సరం ప్రధాన రహదారుల మార్గాల్లోని 709 కి.మీ మేర రోడ్ల నిర్వహణను ప్రభుత్వం సీఆర్ఎంపీ (సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం) పేరిట బడా కాంట్రాక్టు ఏజెన్సీలకు అప్పగించింది. రోడ్ల నిర్మాణం పూర్తయినా, కాకున్నా వీటి అధీనంలో ఉన్న ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడ్డ పాట్‌హోల్స్ (గుంతలు) పూడ్చివేత తదితర మరమ్మతుల్ని ఈ ఏజెన్సీలే చేయాల్సి ఉంది. కాంట్రాక్టు ఒప్పందం మేరకు ఇప్పటి వరకు 50 శాతం రోడ్ల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉండగా పనులు పూర్తికాలేదు. మిగతా రోడ్లలో ఏర్పడే సమస్యల్ని సైతం ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. వర్షాలకు సీఆర్ఎంపీ పరిధిలోని మార్గాల్లో, ఇతర మార్గాల్లో వెరసి మొత్తం 3069 పాట్‌హోల్స్ ఏర్పడ్డట్లు అధికారులు గుర్తించారు. వాటి మరమ్మతుల పనులు వెంటనే చేపట్టామని, చాలా వరకు పూర్తి కాగా, మిగతావి త్వరలోనే పూర్తి అవుతాయన్నారు. ఫిర్యాదు చేసేదెలా? సీఆర్ఎంపీ ఏజెన్సీలు పనులు చేపట్టిన మార్గాల్లోని రోడ్లపై ఫిర్యాదులకు ఆయా మార్గాల్లో సదరు ఏజెన్సీ.. ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ పని జరగలేదు. త్వరలోనే ఫోన్ నంబర్లతో సైనేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత ఏజెన్సీలను ఆదేశించినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. రోడ్ల సమస్యలపై ఇప్పటి వరకు పెద్దగా ఫిర్యాదులు లేకపోవడంతో తాము కూడా ఇతర పనులపై దృష్టి సారించినట్లు, ఇప్పుడిక వీటిపై శ్రద్ధ చూపుతామని మరో అధికారి పేర్కొన్నారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించకుంటే కాంట్రాక్టు ఏజెన్సీలకు పెనాల్టీలు విధించవచ్చు. కానీ, ఫిర్యాదులే అందనిది పెనాల్టీలా వేస్తారో మరి! -
తనకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదని
ముంబై: మంచి పని చేసే వారిని ప్రశంసించడంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఎప్పుడు ముందే ఉంటారు. ఈ క్రమంలో శుక్రవారం లక్ష్మణ్ ముంబై రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడుస్తున్న ఓ వ్యక్తిని అభినందించారు. ఈ క్రమంలో ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు లక్ష్మణ్. ‘దాదరావ్ బిల్హోర్ ఓ ప్రమాదంలో తన 16 ఏళ్ల కుమారుడిని కోల్పోయారు. కొడుకు మరణం తనను ఎంతో కుంగదీసింది. తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని భావించాడు. దాంతో పేవర్ బ్లాక్స్, కంకర, రాళ్లు, పారతో రోడ్లపై తిరుగుతూ ఎక్కడ గుంత కనిపిస్తే.. అక్కడికి వెళ్లి పూడ్చడం ప్రారంభించాడు. అతడి ప్రయత్నాన్ని ప్రశంసించడానికిక మాటలు చాలడం లేదు’అంటూ లక్ష్మణ్ ట్వీట్ చేశారు. (స్పూర్తిని రగిలించే వీడియో ఇది) Dadarao Bilhore has been filling potholes in Mumbai ever since he lost his 16 yr old son to an accident caused by a pothole. Even as the grief was tearing him apart, armed with broken paver blocks, gravel, stones & shovel,he started filling every pothole he witnessed. No words 🙏 pic.twitter.com/Ww5raEEV4P — VVS Laxman (@VVSLaxman281) June 19, 2020 దాదరావ్ 16 ఏళ్ల కుమారుడు 2015, జూలైలో ముంబైలోని జోగేశ్వరి-విఖ్రోలి లింక్ రోడ్ (జేవీఎల్ఆర్)లోని గుంతల కారణంగా ప్రమాదానికి గురయ్యి మరణించాడు. దాంతో రోడ్లపై ఏర్పడే గుంతలను పూడ్చాల్సిందిగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారిని అభ్యర్థించాడు. కానీ వారు దాదరావ్ చెప్పిన సమస్యను పెద్దగా పట్టించుకోలేదు. ఇక లాభంలేదనుకుని తనే స్వయంగా పార, కంకర, ఇసుక తీసుకుని రోడ్ల మీద తనకు కనపడ్డ ప్రతి గుంతను పూడ్చడం ప్రారంభించాడు దాదరావ్. తన కొడుకు మరణించినప్పటి నుంచి ఇప్పటి వరకు 500 గుంతలను పూడ్చాడు. జనాలు ఈ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా ఒక యాప్‌ను కూడా క్రియేట్ చేశాడు దాదరావ్ బిల్హోర్. -
తారు బేఖారు..!
కరీంనగర్–వరంగల్ స్టేట్‌హైవే నరకప్రాయంగా మారింది. అడుగుతీసి అడుగు వేస్తే గుంతల మయం.. వాహనాల్లో ప్రయాణించే వారికి ఈ రహదారి ఇబ్బందికరంగా మారింది. ఒక్కో కిలోమీటరుకు సుమారుగా రూ.66.66 లక్షలు ఖర్చు చేసి నిర్మించిన రహదారికి బీటలు బారుతున్నాయి. రెట్టింపు అంచనాలతో బందోబస్తుగా ఉండాలని నిధులు కేటాయిస్తే మెరుగుపడాల్సిన సౌకర్యాలు దిగజారిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు మరింత దెబ్బతింది. అధికారులు, కాంట్రాక్టర్లు చేతులు కలపడంతో ఏడాదిన్నరకే కరీంనగర్–వరంగల్ రోడ్డు అధ్వానంగా తయారైంది. కరీంనగర్ నుంచి వరంగల్ వరకు పూర్తిగా చెడిపోయిన చోట్లల్లా నిర్మాణం, మరమ్మతుల పేరిట 48 కిలోమీటర్ల మేరకు పనులు చేశారు. ఇందుకోసం రూ.32 కోట్లు ఖర్చు చేశారు. అంతకుముందు రోడ్డు పనుల్లో నాణ్యత లేదని ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోగా, మరమ్మతుల పేరిట రూ.32 కోట్లతో చేసిన పనులు కూడా దెబ్బతింటుండటంతో ఈ రహదారిపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ మీదుగా వరంగల్ వరకు ఉన్న 70 కిలోమీటర్ల రహదారుల భవనాల శాఖ పరిధిలోని రోడ్డును నాలుగేళ్ల కిందటే జాతీయ రహదారులు (ఎన్‌హెచ్) పరిధిలోకి చేరుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశా రు. ఎన్‌హెచ్–563 నంబర్ సైతం కేటాయించారు. ఎన్‌హెచ్ పరిధిలోకి వెళ్లిన తర్వాత రహదారులు భవనాల శాఖ దీని నిర్వహణ నుంచి తప్పుకుంది. ఎన్‌హెచ్‌కు అప్పుడు స్థానికంగా కార్యాలయం, అధికారులు లేకపోవడం.. రహదారుల పరిస్థితిపై సరైన సమాచారం లేక రోడ్డు పూర్తిగా దెబ్బతినేంత వరకు మరమ్మతు చేయలేదు. ఈ రహదారి తమ పరిధిలో ఉన్నప్పుడు ఎన్‌హెచ్ విభాగం నుంచి నిధులు కేటాయించారు. మరమ్మతులు పూర్తయ్యాక రద్దీ దృష్ట్యా దీన్ని ఎన్హెచ్ఏఐ తన పరిధిలోకి తీసుకుంది. ప్రస్తుతం కరీంనగర్ ఎన్‌హెచ్‌కు కార్యాలయం పర్యవేక్షణ ఇంజినీర్ ఉన్నారు. కానీ.. ఈ రహదారి ఎన్హెచ్ఏఐ పరిధిలో ఉంది. దీంతో రహదారిపై ఎన్‌హెచ్ విభాగం పెద్దగా దృష్టిపెట్టడం లేదు. ఫలితంగా రోడ్లలో నాణ్యత లోపించి దెబ్బతింటున్నాయి. ఎన్‌హెచ్, ఎన్హెచ్ఏఐ శాఖల మధ్య సమన్వయం కొరవడడం ప్రజలకు శాపంగా మారగా, ఏ శాఖ పరిధిలోకి ఈ రోడ్డు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో రూ.32 కోట్లు వెచ్చించి చేసిన పనులో జవాబుదారీతనం లేకపోగా, అక్రమాలపై భుజాలు తడుముకోవడం, అధికారులు దాటవేసే పద్ధతిని అవలంబిస్తున్నారు. కాగా.. ఈ రహదారిపై నిత్యం ప్రయాణించే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం ఏమీ పట్టించుకోకపోవడం చర్చనీయాంశం అవుతోంది. కిలోమీటర్‌కు రూ.66.66 లక్షలు.. అప్పట్లో రోడ్డు శిథిలమవడంతో ఎట్టకేలకు జాతీయ రహదారుల సంస్థ రంగంలోకి దిగింది. ఏడాదిన్నర క్రితం కరీంనగర్–వరంగల్ మార్గం లో పూర్తిగా దెబ్బతిన్న 48 కిలోమీటర్ల మేర మరమ్మతుకు రూ.32 కోట్లు కేటాయించింది. అంటే సగటున కిలోమీటర్ మరమ్మతుకు రూ.66.66 లక్షలు. గతేడాదిలో దశల వారీగా ఈ మరమ్మతులు చేశారు. కానీ.. మొత్తంగా ఏడాదిన్నర పూర్త య్యే లోపే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎక్కడపడితే అక్కడ గుంతలు పడ్డాయి. దీంతో హడావిడిగా అక్కడక్కడ అతుకులు వేశారు. మరమ్మతుల నిర్వహణ రెండేళ్ల వరకు చేపట్టాల్సిన కాంట్రాక్టరు చేతులెత్తడంతో అగమ్యగోచరంగా మా రింది. రహదారుల మరమ్మతుకు సంబంధించి కనీసం రెండు మూడేళ్లపాటు నిర్వహణ చేపట్టాల ని ఒప్పందం కుదుర్చుకుంటారు. కానీ.. ఇప్పుడు ఎవరూ సరైన దృష్టి పెట్టకపోవడంతో గుత్తేదారు సంస్థ అప్పనంగా గాలికి వదిలేసింది. పనులు చేస్తున్న సమయంలో సరైన పర్యవేక్షణ లేక నామమాత్రంగా చేపట్టడంతో గుత్తేదారుకు భారీగా ల బ్ధి చేకూరింది. ప్రజాధనం వ్యయమైనా వాహనదారులు, ప్రయాణికులకు ఫలితం దక్కలేదు. ని రంతరం ఎక్కడో ఒక చోట రోడ్డుకు మరమ్మతు చేయాల్సిన పరిస్థితి. పనులు చేసే సమయంలో నాణ్యమైన తారు వాడకపోవడం, సరిగా రోలింగ్ చేయకపోవడం, ఇంజినీర్ల పర్యవేక్షణ లోపంతో నాసిరకం పనులు చేపట్టడంతో రూ.కోట్లు వెచ్చిం చినా.. ఫలితం లేకుండా పోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైవే పైనుంచి వెళ్లాలంటే భయంగా ఉంది కరీంనగర్–వరంగల్ హైవేపై గుంతలు పెద్దగా ఉన్నాయి. ఈ గుంతల రహదారిపై ద్విచక్ర వాహనంతో వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆఫీస్ పనులు ముగించుకొని రాత్రిపూట ఈ దారి గుండా వస్తుంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నాం. ఉన్నతాదికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలి. – నల్లా నవీన్, ప్రయాణికుడు, హుజూరాబాద్ గుంతలు తెలియక ప్రమాదాలు కరీంనగర్‌కు పనులు నిమిత్తం వెళ్లాలంటే రోడ్డు పరిస్థితిని చూసి ఇబ్బంది పడాల్సి వస్తోంది. కొత్తపల్లి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ బ్రిడ్జిపై పెద్ద గుంత ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వరకు రహదారి అస్తవ్యస్తంగా మారింది. అధికారులు స్పందించి రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలి. – మాట్ల శ్రీకాంత్, ప్రయాణికుడు, హుజూరాబాద్ -
రోడ్డు ప్రమాదాలపై సుప్రీం ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని రహదారుల ప్రమాదాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన రహదారులపై పడిన గుంతుల కారణంగా అనేక మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వారికంటే రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని జస్టిస్ మదన్ బి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం శుక్రవారం అభిప్రాయపడింది. ఈ అంశంపై రహదారుల భద్రతా సంస్థ దృష్టిసారించాలని కోర్టు ఆదేశించింది. పౌరుల జీవిత, మరణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించాలని కోర్టు వ్యాఖ్యానించింది. రహదారులపై జరిగే ప్రమాదాలు ఎక్కువ శాతం గుంటల కారణంగానే సంభవిస్తున్నాయని, ప్రభుత్వాలు వారికి నష్టపరిహారం కూడా చెల్లించవలసి వస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో తమకు నివేదికను అందజేయల్సిందిగా రహదారుల భద్రతా సంస్థను న్యాయస్థానం ఆదేశించింది. -
బెంగళూరులో జలకన్య.. విస్మయం
నిత్య రద్దీగా ఉండే బెంగళూరు నగర రోడ్లపై ఇప్పుడొక వింత వాహనదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. రోడ్డుపై ఏర్పడిన చిన్నపాటి సరస్సులో జలకన్య కనిపించడం.. బెంగళూరు వాసులను విస్మయపరుస్తోంది. అదే సమయంలో.. ఆ జలకన్యను... దానిని సృష్టించిన ఆర్టిస్/ఆర్ట్ డైరెక్టర్ బాదల్ నంజుందస్వామిని బెంగళూరు వాసులు మెచ్చుకుంటున్నారు. ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. చాలాచోట్ల రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి.. అందులో నీరు చేరి.. చిన్నపాటి నీటి సరస్సులను తలపిస్తున్నాయి. నగరంలోని రోడ్లపై 16వేల పాఠోహోల్స్ (గుంతలు) ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. గత సెప్టెంబర్ నెలలో బెంగళూరులో ఎడతెగని వర్షాలు ముంచెత్తాయి. అక్టోబర్ నెలలోనూ వర్షాలు కొనసాగాయి. ఈ వర్షాలకు నగరం రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఈ రహదారుల వల్ల వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వాహనదారుల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు బాదల్ తన కళతో ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే రద్దీగా ఉండే ఎంజీ రోడ్డుకు సమీపంలో.. పరేడ్ గ్రౌండ్‌కు దగ్గరగా ఉన్న జంక్షన్లో రోడ్డుపై ఏర్పడిన గుంతలో బాదల్ శుక్రవారం ఓ చిన్నపాటి సరస్సును చిత్రించాడు. అంతేకాదు సోను గౌడ అనే మోడల్ జలకన్యగా.. ఆ చిన్నపాటి సరస్సు వద్ద తచ్చాడుతూ కనిపించింది. నిత్యం రద్దీ ట్రాఫిక్ జామ్‌లో ప్రయాణించే వాహనదారులు కొంతసేపు ఆగి.. ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. పలువురు ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. మొత్తానికి రోడ్డుపై ఉన్న ఇలాంటి చిన్నపాటి సరస్సులు, చిరు చెరువులు, గుంతలు, కంతలు వెలుగులోకి తీసుకొచ్చి.. మున్సిపల్ సిబ్బంది వాటిని పట్టించుకొని మరమ్మతు చేసేలా గత కొన్నాళ్లుగా బాదల్ తన కళతో ప్రయత్నిస్తున్నాడు. గత ఏడాది రోడ్డుపై నీటిగుంటలో మొసలి చిత్రించడం ద్వారా ఆయన మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. రోడ్డుపై ఉన్న గుంతల్లో ఇలాంటి బొమ్మలు అనేకం చిత్రించడం ద్వారా ఈ సమస్యపై ప్రజల్లో, ప్రభుత్వ యంత్రాంగంలో అవగాహన కలిగించేలా ఆర్టిస్ట్ బాదల్ ప్రశంసనీయమైన కృషి చేస్తున్నాడు. After! #kamarajroad #potholes #nammabengaluru pic.twitter.com/e1m7QRlDJz — baadal nanjundaswamy (@baadalvirus) 13 October 2017 Before! #kamarajroad #potholes #nammabengaluru pic.twitter.com/MrgLTHuXTs — baadal nanjundaswamy (@baadalvirus) 13 October 2017 ☔ #throwback #potholes #nammabengaluru pic.twitter.com/lvTCaAPAa8 — baadal nanjundaswamy (@baadalvirus) 8 October 2017 Thankew everyone! #media #mcc #mysurumemes @DC_Mysuru @BangaloreTimes1 pic.twitter.com/N3W3DGsaGE — baadal nanjundaswamy (@baadalvirus) 4 August 2017 -
కారు వెనకే వెళ్లినా...
జంటనగరాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు కూడా అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ వానల ప్రభావానికి రోడ్లన్నీ బాగా పాడయ్యాయి. ఎక్కడ పడితే అక్కడ పెద్దపెద్ద గోతులు పడ్డాయి. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఈ గోతుల్లో పడి పెను ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. సరిగ్గా ఇదే అంశంపై గతంలో జరిగిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముందు కారు వెళ్తోంది కదా అని.. జాగ్రత్తగా దాని వెనకే వెళ్లిన ఓ మోటారు సైక్లిస్టు.. రోడ్డుపై ఉన్న పెద్ద గోతిలో పడిపోయాడు. చక్కగా హెల్మెట్ పెట్టుకుని.. వాననీళ్లు ఉన్నాయి కదాని జాగ్రత్తగా ఒక కారు వెనకాలే వెళ్లిన సదరు మోటారు సైకిల్ వ్యక్తి.. ఎదురుగా ఉన్నది నీళ్లే అనుకున్నాడు. ఎంత జాగ్రత్తగా ఆ నీళ్లలోంచి వెళ్లినా.. రోడ్డు మీద పడిన పెద్ద గోతిలో పడిపోయాడు. ఎలాగోలా అక్కడి నుంచి పైకి లేచి.. పక్కకు వచ్చాడు గానీ, అతడి మోటార్ సైకిల్ మాత్రం పూర్తిగా గోతిలోనే ఉండిపోయింది. గతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో చాలా రోడ్ల పరిస్థితి ఇలాగే ఉందని, అందువల్ల నీళ్లలోంచి ద్విచక్ర వాహనాల మీద వెళ్లేటప్పుడు, నడిచేటపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. -
కారు వెనకే వెళ్లినా...