mud bath
-
గుంతల రోడ్డు.. బురద నీటిలో స్నానం చేసి గ్రామస్థుల నిరసన
బెంగళూరు: కర్ణాటక తముకురూ జిల్లాలో ప్రభుత్వంపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు గ్రామస్థులు. రోడ్డుపై బురద నీటిలో స్నానం చేశారు. ఇటీవల కరిసిన భారీ వర్షాల కారణంగా హులికేరి ప్రాంతంలో రోడ్లు బరద మడుగులను తలపించాయి. నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు దయనీయంగా తయారైంది. రోడ్డు మరమ్మతులు చేయాలని అధికారులను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోయారు. తమ దుస్థిని అందరికీ తెలియజేసేందుకే గుంతల రోడ్డులో బురద నీటితో స్నానం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో మరికొందరు కూడా తమమైన రితీలో నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్డుపైనే ఫోటో షూట్లు పెట్టారు. చదవండి: కూర మాడిందని భార్యను చంపేసి.. గుట్టుచప్పుడు కాకుండా..! -
ఎమ్మెల్యే కళ్లెదుటే.. బురద నీటిలో కేరళ వ్యక్తి స్నానం, యోగా..
నిత్యం వందలు, వేల సంఖ్యలో వాహనాలు వెళ్లే రహదారులు దాదాపు రాత్రింబవళ్లు రద్దీగా ఉంటాయి. అలాంటి రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారుతుంటాయి. ఇక వర్షాకాలంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం పడుతున్నంత సేపు వరద నీటితో రోడ్లు నిండిపోతే.. వాన వెలిసిన తర్వాత ఎక్కడ చూసినా సగం కొట్టుకుపోయిన రోడ్లు, గుంతలు, గతుకులే దర్శనమిస్తాయి.. ఇలాంటి రహదారులపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే రోడ్ల మరమ్మత్తులు చేపట్టడం లేదని తాజాగా కేరళలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. ఇటీవల కురిసిన వర్షానికి మలప్పురం ప్రాంతంలోని రోడ్లపై గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచిపోయాయి. అయితే దీనిని అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఓ వ్యక్తి స్వయంగా రంగంలోకి దిగాడు. స్థానిక ఎమ్మెల్యే యూఏ లతీఫ్ ముందు ఎమ్మెల్యే ఎదురుగానే గుంతల్లోని నీటిలో స్నానం చేశాడు. ఎమ్మెల్యే కారు సంఘటనా స్థలానికి చేరుకోగానే గుంతలో ధ్యానం చేయడం ప్రారంభించాడు. బురద నీటిలో యోగా చేశాడు. చెప్పులు శుభ్రం చేసుకొని, బట్టలు కూడా ఉతుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలోని వ్యక్తిని హంజా పోరాలిగా గుర్తించారు. #WATCH | Kerala: A man in Malappuram protested against potholes on roads in a unique way by bathing & performing yoga in a water-logged pothole in front of MLA on the way pic.twitter.com/XSOCPrwD5f— ANI (@ANI) August 9, 2022 కాగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి వ్యతిరేకంగా కేరళలో గత వారం అనేక నిరసనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఆందోళనలు ఏ రాజకీయ నాయకుడి దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఇదిలా ఉండగా అయిదు రోజుల క్రితం ఎర్నాకుళం జిల్లాలోని నెడుంబస్సేరి వద్ద జాతీయ రహదారిపై గుంతల కారణంగా 52 ఏళ్ల వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అతనిపై ట్రక్కు వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో వారం రోజుల్లోగా తమ ఆధీనంలోని ప్రతి రోడ్డును బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను కేరళ హైకోర్టు ఆదేశించింది. -
ఒంటినిండా బురదతో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలని ఉంటుంది. అందుకోసం నానా తంటాలు పడుతుంటారు. కొందరు కొన్ని మేకప్ ప్రొడక్ట్స్‌ని వాడడం వల్ల మరింత అందంగా కనిపిస్తారు. లేదంటే మరికొంతమంది సహజసిద్దంగానే బ్యూటీఫుల్‌గా కనిపించాలనుకుంటారు. అందం విషయంలో శ్రద్ధ వహించే వారిలో హీరోయిన్లు ముందు వరుసలో ఉంటారు. మత్తేక్కించే చూపులతో పదునెక్కించే ఈ భామలు తమ అందాన్ని మరింత మెరుగుపరచుకునేందుకు ఎప్పుడూ ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే బ్యూటీ ఊర్వశి రౌతేలా శరీరం మరింత నిగారింపుగా మారేందుకు వినూత్నంగా ఆలోచించింది. బురదలోకి దిగి ఒళ్లంగా మట్టి పూసుకొని మడ్ బాత్ చేసింది. ఈ ఫోటోను ఊర్వశి నా ఫేవరెట్ మత్ బాత్ స్పా’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనిని చూసిన నెటిజన్స్ విగ్రహం అనుకున్నాం అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల కలిగే లాభాలను కూడా వెల్లడించారు ఊర్వశి. "బాలేరిక్ బీచ్ ఎర్రరేగడి మట్టిని ఆస్వాదిస్తున్నాను. ఇది అద్భుతంగా ఉంది. ఇది రోమన్ ప్రేమ దేవత రోమన్ దేవతల సౌందర్య రహస్యం ఇదేనని చెప్పారు. అందాన్ని మరింత మెరుగుపరచుకోవడంతో పాటు శరీరంపై ఉన్న విషపూరిత కణాలు తొలగించుకోవడానికి చాలా కాలం నుండి ఇలా చేస్తున్నానని తెలిపారు. శరీరం మొత్తం రేగడి మట్టి పూసుకొని కూర్చుంటే శరీరంతో పాటు మనసుకు ప్రశాంతత ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇక ఇటీవల జిమ్ వర్కవుట్ వీడియో ఒకటి షేర్ చేయగా, ఇందులో జిమ్ ట్రైనర్‌తో కడుపులో పిడి గుద్దులు గుద్దించుకున్న విషయం తెలిసిందే.. తన తర్వాతి సినిమా యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఆ సినిమా కోసం ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. చదవండి: హీరోయిన్ కడుపులో ట్రైనర్ పిడిగుద్దులు.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
మట్టి స్నానం..మహా ప్రక్షాళనం
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక పోకడలకు వంటబట్టించున్ననగరం.. ఆరోగ్యం, జీవనశైలి విషయాల్లోనూ పాతవిధానాన్నే అనుసరిస్తోంది. అత్యాధునిక, విలాసవంతమైన సదుపాయాలు, వెరైటీ ఆహార పదార్థాలు ఒకవైపు కట్టిపడేస్తున్నప్పటికీ చాలామంది నిరాడంబరమైన జీవన విధానం వైపే మొగ్గుచూపుతున్నారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబుటులోకి వచ్చినా దీర్ఘకాలిక రోగాలకు, అసలు రోగాలే రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవిధంగా చెప్పాలంలే నగర వాసుల్లో అనూహ్యంగా ఆరోగ్య స్పృహ పెరిగింది. బిర్యానీలు, చికెన్ కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్‌ను ఇప్పుడిప్పుడే దూరం పెడుతున్నారు. ప్రతి ఇంట్లోనూ కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు వంటి చిరుధాన్యాల ఆహారం తప్పనిసరైంది. మధ్య తరగతి, ఆ పైవర్గాలే కాదు.. సాధారణ ప్రజలు సైతం తమ ఆహారంలో మార్పులు చేసుకుంటున్నారు. ఇదంతా ఒకవైపు అయితే.. మరోవైపు వివిధ రకాల రుగ్మతల కోసం పొందే వైద్య చికిత్సల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. అత్యవరమైతే తప్ప అల్లోపతిని ఆశ్రయించేందుకు విముఖత చూపుతున్నారు. ప్రకృతి వైద్యం బాటలో నడుస్తున్నారు. మధుమేహం, అధికరక్తపోటు, కీళ్లనొప్పులు, వివిధ రకాల చర్య వ్యాధులు, స్పాండిలైటిస్, సయాటికా వంటి జీవన శైలి వ్యాధులకు ప్రకృతి వైద్యాన్నేప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. ప్రకృతిలో వేస‘విహారం’.. నిప్పులు చెరిగే ఎండల నుంచి ఉపశమనాన్ని పొందేందుకు చాలా మంది చాలా రకాల పద్ధతులను ఎంపిక చేసుకుంటారు. ఆహార విహారాల్లో మార్పులు చేసుకుంటున్నారు. చల్లటి ప్రదేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతారు. కానీ వేసవి తాపం నుంచి ఉపశమనంతో పాటు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొనేందుకు ఇప్పడు చాలామంది ప్రకృతి వైద్యం బాటలో నడుస్తున్నారు. అమీర్‌పేట్‌లోని నేచర్‌క్యూర్ ఆస్పత్రి కొద్ది రోజులుగా సందర్శకులు, రోగులతో కిటకిటలాడుతోంది. వారం నుంచి 15 రోజుల పాటు ప్రకృతి వైద్య చికిత్సలను పొందేందుకు జనం బారులు తీరుతున్నారు. ఇప్పటికే చిరుధాన్యాల బాట పట్టిన నగరవాసులు ఆ బాటలోనే ప్రకృతి వైద్యం వైపు సాగుతున్నారు. దీంతో 184 పడకలతో వైద్యసేవలను అందించే నేచర్‌క్యూర్ ఆస్పత్రి ప్రతిరోజు 30 నుంచి 40 మంది కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకొని ప్రవేశం కోసం ఎదురుచూస్తున్నారు. మరో వంద మందికి పైగా ఆస్పత్రిని సందర్శించి ప్రకృతి వైద్యం గురించి తెలుసుకుంటున్నారు. ఏయే జబ్బులకు ఎలాంటి చికిత్సలు లభిస్తాయనే విషయంపై అవగాహన చేసుకుంటున్నారు. ప్రకృతి వైద్యంతో పాటు, యోగ, ప్రాణాయామపైనా ఆసక్తి చూపుతున్నారు. అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ నేచర్ క్యూర్ ఆస్పత్రిలో అనేక రకాల జబ్బులకు చికిత్స చేస్తున్నారు. ఏసీ, నాన్ ఏసీ గదులు, కాటేజీలు, సాధారణ వార్డులు సైతం ఇక్కడ ఉన్నాయి. వ్యాధుల తీవ్రత మేరకు వారం నుంచి 15 రోజుల పాటు ఈ చికిత్సలు ఉంటాయి. అందుకు అనుగుణంగా రూ.5000 నుంచి రూ.25 వేల వరకు ఫీజులున్నాయి. మట్టి స్నానం..మహా ప్రక్షాళనం శరీరంలోని మలినాలన్నింటినీ తొలగించి, స్వేదగ్రంధులను విశాలం చేసి సరికొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అందించే మట్టిస్నానం మరో ప్రత్యేకత. భూమిలో మూడు అడుగుల లోతు నుంచి సేకరించిన నల్లరేగడి మట్టిని ఈ చికిత్సకు ఉపయోగిస్తున్నారు. వంటి నిండా మట్టి పూసి అవసరమైన చోట మట్టి ప్యాచ్‌లు వేస్తారు. తర్వాత కనీసం 20 నిమిషాలు ఎండలో ఉంచుతారు. ‘మట్టిలోని పుష్కలమైన ఖనిజాలు శరీరానికి పటుత్వాన్ని, మృదుత్వాన్ని అందజేస్తాయని, శరీరం ప్రక్షాళనమవుతుంద’ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భవాని తెలిపారు. ఆహారం అమృతమయం ఎలాంటి మందులు, ఇంజెక్షన్లు, శస్త్ర చికిత్సలు లేని ప్రకృతి వైద్యవిధానంలో ఆహారమే పరమ ఔషధం. అందుకే శరీరంలోని విష పదార్థాలను తొలగించే సూర్యాహారం, అమృతాహారాన్ని ఈ వైద్యంలో అందజేస్తారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు వంటివి సూర్యాహారంగా, పళ్లు, ఎండుఫలాలు, తేనె, చెరకురసం, బెల్లం అమృతాహారంగా అందజేస్తారు. చికిత్స అనంతరం దైనందిన జీవితంలో ఎలాంటి ఆహార నియమాలను అనుసరించాలనే దానిపై అవగాహన కల్పిస్తారు. ఎప్పుడు, ఏ రకమైన ఆహారాన్ని తీసుకోవాలో తెలియజేసే యుక్తాహారం, మితాహారం పద్ధతులు కూడా ప్రకృతి చికిత్సలో భాగమే. వీటితో పాటు మర్ధన చికిత్సలు, అరిటాకు స్నానం, సూర్యచికిత్స, యోగ, ప్రాణాయామ, ఫిజియోథెరపీ వంటి వివిధ రకాల వైద్య,ఆరోగ్య పద్ధతులతో రోగికి స్వస్తత చేకూరుస్తున్నారు. -
మట్టిస్నానం.. రోగాలు దూరం!
