VVS lakshman
-
‘మేజర్’ పై వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు
26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. (చదవండి: 'మేజర్' టీమ్‌కు వెండి నాణేన్ని బహుకరించిన సీఎం) తాజాగా ఈచిత్రంపై టీమిండియా మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ఇప్పుడే మేజర్ సినిమాను చూశాను. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజమైన స్ఫూర్తిదాయకమైన కథ ఇది. మీకు బాగా నచ్చుతుంది. అడివి శేష్ అద్భుతంగా నటించి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. కచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది’అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. Just finished watching #Major and I have to say it's not just a film but an emotion. A really inspiring story of Major Sandeep Unnikrishnan that hits you right in the feels. Great job by @AdiviSesh to take it to another level. A must-watch! 👌🏻 pic.twitter.com/0nOxIwJCvL — VVS Laxman (@VVSLaxman281) June 21, 2022 -
రిజ్వాన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన వీవీఎస్ లక్ష్మణ్..
VVS Laxman lauds Mohammad Rizwan for playing semi final clash: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా గురువారం(నవంబర్11)న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓటమి చవిచూసినప్పటికీ.. ఆ జట్టు స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో మహ్మద్ రిజ్వాన్‌ను భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్రశంసించాడు. ధైర్యానికి, దృఢ సంకల్పానికి గొప్ప ఉదాహరణగా రిజ్వాన్‌ను అతడు అభివర్ణించాడు. తన ఆరోగ్యం కంటే తన జాతీయ జట్టుకు ఆడటానికి రిజ్వాన్ ఎక్కువ ప్రాధన్యత ఇచ్చాడు అని లక్ష్మణ్ కొనియాడాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో సెమీ ఫైనల్‌కు ముందు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో ఉండే విషయంపై సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫ్లూ కారణంగా వారు జట్టుకు దూరం కానున్నారనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు వైద్యుడు నజీబ్ సొమ్రూ... ‘‘నవంబరు 9న మహ్మద్ రిజ్వాన్ తీవ్రమైన చెస్ట్ ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన తర్వాత కోలుకున్నాడు’’ అని తెలిపాడు. అయితే జట్టులోకి వచ్చిన మహ్మద్ రిజ్వాన్.. రెండో సెమిఫైనల్లో 67 పరుగులు చేసి పాకిస్తాన్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. "ధైర్యానికి, దృఢ సంకల్పానికి గొప్ప ఉదాహరణ రిజ్వాన్. ఈ మ్యాచ్‌లో తన జట్టు గెలిచి ఉండకపోవచ్చు. కానీ రెండు రోజుల పాటు ఐసీయూలో ఉన్న రిజ్వాన్ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరు అతడి నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవలసినది చాలా ఉంది'అని ట్విటర్ లో లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఇక సెమీస్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. చదవండి: IND vs NZ Test Series: కరుణ్ నాయర్ అయిపోయాడు.. ఇప్పుడు విహారి వంతు -
టీమిండియా కోచ్ రేసులో 'ఆ ముగ్గురు'.. విదేశీయులకు నో ఛాన్స్ అన్న బీసీసీఐ..!
