Tumkur
-
విధి ఆడిన వింత నాటకం.. కొత్త జంట అకాల మరణం
తుమకూరు: లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో టెక్కీ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద కర్నాటకలోని తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకాలోని హులియూరు గేట్ వద్ద చోటుచేసుకుంది. మృతులను రఘు (35) అతని భార్య అనూష (28)లుగా గుర్తించారు. వివరాల ప్రకారం.. హాసన్ జిల్లాలోని అరసికెరెకు చెందిన రఘు, తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకాలోని తిగడనహళ్లికి చెందిన అనూషతో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. వారు బెంగళూరులో ఐటీ ఇంజనీర్లుగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. బళ్లారిలో బంధువుల పెళ్లి ఉండడంతో చిక్కనాయకనహళ్లి నుంచి కారులో వెళుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీ వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో కారు నుజ్జయింది. దంపతులిద్దరూ తీవ్ర గాయాలతో కన్నుమూశారు. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరకుని వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక, ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
గుంతల రోడ్డు.. బురద నీటిలో స్నానం చేసి గ్రామస్థుల నిరసన
బెంగళూరు: కర్ణాటక తముకురూ జిల్లాలో ప్రభుత్వంపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు గ్రామస్థులు. రోడ్డుపై బురద నీటిలో స్నానం చేశారు. ఇటీవల కరిసిన భారీ వర్షాల కారణంగా హులికేరి ప్రాంతంలో రోడ్లు బరద మడుగులను తలపించాయి. నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు దయనీయంగా తయారైంది. రోడ్డు మరమ్మతులు చేయాలని అధికారులను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోయారు. తమ దుస్థిని అందరికీ తెలియజేసేందుకే గుంతల రోడ్డులో బురద నీటితో స్నానం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో మరికొందరు కూడా తమమైన రితీలో నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్డుపైనే ఫోటో షూట్లు పెట్టారు. చదవండి: కూర మాడిందని భార్యను చంపేసి.. గుట్టుచప్పుడు కాకుండా..! -
మంచిగా చూసుకుంటాడని నమ్మి వస్తే..
తుమకూరు: పని లేక, తాగుడుకు బానిసైన భర్త ఉన్మాదిగా మారాడు. మంచిగా మారానని మాటిస్తే.. తిరిగి వచ్చిన భార్యాబిడ్డలపై దాష్టికానికి పాల్పడ్డాడు. అత్యంత కిరాతకంగా ఇద్దరినీ కడతేర్చాడు. ఈ దారుణం జిల్లాలోని గుబ్బి తాలూకా నిట్టూరు హోబళి మావినహళ్లి గ్రామంలో జరిగింది. మావినహళ్లి గ్రామానికి చెందిన స్వామి (33)కి భార్య కావ్య (25), కుమారుడు జీవన్ (4) ఉన్నారు. భార్యతో గొడవపడి గునపంతో భార్య, కుమారుని తలపై కొట్టి ప్రాణాలు తీశాడు. రక్తసిక్తమైన ఇంట్లో పడి ఉన్న భార్య, కుమారుని మృతదేహాలను చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురి అయ్యారు. పారిపోయేందుకు యత్నించిన కిరాతకున్ని గ్రామస్తులు పట్టుకుని స్తంభానికి కట్టి చేళూరు పోలీసులకు అప్పగించారు. నాలుగు రోజుల కిందటే భార్య రాక గ్రామంలో అర్చక వృత్తి చేసుకునే స్వామిని ఇటీవల ఆ పని నుంచి తొలగించారు. ఊళ్లో అటూ ఇటూ తిరుగుతూ కుటుంబ సభ్యులతో నిత్యం గొడవ పడుతూ ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు. గత ఆరేళ్ల క్రితం స్వామి, కావ్యకు వివాహం జరిగింది. తరచూ కొట్లాటలు అవుతుండడంతో కావ్య నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. బంధువులు రాజీ పంచాయతీ చేసి నాలుగు రోజుల క్రితమే ఒక్కటి చేశారు. మంచిగా చూసుకుంటాడని చెప్పడంతో దీంతో కావ్య తిరిగి భర్త స్వామి ఇంటికి వచ్చింది. కానీ అతనిలోని ఉన్మాది ఊరుకోలేదు. మంగళవారం రాత్రి మరోసారి భార్యతో గొడవకు దిగాడు. కోపోద్రిక్తుడైన స్వామి తన చేతికి అందిన గునపం తీసుకుని కావ్య, నాలుగేళ్ల జీవన్ తలలపై బాది చంపాడు. ఘటనాస్థలి అంతా రక్తం ధార కట్టి భీతావహంగా మారింది. చేళూరు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి స్వామిని అరెస్టు చేశారు. ఇదీ చదవండి: రాజీకి పిలిచి ఘోర అవమానం -
Bharat Jodo Yatra: జడివానలోనూ ‘జోడో’
తుమకూరు: పెద్దలకు పలకరింపులు, అక్కడక్కడా హారతులు, పిల్లలతో ముచ్చట్లతో కర్ణాటకలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. వర్షంలోనూ ఆయన యాత్ర కొనసాగిస్తున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు తుమకూరు జిల్లా బరకనహాల్ గేట్ వద్ద నుంచి రాహుల్ నడక ఆరంభమైంది. ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వెంట వచ్చారు. హులియురు వద్ద గిరిజన మహిళలు ఆయనకు హారతి ఇచ్చారు. అనంతరం వారు పాదయాత్రలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు కెంకెరె వద్ద రాహుల్ టిఫిన్ చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. తరువాత ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు పొరుగున ఉన్న చిత్రదుర్గం జిల్లాలోకి అడుగుపెట్టారు. హిరియూరు వైపు యాత్ర సాగింది. హిరియూరు వద్ద జడివాన కురుస్తున్నప్పటికీ నడకను ఆపలేదు. కార్యకర్తలను ఉత్సాహపరచడానికి పలుచోట్ల నేతలతో కలిసి పరుగులు తీశారు. -
Bharat Jodo Yatra: విద్వేష రాజకీయాల నుంచి యువతను రక్షించాలి
తుమకూరు: విద్వేష రాజకీయాల నుంచి దేశ యువతను రక్షించాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి అవకాశాలను వారికి కల్పించి మంచి భవిష్యత్తును చూపాలన్నారు. యువతను విద్వేషాల మంటల్లోకి నెట్టేవేయడం దేశ భవితను నాశనం చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర ఆదివారం తుమకూరు జిల్లాలో రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కొందరు యువతీయువకులు పెరుగుతున్న నిరుద్యోగం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ వారితో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. శాంతి, సోదరభావ సందేశాన్ని వ్యాపింపజేసి, దేశాన్ని ఐక్యంగా ఉంచే యాత్రలో పాల్గొనాలని ఆయన వారిని కోరారు. ‘కొన్ని రాజకీయ పార్టీలు తమ విద్వేష రాజకీయాల కోసం వారిని నిరుద్యోగులుగానే ఉంచుతూ తప్పుదోవపట్టిస్తున్నాయి. యువత మన దేశ భవిష్యత్తు. ఉపాధి చూపితే వారు తమ, కుటుంబ, దేశ భవిష్యత్తును నిర్మిస్తారు. మనదేశాన్ని మునుపటి మాదిరిగా అందమైన దేశంగా తయారు చేసుకుందాం’అని రాహుల్ పేర్కొన్నారు. చిక్కనాయకనహళ్లిలో చిన్నారులతో కలిసి కారులో కాసేపు ముచ్చటించారు. చిన్నారులతో కలిసి కారులో రాహుల్ సరదా -