భైంసా(ముథోల్) ఆదిలాబాద్ : మట్టిస్నానానికి అనూహ్య స్పందన లభించింది. భైంసాలోని రాజీవ్‌నగర్‌లో ప్రారంభమైన యోగా శిబిరంలో ప్రతీనెల ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నిర్వాహకుడు ఆడెపు శ్రీనివాస్ ఈ ఆదివారం మట్టితో (మడ్‌బాత్) స్నానాలు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. భైంసా డివిజన్ వ్యాప్తంగా వందలాదిగా తరలివచ్చి మడ్‌బాత్‌లో పాల్గొన్నారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కార్యక్రమం కొనసాగింది. మిశ్రమం తయారీ ఇలా.. భైంసా మండలం సిరాల గ్రామంలోని మహాదేవుని మందిరం వద్ద ఈ వేదిక ఏర్పాటు చేశారు. చుట్టూ రాళ్లగుట్ట, పక్కన చెరువు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ఈ ప్రదేశంలో మడ్‌బాత్ కోసం ఒకరోజు ముందుగానే ఏర్పాట్లు చేశారు. నల్లమట్టి, ఎర్రమట్టి, బంకమట్టి, పుట్టమట్టి తీసుకువచ్చి ఆరు గంటలపాటు గోమూత్రంలో నానబెట్టారు. అందులో మూడు రకాల పసుపు, అన్ని రకాల పండ్ల తొక్కల చూర్ణం, తీపుతీగ, వేపాకు, నీలగిరి ఆకు, వావిలి ఆకు, కలబంద, మాంజిష్ట, నేలవేము, కానుగ, మునగ ఆకు, సీతాఫలం ఆకులు రంగరించి నానబెట్టిన మట్టిలో కలిపారు. చందనం, ముల్తానిమట్టి వేసి కొంత నీరుపోసి మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి ఉంచారు. ఈ మిశ్రమాన్ని మడ్‌బాత్‌లో పాల్గొన్నవారందరికీ అందించారు. శరీరానికి మట్టి పట్టించి.. మడ్‌బాత్‌లో పాల్గొన్నవారందరికీ ముందుగా స్నానాలు చేయించారు. స్నానాల అనంతరం కలిపిన మట్టి మిశ్రమాన్ని తలపై నుంచి కాలిగోటి వరకు శరీరంపై పట్టించారు. నీడపట్టున మట్టి ఆరిన తర్వాత ఎండలోకి తీసుకువెళ్లారు. శరీరంపై ఉన్న మట్టి ఆరిన తర్వాత యోగాసనాలు వేయించారు. ఆయా రకాల ఆసనాలతో తలనొప్పి, మైగ్రేన్, చర్మవ్యాధులు, నరాల బలహీనత, కండరాలు, కీళ్లనొప్పులు, నడుము, మోకాళ్లనొప్పి, బద్దకం, నిద్రలేమి, మానసిక రుగ్మతులు దూరం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్య సూత్రాలు వివరించి.. మూడు గంటల తర్వాత అక్కడే స్నానాలు చేయించారు. స్నానాలు చేయించాక ఆరోగ్యానికి ఉపయోగపడే చిట్కాలు తెలిపారు. మడ్‌బాత్‌తో చేకూరే లాభాలను వివరించారు. నేడు కలుషితమవుతున్న వాతావరణం, రసాయనాలతో తయారైన ఆహార పదార్థాలను తీసుకుంటూ శరీరంలో పెరుగుతున్న వ్యాధులను ఎలా అరికట్టాలో సూచించారు. యువకులు, రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రోజురోజుకు పంటపొలాల్లోనూ రసాయన ఎరువుల వాడకం పెరుగుతుందని, దీంతో తీసుకునే ఆహారం విషమయమై ఉంటుందన్నారు. తీసుకునే ఆహారం ఆర్గానిక్ విధానంలో పండించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఆర్గానిక్ విధానంలో కాయగూరలు పండించుకోవాలని సూచించారు. నాలుగు, ఐదు మట్టి కుండలు తీసుకుని అందులో ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలను సాగుచేస్తే ఆ కుటుంబం తీసుకునే ఆహారంలో విషతుల్యమైన పదార్థాలు ఉండవని నిర్వాహకులు సూచించారు. ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ అవలంభించాలని తెలిపారు. ఆర్గానిక్ విధానంలో ఇంట్లోనే కూరగాయలు పండించి తినేలా అందరితో సంకల్పం చేయించారు. వ్యాధులు దూరమవుతాయి మడ్‌బాత్‌తో చర్మసంబంధ వ్యాధులన్నీ పూర్తి గా దూరమవుతాయి. ప్రతీ ఆరు నెలలకోసారైనా మడ్‌బాత్ చేయాలి. సిరాల గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వందలాది మం ది యువకులు రావడం ఉత్సాహాన్నిచ్చింది. ఇక్కడికి వచ్చిన వారు కూడా మడ్‌బాత్ ప్ర యోజనాలను పక్కవారికి తెలియజేయాలి. ప్రతీరోజు క్రమం తప్పకుండా యోగాసనా లు వేయిస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయలు తింటే ఎలాంటి ఇబ్బందులు రావు. – సిద్ది రాములు, యోగా గురువు -
జాతరకెళితే బురద పూస్తారు..!
అవునా నిజమేనా...!అని ఆశ్చర్యపోవద్దు. ఇదో వింతజాతర.బురదమాంబజాతరలో ఎంతటి వ్యక్తి అయినా బురదరాయించుకోవాల్సిందే. మగవారుఏ వయస్సులో ఉన్నా ఎటువంటిమినహాయింపు ఉండదు. ఆడవారికి మాత్రమే మినహాయింపుఉంటుంది. ఈ విచిత్ర జాతరరాంబిల్లి మండలం దిమిలి గ్రామంలోరెండేళ్లకోసారి నిర్వహిస్తారు. రాంబిల్లి : బురదమాంబ జాతర రోజు దిమిలిలో ఉంటే ఎంతటివారైనా బురద పూయించుకోవాల్సిందే. మహిళలు పూజలకు మాత్రమే పరిమితం. ఎంతటి స్దాయి వ్యక్తి అయినా వయస్సుతో సంబంధం లేకుండా మగవారైతే చాలు డ్రెయినేజీల్లో బురదలో వేప కొమ్మలు ముంచి ఒంటిపై పూస్తారు. ఇదో వింత పండగ. ఈ గ్రామదేవత దల్లమాంబ జాతరలో భాగంగా అనుపు మహోత్సవం సందర్భంగా రెండేళ్లకోసారి ఈ జాతరను నిర్వహిస్తారు. సోమవారం అర్ధరాత్రి నుంచే ఈ బురద మహోత్సవం ప్రారంభం అవుతోంది. మంగళవారం ఉదయం 9గంటల వరకు ఈ జాతర నిర్వహిస్తారు. వేపకొమ్మలు చేతబట్టి ఆయా కొమ్మలను మురుగుకాలువల్లో ముంచి ఆయా బురదను ఒకరిపై ఒకరు పూసుకొని కేరింతలు కొడతారు. గ్రామంలో వీధుల్లో ఈ జాతర నిర్వహిస్తారు. జాతర అనంతరం ఆయా కొమ్మలను అమ్మవారి ఆలయం వద్ద వుంచి పూజలు చేస్తారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, భక్తుల కొంగుబంగారంలా బురదమాంబ అమ్మవారిని భక్తులు భావిస్తారు. బురద పూసుకున్నప్పటికీ ఎటువంటి చర్మవ్యాధులు సోకకపోవడం అమ్మవారి మహత్మ్యంగా భక్తులు భావిస్తారు. ఈ జాతర నిర్వహణకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బురదమాంబ అమ్మవారు -
మట్టి మహిమ
‘మహా’ఉష్ణంతో జనం అల్లాడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎవరికి తెలిసిన రీతిలో వారు చల్లదనాన్ని వెతుక్కుంటున్నారు. ఇదే క్రమంలో వేసవికాలాన్ని చల్లగా మార్చుకునేందుకు చాలామంది ఒళ్లంతా బురదను పులుముకుని ఎంజయ్ చేస్తున్నారు...కాదు కాదు...ఆరోగ్యం కోసం తాపత్రయపడుతున్నారు. దానిని మృతిక స్నానంగా కూడా పిలుచుకుంటాం. ఒక్కసారి ప్రకృతి చికిత్సాలయాన్ని సందర్శిస్తే...మట్టితో కప్పేసుకుంటున్న దేహాలను చూడవచ్చు. మట్టిలోని పరమానందాన్ని ఆస్వాదిస్తుంటారు. మృత్తిక స్నానంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రకృతి వైద్యశాస్త్రం చెబుతోంది. ఇది నేటితరం వారికి వింతగా ఉన్నా అందులో దాగి ఉన్న ఆరోగ్యకర ఔషధాలు అందించే ఉపశమనం అంతా ఇంతా కాదని అనుభూతుపరులు చెప్పే మాట. అసలే వేసవి ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా మడ్‌బాత్‌లో మునిగితేలుతున్నారు. మడ్‌బాత్ చేయించుకునేందుకు రోజురోజుకు ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. - కోట కృష్ణారావు ఒక చికిత్సలా... పంచభౌతికమైన శరీరానికి పృద్వీని జోడించి మృత్తిక చికిత్స (మడ్ ట్రీట్మెంట్)ను అందిస్తున్నారు. మట్టిని పట్టీలుగా గానీ, రోగగ్రస్థమైన అవయవంపై లేపనంగా గానీ, శరీరం అంతా మృత్తిక లేపనం చేస్తారు. ఈ చికిత్సను రోగిని అనుసరించి గానీ, వాతావరణం, కాలాలను అనుసరించి గానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ తీవ్రతను బట్టి మృత్తిక చికిత్సలు అధికంగా ఉంటుందని ప్రకృతి వైద్యులు చెప్పేమాట. ఈ చికిత్సకు జిగురుతత్వాన్ని కలిగిన బంకమన్ను (రేగటి మన్ను)ను ఉపయోగిస్తారు. తలమట్టి తలను నీటితో తడిపిన తరువాత నానిన రేగడిమట్టిని పూస్తారు. 15 నిమిషాల పాటు ఎండలో ఉన్న తరువాత శిరస్నానం చేయాలి. పురుషులే కాకుండా స్త్రీలు కూడా ఈ రకమైన తలమట్టి స్నానమాచరించవచ్చు. దీని ద్వారా తల చుండ్రు, జుట్టు ఊడిపోవడం, పండిపోవడం పేలు కొరుకుడు, తలనొప్పి కళ్ల మంటలు, నీరుకారడం, దృష్టి లోపం, కంటి, చెవి, ముక్కు వ్యాధుల నివారణ జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఉన్మాదం, హిస్టీరియా, నిద్రలేమి వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఛాతిమట్టి రోగిని బల్లపై గానీ, నేలపై గానీ పడుకోబెట్టి ఒక ఇంచు మందంతో ఛాతి భాగమంతా మట్టి లేపనం చేస్తారు. దీని ద్వారా ఛాతినొప్పి, మంట, గుండె జబ్బులు, రక్తపోటు తదితర వ్యాధులతో బాధపడుతున్నవారు ఉపశమనం పొందవచ్చు. అవయవ లేపనాలతో రుగ్మతలు దూరం... వైద్యుల సలహాలను అనుసరిస్తూ అవయవ మట్టి లేపనాలను వేసుకోవడం ద్వారా ఎన్నో రకాల రుగ్మతలను దూరం చేయవచ్చని ప్రకృతి వైద్యులు సూచిస్తున్నారు. భూగర్భ స్నానం తల బయట ఉంచి భూమిలో శరీరం మొత్తాన్ని గానీ, వ్యాధి సోకిన అవయవాన్ని గానీ 10 నుంచి 30 నిమిషాల వరకు ఉంచడమే భూగర్భ స్నానం. దీని ద్వారా పక్షవాతం, పోలియో, కండరవాతం, సంధివాతం, గూని, పోలియో, చర్మవ్యాధులు, కుష్టు, బొల్లి రోగులను భూగర్భ స్నానం చేయించడం ద్వారా ఉపయోగం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పాముకాటుకు ఇది ఉపయోగపడుతుం దట. పాము కరచినప్పుడు రోగిని అడ్డంగా అరగజం లోతు గొయ్యి తవ్వి తల బయటకు ఉంచి మట్టితో కపిప కొన్ని గంటల వరకు ఉంచినట్లయితే పాము విషం హరించబడుతుంది. భూమిలోని అయస్కాంతశక్తితో పాటు సేంద్రీయ లవణాల వల్ల రోగాలు నయమవుతాయి. ఉదరమట్టి నానిన రేగడిమట్టిని ఇక ఇంచుమందంతో పొట్ట భాగంలో లేపనం చేస్తారు. దీని ద్వారా మలబద్ధకం, జ్వరం, అతి విరేచనాలు, రక్త గ్రహణి, అమీబియాసిస్, ఆంత్రవ్రణములతో బాధపడుతున్న వారికి పొట్టపై మట్టి లేపనం చేస్తే ప్రయోజనం పొందవచ్చు. మూత్రం మంటగా ఉన్నప్పుడు పొత్త కడుపుపై మట్టి గానీ, మట్టీపట్టీలు గానీ వేయడం వల్ల మంట వెంటనే హరించబడుతుందట. మూత్రం రానిచో పొత్తి కడుపును కాపడం చేసి మట్టిపట్టీలు గానీ, మట్టి లేపనం గానీ చేసినట్లయితే సత్ఫలితాలుంటాయి. మట్టిపట్టీలతో ఉపయోగాలెన్నో... సహజంగా మట్టిపట్టీని రోగి ఉపవాస కాలంలో రోజుకు రెండుసార్లు (ఉదయం 6 గంటలు, మధ్యాహ్నం 3 గంటలకు) వేయడం ద్వారా శరీరంలోని ఉష్ణోగ్రత మామూలు స్థితికి వస్తుందట. ఎంతటి తీవ్రమైన జ్వరమైనా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు తగ్గించే శక్తి మట్టిపట్టీలకు ఉంటుంది. రెండు నుంచి మూడు రోజులు క్రమంగా మట్టిపట్టీని వేస్తే జ్వరం పూర్తిగా నివారింపబడుతుంది. ప్రేవులలో మండనం (మురుగు) లేకుండా కాపాడుతుంది ఆంత్రవ్రణములు, అమీబియాసిస్, పరిణామాశుల వంటి వ్యాధులకు మట్టీ పట్టీలు రోజుకు రెండు నుంచి మూడుసార్లు వేసుకోవడం ద్వారా కొద్దిరోజులకే తగ్గుతాయట. మందులు వాడాల్సిన అవసరం అసలే ఉండదు. చీము, రక్త విరేచనాలు, నీళ్ల విరచనాలు ఒకటి రెండు రోజుల్లో నివారించవచ్చు. రక్త ప్రదరము (ఎర్రబట్ట), శ్వేత బదరం (తెల్లబట్ట) ఉన్న స్త్రీలకు మట్టిపట్టీలు రోజుకు మూడు లేదా నాలుగుసార్లు రెండు గంటల వ్యవధి చొప్పున వేసుకోవడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయని వైద్యశాస్త్రం సూచిస్తోంది. వైద్యుల పర్యవేక్షణలో చేయాలి వేసవిలో మడ్‌బాత్‌కు ఎంతో ఆదరణ ఉంటుంది. ఎందుకంటే సూర్యరశ్మి ఉన్నప్పుడే మడ్‌బాత్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఒంట్లోని ఎన్నో రకాల రుగ్మతలను తొలగించుకోవచ్చని ప్రకృతి వైద్య శాస్త్రం ద్వారా నిరూపితమైంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాల్సి ఉంటుంది. మంగళ, గురు, శనివారాల్లో మహిళలకు, సోమ, బుధ, శుక్రవారాల్లో పురుషులకు మృత్తిక చికిత్స చేయడం జరుగుతుంది. -డాక్టర్ ఎంవీ మల్లికార్జున్, సూపరింటెండెంట్, నేచర్‌క్యూర్ ఆస్పత్రి, అమీర్‌పేట్