BCCI Unlikely To Appoint Foreign Coach For Team India : టీ20 ప్రపంచకప్‌తో ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండడంతో అతని వారసుడు ఎవరనే అంశంపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ వర్గాలు ఓ క్లారిటీ ఇచ్చాయి. టీమిండియా తదుపరి కోచ్‌గా విదేశీయులకు ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పాయి. కోచ్ రేసులో భారత మాజీ ఆటగాళ్లే ఉంటారని సూచనప్రాయంగా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి అత్యంత సన్నిహితులైన ముగ్గురు టీమిండియా దిగ్గజ ఆటగాళ్ల పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే స్వచ్చంధంగా కోచ్ పదవిపై నిరాసక్తత కనబర్చడంతో వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ల పేర్లు బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరు ముగ్గురికి ఐపీఎల్లో వివిధ ఫ్రాంఛైజీల తరఫున కోచింగ్ అనుభవం కూడా ఉండడంతో.. ఎవరో ఒకరికి రవిశాస్త్రి వారసుడిగా పట్టం కట్టడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కోచ్ పదవికి విదేశీ కోచ్ ఫార్ములా వర్కవుట్ కాదని, అందులోనూ బోర్డు పరిశీలనలో ఉన్న రికీ పాంటింగ్, మహేల జయవర్దనే, టామ్ మూడీ లాంటి వాళ్లు ఫుల్ టైమ్ కోచ్‌గా పని చేసేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్నారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, గతంలో నలుగురు విదేశీయులు టీమిండియా కోచ్‌లుగా పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత జాన్ రైట్, ఆతర్వాత గ్రెగ్ ఛాపెల్, గ్యారీ కిర్‌స్టెన్, డంకన్ ఫ్లెచర్ భారత జట్టు హెడ్ కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తించారు. చదవండి: కోల్‌కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్‌కు బంపర్ ఆఫర్.. -
తనకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదని
ముంబై: మంచి పని చేసే వారిని ప్రశంసించడంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఎప్పుడు ముందే ఉంటారు. ఈ క్రమంలో శుక్రవారం లక్ష్మణ్ ముంబై రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడుస్తున్న ఓ వ్యక్తిని అభినందించారు. ఈ క్రమంలో ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు లక్ష్మణ్. ‘దాదరావ్ బిల్హోర్ ఓ ప్రమాదంలో తన 16 ఏళ్ల కుమారుడిని కోల్పోయారు. కొడుకు మరణం తనను ఎంతో కుంగదీసింది. తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని భావించాడు. దాంతో పేవర్ బ్లాక్స్, కంకర, రాళ్లు, పారతో రోడ్లపై తిరుగుతూ ఎక్కడ గుంత కనిపిస్తే.. అక్కడికి వెళ్లి పూడ్చడం ప్రారంభించాడు. అతడి ప్రయత్నాన్ని ప్రశంసించడానికిక మాటలు చాలడం లేదు’అంటూ లక్ష్మణ్ ట్వీట్ చేశారు. (స్పూర్తిని రగిలించే వీడియో ఇది) Dadarao Bilhore has been filling potholes in Mumbai ever since he lost his 16 yr old son to an accident caused by a pothole. Even as the grief was tearing him apart, armed with broken paver blocks, gravel, stones & shovel,he started filling every pothole he witnessed. No words 🙏 pic.twitter.com/Ww5raEEV4P — VVS Laxman (@VVSLaxman281) June 19, 2020 దాదరావ్ 16 ఏళ్ల కుమారుడు 2015, జూలైలో ముంబైలోని జోగేశ్వరి-విఖ్రోలి లింక్ రోడ్ (జేవీఎల్ఆర్)లోని గుంతల కారణంగా ప్రమాదానికి గురయ్యి మరణించాడు. దాంతో రోడ్లపై ఏర్పడే గుంతలను పూడ్చాల్సిందిగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారిని అభ్యర్థించాడు. కానీ వారు దాదరావ్ చెప్పిన సమస్యను పెద్దగా పట్టించుకోలేదు. ఇక లాభంలేదనుకుని తనే స్వయంగా పార, కంకర, ఇసుక తీసుకుని రోడ్ల మీద తనకు కనపడ్డ ప్రతి గుంతను పూడ్చడం ప్రారంభించాడు దాదరావ్. తన కొడుకు మరణించినప్పటి నుంచి ఇప్పటి వరకు 500 గుంతలను పూడ్చాడు. జనాలు ఈ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా ఒక యాప్‌ను కూడా క్రియేట్ చేశాడు దాదరావ్ బిల్హోర్. -
చాపెల్‌కు చేత కాలేదు!
న్యూఢిల్లీ: గ్రెగ్ చాపెల్ భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్న కాలంలో సీనియర్ ఆటగాళ్లతో ఏర్పడిన విభేదాల గురించి క్రికెట్ ప్రపంచం మొత్తానికి తెలుసు. సచిన్, గంగూలీ తదితరులు తాము ఆ సమయంలో ఎలా ఇబ్బంది పడ్డామో గతంలోనే చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. తన ఆటోబయోగ్రఫీ ‘281 అండ్ బియాండ్’లో అతను ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఒక అగ్రశ్రేణి జట్టుకు కోచ్‌గా ఎలా వ్యవహరించాలో చాపెల్‌కు తెలీదని లక్ష్మణ్ విమర్శించాడు. ‘అతని పదవీకాలం మొత్తం ఒక చేదు జ్ఞాపకం. ఒక అంతర్జాతీయ క్రికెట్ జట్టును ఎలా నడిపించాలో అతనికి తెలియదు. మైదానంలో ఆడాల్సింది క్రికెటర్లు మాత్రమేనని కోచ్ కాదనే విషయాన్ని అతను మరచిపోయినట్లు అనిపించేది. చాలా మంది మద్దతుతో భారత జట్టుకు కోచ్‌గా వచ్చిన అతను జట్టును ఇబ్బందుల్లో నెట్టేసి వెళ్లిపోయాడు. నా కెరీర్లో ఘోరంగా విఫలమైన దశలో అతని పాత్ర కూడా ఉంది. అతని ఆలోచనలు సఫలమయ్యానని ఆ సమయంలో వచ్చిన కొన్ని ఫలితాలు చూస్తే అనిపిస్తుంది కానీ నిజానికి వాటికి అతనికి ఎలాంటి సంబంధం లేదు. ముందే ఒక అభిప్రాయం ఏర్పరుచుకొని దాని ప్రకారమే పని చేసేవాడు తప్ప పరిస్థితికి తగినట్లుగా మారలేదు. అప్పటికే సమస్యల్లో ఉన్న జట్టులో అతను మరిన్ని విషబీజాలు నాటాడు. కోచ్ కొంత మందినే ఇష్టపడుతూ వారి గురించే పట్టించుకునేవాడు. మిగతావారంతా ఎవరి బాధలు వారు పడాల్సిందే. మా కళ్ల ముందే జట్టు ముక్కలైంది’ అని వీవీఎస్ తన పుస్తకంలో వివరించాడు. -
కుంబ్లేతో డ్యాన్స్ చేయించా
సాక్షి, హైదరాబాద్: వీవీఎస్ లక్ష్మణ్ పేరు చెప్పగానే మరో ఆలోచనకు తావు లేకుండా ప్రతీ క్రికెట్ అభిమాని దృష్టిలో 2001 నాటి కోల్‌కతా టెస్టు ఇన్నింగ్స్ కళ్ల ముందు మెదులుతుంది. ఆస్ట్రేలియాపై ఫాలోఆన్‌లో లక్ష్మణ్ చేసిన 281 పరుగులతో ఆ మ్యాచ్ నెగ్గిన భారత్ ఆ తర్వాత సిరీస్ కూడా గెలుచుకుంది. భవిష్యత్తులో భారత క్రికెట్ రాతను కూడా ఈ మ్యాచ్ మార్చేసింది. అయితే స్వయంగా లక్ష్మణ్ దృష్టిలో మాత్రం దీనికంటే ముందు సిడ్నీలో తాను చేసిన 167 పరుగుల ఇన్నింగ్స్‌కే తొలి స్థానం దక్కుతుంది. గురువారం తన ఆత్మకథ ‘281 అండ్ బియాండ్’ ఆవిష్కరణ సందర్భంగా అతను ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘టెస్టుల్లో అడుగుపెట్టి మూడేళ్లు దాటిపోయినా తొలి సెంచరీ నమోదు చేయలేకపోయాను. అలాంటి స్థితిలో 2000 జనవరిలో సిడ్నీలో సాధించిన శతకం నేనూ అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలబడగలననే నమ్మకాన్ని కలిగించింది. అక్కడి పిచ్, ఎదుర్కొన్న బౌలర్లు, నా ఫామ్ ప్రకారం చూస్తే రెండో ఇన్నింగ్స్‌లో చేసిన ఆ సెంచరీ గొప్పతనం ఎక్కువ. నాటి మ్యాచ్ స్థితిని పరిగణనలోకి తీసుకుంటే ఈడెన్ గార్డెన్స్‌లో చేసిన 281 పరుగులకు చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని అంగీకరిస్తాను. అయితే ఆ మ్యాచ్‌లో నా ఆట నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. అంతకుముందు దాదాపు ఏడాది కాలంగా దేశవాళీలో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం అలవాటుగా మార్చుకున్నాను. నా ఫిట్నెస్ కూడా అద్భుతంగా మలచుకున్నాను. కాబట్టి ఏమాత్రం అలసట తెలీకుండా రెండు రోజులు ఆడేశాను’ అని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు. ఓపెనర్ స్థానంలో ఆడేందుకు అంగీకరించకపోవడం తన కెరీర్లో కఠిన నిర్ణయమని వీవీఎస్ చెప్పాడు. మూడేళ్ల పాటు మిడిలార్డర్లో స్థానం లేక ఇక భారత్ తరఫున ఆడాలనే విషయాన్ని మర్చిపోయి దేశవాళీపైనే దృష్టి పెట్టినట్లు అతను పేర్కొన్నాడు. ఆటగాడిగా ఉన్నప్పుడు అంతర్ముఖుడిగా కనిపించిన లక్ష్మణ్... తాను కూడా సహచరులతో చాలా సరదాగా గడిపే వాడినని వెల్లడించాడు. గంభీరంగా ఉండే అనిల్ కుంబ్లేతో కూడా 2008 నాగపూర్ టెస్టు తర్వాత టేబుల్ పైన డ్యాన్స్ చేయించగలగడం తనకే సాధ్యమైందని లక్ష్మణ్ నవ్వుతూ చెప్పాడు. అమెరికాలో అనుసరించా... పుస్కకావిష్కరణకు అతిథిగా వచ్చిన రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) మాట్లాడుతూ... క్రికెట్ వీరాభిమానినైన తాను కోల్‌కతా ఇన్నింగ్స్ సమయంలో అమెరికాలో ఉన్నానని, ప్రస్తుతం ఉన్న తరహాలో నెట్లో వీక్షించే సదుపాయం లేకపోవడంతో రెడిఫ్లో వచ్చే సంక్షిప్త సమాచారం ఆధారంగా మ్యాచ్‌ను అనుసరించానని గుర్తు చేసుకున్నారు. లక్ష్మణ్ సహచర హైదరాబాదీ కావడం గర్వంగా ఉందని భారత బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ వ్యాఖ్యానించగా... అండర్–16 స్థాయిలో వీవీఎస్‌ను ప్రోత్సహించిన రోజులను మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్ జ్ఞప్తికి తెచ్చుకున్నారు. లక్ష్మణ్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన చాలా సందర్భాల్లో తాను ఇచ్చిన బ్యాట్లనే వాడాడని వెంకటపతిరాజు చెప్పగా... టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేయలేకపోవడం, వరల్డ్ కప్ ఆడలేకపోవడం వీవీఎస్ కెరీర్లో లోటుగా మిగిలిపోయానని అతని మేనమామ, మెంటార్ బాబా కృష్ణమోహన్ అన్నారు. -
మొదటి శుభలేఖ దుర్గమ్మ పాదాల చెంతే..!
►క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ సహధర్మచారిణి రాఘవా శైలజ ►విజయవాడకు వస్తే భలే హ్యాపీ..! ►వి.వి.ఎస్.లక్ష్మణ్ అవార్డు వేడుకకు వచ్చి ‘సాక్షి’తో సంభాషణ వీవీఎస్ లక్ష్మణ్.. ఇది యావత్ భారతదేశానికి పరిచయం అక్కరలేని పేరు... అచ్చమైన తెలుగింటి క్రికెట్ ఆటగాడిగా అంతార్జాతీయ ఖ్యాతి గాంచారు. కుదురైన ఆట.. చురుకైన శైలితో క్రికెట్ ప్రేమికుల ప్రశంసలు పొందారు. సోమవారం ఈ క్రీడా దిగ్గజం సహధర్మచారిణి రాఘవ శైలజ, కుమార్తె అచింత్య, కుమారుడు సర్వజిత్‌తో కలిసి విజయవాడ గ్రాండ్ మినర్వాలో వి.వి.ఎస్.లక్ష్మణ్ ‘ఎక్స్‌లెన్సీ’ అవార్డు అందుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ సతీమణి రాఘవ శైలజ ‘సాక్షి’తో ముచ్చటించారు. అవి ఆమె మాటల్లోనే... నాకు ఆంధ్రప్రదేశ్ అంతా సుపరిచితమే. కడప, కర్నూలు, ఒంగోలు, విశాఖపట్టణం... అన్ని ప్రదేశాల్లో నేను చదువుకున్నాను. విజయవాడ నలందా కళాశాలలో ఇంటర్మీడియెట్, సిద్ధార్థ మహిళా కళాశాలలో డిగ్రీ సెకండియర్ వరకూ చదివా. తర్వాత కాకినాడలో డిగ్రీ పూర్తి చేశా. మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరు అచింత్య, అబ్బాయి పేరు సర్వజిత్. విజయవాడలో ఎన్నో జ్ఞాపకాలు.. విజయవాడ వస్తే నాకు భలే సంతోషంగా ఉంటుంది. ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఏదో తెలియని అనుభూతి. నాతో కలిసి చదువుకున్న స్నేహితులను కలవడం లైఫ్‌లో కొత్త జోష్‌నిస్తుంది. నేను ఇక్కడ చదివే రోజుల్లో విజయవాడ టిక్కిల్ రోడ్డులో ఉండేవాళ్లం. మా ఇంటి దగ్గరలోనే ‘స్కూప్స్’ ఐస్‌క్రీమ్స్ షాప్ ఉండేది. తరచూ అక్కడికి వెళ్లే దాన్ని. ఇప్పుడు లేదు. ఇప్పుడు అలాంటి భవనాల్ని చూస్తుంటే భలే సరదగా అనిపిస్తోంది. అప్పట్లో అసలు షాపింగ్ మాల్స్ లేవు. ఇప్పుడు బాగా వచ్చేశాయి. అప్పట్లో ఎగ్జిబిషన్‌కి కూడా తప్పకుండా వెళ్లేవాళ్లం. అదో రకమైన అనుభూతి. ప్రకాశం బ్యారేజీ, ఉండవల్లి గుహలకు కూడా వెళ్లేవాళ్లం. అప్పుట్లో ఉండవల్లి గుహలు చేరుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. చాలా చక్కగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం కనకదుర్గ అమ్మవారి ముక్కుపుడక అపహరణకు గురైంది. ఆ విషయం కూడా నాకు గుర్తుకు వస్తుంది. రెండేళ్ల క్రితం విజయవాడ వచ్చినప్పుడు అమరావతి చూశా. అక్కడ కూడా చాలా మార్పులు వచ్చాయి. కనకదుర్గ అంటే భక్తి.. విజయవాడలో ఉన్న రోజుల్లో తరచూ కనకదుర్గ గుడికి వెళ్లేవాళ్లం. ముఖ్యంగా నవరాత్రుల్లో అమ్మవారిని తప్పకుండా దర్శించుకునేవాళ్లం. కృష్ణా పుష్కరాలకు అమ్మతో కలిసి స్నానానికి వెళ్లడం అన్నీ గుర్తుకువస్తున్నాయి. మా అమ్మకు కనకదుర్గ అంటే ఎంతో భక్తి. మా పెళ్లి కుదిరాక మొట్టమొదటి శుభలేఖ అమ్మవారి పాదాల దగ్గర పెట్టాకే తిరుపతి వెళ్లాం. అంత గురి మా అమ్మకి. ఇప్పటికీ ఎప్పుడు విజయవాడ వచ్చినా కనకదుర్గ అమ్మవారిని, లబ్బీపేట వెంకటేశ్వరస్వామిని, మంగళగిరి పానకాలస్వామిని తప్పకుండా దర్శిస్తా. విజయవాడలో అడుగు పెడితే అన్నీ గుర్తుకువస్తాయి. విజయకృష్ణ సూపర్‌బజార్ బాగా గుర్తు. స్టేడియం పక్క నుంచి మొగల్రాజపురం వెళ్లే దారిలో అప్పట్లో మొట్టమొదటి మొబైల్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ చూశా. అప్పట్లో లక్ష్మణ్ ఆ స్టేడియంలో ఆడేవారని ఆయన చెబుతుంటారు. విజయవాడ మధురస్మృతులను నెమరవేసుకుంటుంటే నాకు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది.’ అని ముగించారు మిసెస్ లక్ష్మణ్ ఉరఫ్ రాఘవ శైలజ. -
స్పోర్ట్స్ హబ్‌గా హైదరాబాద్: వీవీఎస్
హైదరాబాద్: మన హైదరాబాద్ నగరం స్పోర్ట్స్ హబ్‌గా మారుతోందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. పీవీ సింధు, సైనా, సానియాలాంటి మేటి క్రీడాకారులను తయారు చేసిన ఘనత మన నగరానిదేనని ఆయన అన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే ఎయిర్టెల్ మారథాన్ కౌంట్‌డౌన్ కార్యక్రమం బుధవారం బేగంపేట్‌లోని తాజ్ వివంతా హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వీవీఎస్ మీడియాతో మాట్లాడుతూ నేటితరం పిల్లలు ఐపాడ్, కంప్యూటర్ కీబోర్డులకు అతుక్కుపోతున్నారని, వాటి నుంచి దృష్టి మరల్చేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని చెప్పారు. శారీరక, మానసిక వికాసానికి క్రీడలను అలవాటు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఎయిర్టెల్ సంస్థలు సంయుక్తగా మారథాన్ ఈవెంట్‌ను నిర్వహించనుండటం అభినందనీయమని లక్ష్మణ్ తెలిపారు. స్వామి వివేకానంద మాటలే స్ఫూర్తిగా యువత మేల్కోవాలని, ఆరోగ్యాన్నిచ్చే ఆటల్లో పాలుపంచుకోవాలని సూచించారు. రెండ్రోజుల ఈవెంట్లో 27న హైటెక్స్‌లో 5కె రన్, 28న పీపుల్స్ ప్లాజా నుంచి 10కె రన్, హాఫ్ మారథాన్ (21 కి.మీ.), ఫుల్ మారథాన్ (42 కి.మీ.) నిర్వహిస్తారు. పరుగు సాగే రహదారి వెంబడి ప్రతి రెండు కిలోమీటర్లకు వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు. కౌంట్‌డౌన్ కార్యక్రమంలో లక్ష్మణ్‌తో పాటు ఏపీ, తెలంగాణ రీజి యన్ ఎయిర్టెల్ సీఈఓ వెంకటేశ్ విజయరాఘవన్, మారథాన్ రేస్ డెరైక్టర్ మురళీ నన్నపనేని, రన్నర్స్ సొసైటీ అధ్యక్షుడు రాజేశ్ వెత్సా, కార్యదర్శి వీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వాకింగ్@హార్ట్
వాకింగ్‌తోనే గుండె బలం పెరుగుతుందంటున్నారు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. శారీరక శ్రమ తగ్గడం, మారిన జీవన శైలి మనిషి గుండెను బలహీనంగా చేస్తున్నాయన్నారు. హెల్దీ ఫుడ్ హాబిట్స్, వాకింగ్ వల్ల వ్యాధులను అరికట్టవచ్చని చెప్పారు. ప్రపంచ హృద్రోగ దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ‘కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ‘హార్ట్ హెల్త్ అవేర్నెస్’ సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. గుండె వ్యాధులపై ప్రజల్లో అవేర్నెస్ పెంచాలన్నారు. -
‘గురుకుల్’లో లక్ష్మణ్ సందడి
మొయినాబాద్ సమీపంలోని స్వామినారాయణ్ గురుకుల పాఠశాలలో భారత జట్టు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సందడి చేశారు. సోమవారం ఆయన పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. సరదాగా వారితో కాసేపు క్రికెట్ ఆడారు. మొయినాబాద్ రూరల్: భారతీయ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి పౌరుడూ పాటుపడాలని ప్రముఖ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. సోమవారం మండలంలోని హిమాయత్‌నగర్ సమీపంలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో క్రికెట్ ఆడారు. ఈ సందర్బంగా ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు అతిచేరువలో ఉన్న ఇంతటి ఘనమైన విద్యాలయాన్ని చూడడం ఇదే మొదటిసారి అన్నారు. క్రీడలకు అధిక ప్రాధ్యాన్యం ఇవ్వాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఆటలతోపాటు చదువులోనూ ఉత్తమ ఫలితాలు సాధించి దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని పేర్కొన్నారు. చిన్న వయసులోనే భగవద్గీత పఠనంతో తన జీవితం ధన్యమైందని తెలిపారు. మహానుభావుల జీవిత చరిత్రలను ఆదర్శంగా తీసుకుని, సామాజిక సేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం గురుకుల విద్యాలయ స్వామీజీలు లక్ష్మణ్‌ను సన్మానించారు. గురుకుల విద్యాలయంలో నిర ్వహించిన క్రికెట్ పోటీల్లో గెలుపొందినవారికి లక్ష్మణ్ చేతులమీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీదేవప్రసాద్ స్వామీజీ, శక్వల్లభ్ స్వామీజీ, అధ్యాపకులు పాల్గొన్నారు. -
క్రికెటర్ లక్ష్మణ్ ఈ-మెయిల్ హ్యాకింగ్
బ్యాంకు ఖాతా నుంచి రూ. 10 లక్షలు తస్కరణ సాక్షి, సిటీబ్యూరో: క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ-మెయిల్‌ను ఆగంతకులు హ్యాకింగ్ చేసి, ఆయన బ్యాంకు ఖాతాలోని రూ. 10 లక్షలను తస్కరించారు. ఈ డబ్బును కోల్‌కతాలోని బ్యాంకులో డ్రా చేయడానికి ప్రయత్నించిన అజీజ్ ఉల్ షేక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తులు తనకు కమీషన్ ఇస్తానంటేనే ఖాతా తెరిచానని నిందితుడు చెబుతుండటంతో అసలు ముఠా గుట్టు రట్టు చేసేందుకు పోలీసులు శోధిస్తున్నారు. సైబరాబాద్ ఇన్చార్జి క్రైమ్ డీ సీపీ జానకీ షర్మిల శనివారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మణ్‌కు ఎస్ఆర్ నగర్‌లోని డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంకు (డీసీబీ)లో ఖాతా ఉంది. ఆ ఖాతాలోని సొమ్మును మరేదైనా ఖాతాకు బదిలీ చేయాలంటే ఆ బ్యాంకు మేనేజర్‌కు లక్ష్మణ్ మెయిల్లో సమాచారం ఇస్తుంటారు. ఈ విషయం పసిగట్టిన హ్యాకర్లు లక్ష్మణ్ మెయిల్‌ను హ్యాక్ చేసి, కోల్‌కతాలోని బ్యాంకు ఆఫ్ ఇండియాలో గెలాక్సీ ఎంటర్ప్రైజెస్ ఖాతాకు రూ. 10 లక్షలు బదిలీ చేయాలని గురువారం లక్ష్మణ్ మెయిల్ నుంచి డీసీబీ మేనేజర్‌కు మెసేజ్ పెట్టారు. సొమ్ము బదిలీ కావడంతో లక్ష్మణ్ ఫోన్‌కు మెసేజ్ వెళ్లింది. దీంతో అప్రమత్తమైన లక్ష్మణ్ డీసీబీ అధికారులకు, సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన క్రైమ్ ఏసీపీ ప్రతాప్‌రెడ్డి కోల్‌కతా పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు గురువారం ఏటీఎం కార్డుతో రెండు దఫాలుగా కొంత మొత్తం డ్రా చేశాడు. మిగతా సొమ్ము డ్రా చేసేందుకు బ్యాంకుకు వచ్చిన అజీజ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతన్ని స్థానిక కోర్టులో హాజరుపర్చిన సైబరాబాద్ పోలీసులు, ఆ కోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసే అజీజ్ 10రోజుల క్రితమే ఖాతా తెరిచాడు. అయితే ఈ హ్యాకింగ్ మోసంలో తనకేమీ సంబంధం లేదని అజీజ్ పోలీసులకు చెప్పాడు. ఇద్దరు ఆగంతకులు అజీజ్‌తో బ్యాంకుకు వచ్చినా పోలీసులు అతన్ని పట్టుకునేసరికి అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. ఆదాల గెలుస్తాడు: జేసీ సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధిస్తారని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నామని... సమైక్యవాదుల మద్దతును కూడగడుతున్నామని తెలిపారు. సీఎల్పీ కార్యాలయ ఆవరణలో శనివారం జేసీ మీడియాతో మాట్లాడారు.