అమానుషం.. ఆస్పత్రి మరుగుదొడ్డిలో ఆడ శిశువు మృతదేహం
సాక్షి, బెంగళూరు: తుమకూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తల్లిగర్భం నుంచి బయటపడిన ఆడబిడ్డ మరుగుదొడ్డి పాలై విగతజీవిగా కనిపించింది. తుమకూరు జిల్లా కొరటగెరెలోని ప్రభుత్వ అస్పత్రిలో గురువారం ఉదయం ఒక మహిళా రోగి కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్డిలోకి వెళ్లగా శిశువు మృతదేహం కనిపించింది. ఆస్పత్రి వైద్యాధికారిణి పుష్పలత వచ్చి పరిశీలించగా ఒక రోజు వయసున్న ఆడశిశువుగా గుర్తించారు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుట్టింది ఆడబిడ్డ అని మరుగుదొడ్డి పాలు చేశారా? మృత శిశువుగా జన్మించగా ఇలా పారేశారా అనేది తెలియడం లేదు. మంగళ, బుధవారం ఆస్పత్రిలో ఎన్ని ప్రసవాలు జరిగాయి, ఎంతమంది బాలింతలు డిశార్జ్ అయ్యారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: హిజాబ్ సెగ: సిక్కు బాలికకు చేదు అనుభవం.. ఎక్కడికి దారితీస్తుంది..? -
ప్రేమించిపెళ్ళి చేసుకున్నా.. ఆ సంతోషం ఎక్కువసేపు నిలువలేదు
సాక్షి, బెంగళూరు(తుమకూరు): ప్రేమించిన యువతిని పెళ్ళి చేసుకున్న యువకుని సంతోషం ఎక్కువసేపు నిలువలేదు. తన తల్లిదండ్రులు వద్దని హెచ్చరించడంతో మనోవేదనకు గురై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుణిగల్ పట్టణంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. కుణిగల్ తాలూకాలోని బొమ్మడిగెరెవాసి బీఎం హనుమంత (21) ఏడాది నుంచి మరో కులానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇటీవల ఇద్దరూ గుళ్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇది తెలిసి హనుమంత తల్లిదండ్రులు ఆ పెళ్లిని మరిచిపోవాలని మందలించారు. తల్లిదండ్రులను ఎదిరించలేక, ప్రేయసిని వదులుకోలేక జీవితంపై విరక్తి చెందాడు. ఈ నెల 17న కుణిగల్‌లోని జీకే బీఎంఎస్ కాలేజీ మైదానంలో డీజిల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. చుట్టు పక్కలున్నవారు వెంటనే అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం తరువాత బెంగళూరు విక్టోరియా ఆస్పత్రకి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (భోజనం చేయడానికి బైక్‌పై వెళ్తుండగా కంటైనర్..) -
స్నేహితుడితో కలిసి అత్త హత్య.. కోడలు అరెస్టు
తుమకూరు/కర్ణాటక: శిర తాలూకాలోని ఉజ్జనకుంటె గ్రామానికి చెందిన సరోజమ్మ (65) ఈ నెల 24న తేదీన ఉదయం ఇంట్లో మంటల్లో చిక్కుకుని చనిపోయింది. ఇది ప్రమాదం కాదని, హత్య అని సరోజమ్మ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టి సరోజమ్మ కోడలు సుధామణి, ఆమె పరిచయస్తుడు శ్రీరంగప్పలను తావరకెరె పోలీసులు అరెస్టు చేశారు. అత్త కోడలు మధ్య తరచూ గొడవలు జరిగేవని, ఈ కారణంతోనే పెట్రోలు పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ఆలయానికి వెళ్లి వస్తూ...