తనకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదని | VVS Laxman Lauds Man Filling Potholes in Mumbai | Sakshi
Sakshi News home page

రోడ్లపై గుంతలు పూడుస్తున్న వ్యక్తి.. వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంస

Published Fri, Jun 19 2020 3:13 PM | Last Updated on Fri, Jun 19 2020 3:29 PM

VVS Laxman Lauds Man Filling Potholes in Mumbai - Sakshi

రోడ్లపై ఏర్పడ్డ గుంతలు పూడుస్తున్న దాదరావ్‌ బిల్హోర్‌

ముంబై: మంచి పని చేసే వారిని ప్రశంసించడంలో మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎప్పుడు ముందే ఉంటారు. ఈ క్రమంలో శుక్రవారం లక్ష్మణ్‌ ముంబై రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడుస్తున్న ఓ వ్యక్తిని అభినందించారు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు లక్ష్మణ్‌. ‘దాదరావ్ బిల్హోర్ ఓ ప్రమాదంలో తన 16 ఏళ్ల కుమారుడిని కోల్పోయారు. కొడుకు మరణం తనను ఎంతో కుంగదీసింది. తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని భావించాడు. దాంతో పేవర్‌ బ్లాక్స్‌, కంకర, రాళ్లు, పారతో రోడ్లపై తిరుగుతూ ఎక్కడ గుంత కనిపిస్తే.. అక్కడికి వెళ్లి పూడ్చడం ప్రారంభించాడు. అతడి ప్రయత్నాన్ని ప్రశంసించడానికిక మాటలు చాలడం లేదు’అంటూ లక్ష్మణ్‌ ట్వీట్‌ చేశారు. (స్పూర్తిని రగిలించే వీడియో ఇది)

దాదరావ్‌ 16 ఏళ్ల కుమారుడు 2015, జూలైలో ముంబైలోని జోగేశ్వరి-విఖ్రోలి లింక్ రోడ్ (జేవీఎల్ఆర్)లోని గుంతల కారణంగా ప్రమాదానికి గురయ్యి మరణించాడు. దాంతో రోడ్లపై ఏర్పడే గుంతలను పూడ్చాల్సిందిగా బృహన్‌ముంబై  మున్సిపల్‌ కార్పొరేషన్‌ వారిని అభ్యర్థించాడు. కానీ వారు దాదరావ్‌ చెప్పిన సమస్యను పెద్దగా పట్టించుకోలేదు. ఇక లాభంలేదనుకుని తనే స్వయంగా పార, కంకర, ఇసుక తీసుకుని రోడ్ల మీద తనకు కనపడ్డ ప్రతి గుంతను పూడ్చడం ప్రారంభించాడు దాదరావ్‌. తన కొడుకు మరణించినప్పటి నుంచి ఇప్పటి వరకు 500 గుంతలను పూడ్చాడు. జనాలు ఈ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా ఒక యాప్‌ను కూడా క్రియేట్‌ చేశాడు దాదరావ్‌ బిల్హోర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement