![Techie Mowed Down By Truck While Trying To Avoid Pathole In Chennai - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/4/techie.jpg.webp?itok=Jms9BkzR)
సాక్షి, చెన్నై: తమిళనాడులో గుంతల రోడ్డు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ప్రాణాన్ని బలి తీసుకుంది. చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 22 ఏళ్ల యువతి మృత్యువాతపడింది. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి వాహనంపై నుంచి పడిపోవడంతో ఆమెను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మధుర వాయిల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాలు.. పోరూర్ లక్ష్మీనగర్‌కు చెందిన సెల్వకుమార్ కుమార్తె శోభన(22) ఓ ప్రైవేటు కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది.. నీట్ కోచింగ్ క్లాస్ కోసం మంగళవారం తన సోదరుడిని స్కూల్‌కు దింపేందుకు ఆమె వెళ్లింది. మంగళవారం ఉదయం తన సోదరుడు హరీష్‌ను నీట్ కోచింగ్ కోసం స్కూల్ వద్ద దింపేందుకు ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై బయల్దేరారు.
మధురవాయిల్ ప్రాంతంలో వెళ్తుండగా సర్వీసు రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి వాహనంపై నుంచి జారి ఇద్దరు కిందపడిపోయారు. వెనకాల వెనుక వేగంగా వచ్చిన లారీ ఆమె మీదుగా వెళ్లడంతో శోభనా ఘటనా స్థలంలోనే మరణించింది. హరీష్ స్వల్ప గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు.
ఘటనా స్థలం నుంచి ట్రక్కు డ్రైవర్ పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: సీఐతో మహిళా ఎస్‌ఐ ప్రేమ వ్యవహారం.. సీపీ సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment