
బెంగళూరు: కర్ణాటక తముకురూ జిల్లాలో ప్రభుత్వంపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు గ్రామస్థులు. రోడ్డుపై బురద నీటిలో స్నానం చేశారు. ఇటీవల కరిసిన భారీ వర్షాల కారణంగా హులికేరి ప్రాంతంలో రోడ్లు బరద మడుగులను తలపించాయి. నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు దయనీయంగా తయారైంది.
రోడ్డు మరమ్మతులు చేయాలని అధికారులను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోయారు. తమ దుస్థిని అందరికీ తెలియజేసేందుకే గుంతల రోడ్డులో బురద నీటితో స్నానం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో మరికొందరు కూడా తమమైన రితీలో నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్డుపైనే ఫోటో షూట్లు పెట్టారు.
చదవండి: కూర మాడిందని భార్యను చంపేసి.. గుట్టుచప్పుడు కాకుండా..!
Comments
Please login to add a commentAdd a comment