కారు ఢీకొని దంపతులు దుర్మరణం క్రిష్ణగిరి: ద్విచక్ర వాహనంలో ఆలయానికి వెళ్లి వస్తూ కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందిన ఘటన సూళగిరి సమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకొంది. హోసూరు భారతి నగర్‌కు చెందిన మురళి (35), భార్య రాణి (30) ఉదయం హోసూరు నుండి ద్విచక్ర వాహనంలో కామనదొడ్డి సమీపంలోని దక్షిణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా కళ్లకురిచ్చి నుండి బెంగళూరుకు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో దంపతులు ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
హైవేపై డ్రాగర్ చూపుతూ యువతి హల్చల్
సాక్షి, కర్ణాటక : బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలోని దేవనహళ్లి మార్గంలోని హైదరాబాద్ హైవే, నెలమంగల సమీపంలోని తుమకూరు హైవేలపై వీకెండ్ వచ్చిందంటే యువతీ యువకులు వీలింగ్ చేస్తూ వాహనదారులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. శని, ఆదివారాల్లో తెల్లవారితే వీరి బెడద అంతా ఇంతా కాదు. వీరివల్ల అనేక ప్రమాదాలు సంభవించాయి. ఆదివారం రాత్రి నెలమంగల సమీపంలోని తుమకూరు హైవేపై ఒక జంట రెచ్చిపోయింది. (రాగిణి, సంజనలకు బెయిలు ఇస్తే ఇక అంతే) యువకుడు బైక్‌ను వీలింగ్ చేసి రోడ్డుమీద న్యూసెన్స్ చేస్తుండగా వెనుక కూర్చున్న యువతి చేతిలో డ్రాగర్ పట్టుకుని ప్రదర్శిస్తూ వెర్రిగా కేకలు వేసింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ఈ వీడియో తీసి వైరల్ చేశారు. ఈ జంట కోసం పోలీసులు వేట ప్రారంభించారు. -
ఈజీ మైండ్ ఇట్టే ముంచేసింది..
తుమకూరు: రాజధానిలో బయటపడిన వేలాది కోట్ల ఐఎంఏ జ్యువెల్లర్స్ కుంభకోణం సద్దుమణగక ముందే అదే దారిలో మరో ఘరానా కంపెనీ ప్రజలను నిండా ముంచేసి బోర్డు తిప్పేసింది. చదువులు, పెళ్లిళ్లు, జనరల్ ప్లాన్స్ ఇలా పలు రకాల స్కీములతో అమాయక ప్రజలను నమ్మించి భారీగా నగదు సేకరించి షట్టర్ మూసేసింది. తుమకూరు నగరానికి చెందిన మహ్మద్ అస్లాం అనే వ్యక్తి కొద్ది సంవత్సరాలుగా హెచ్ఎంఎస్ షాదీ మహల్ ఆవరణలోని వాణిజ్య సముదాయంలో ‘ఈజీ మైండ్’ పేరుతో మార్కెటింగ్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. పలు రకాల స్కీములతో పాటు ఓలా, ఉబర్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి వచ్చే లాభాల్లో వాటాలు ఇస్తానంటూ ప్రజలను ఆకర్షించాడు. ఇలా సుమారు ఐదు లక్షల మంది నుంచి రూ.600 కోట్ల మేర సేకరించినట్లు బాధితులు, పోలీసులు చెబుతున్నారు. తుమకూరుతో పాటు ఇతర జిల్లాలు, కేరళ, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రజల నుంచి కూడా డబ్బులు సేకరించాడు. కంపెనీలో పని చేసే ఉద్యోగులు సైతం రెండింతలు డబ్బులు వస్తాయనే ఆశతో తమ జీతాలు కూడా కంపెనీలో పెట్టి మోసపోయారు. మార్చిలోనే దుబాయ్‌కి పరారీ భారీ మొత్తంలో నగదు చేకూరడంతో బోర్డు తిప్పేసి మూడో కంటికి తెలియకుండా మార్చిలో దుబాయ్‌కు పారిపోయాడు. మార్చ్‌లో మూతబడ్డ ఈజీ మైండ్ కార్యాలయం తలుపులు ఈరోజో రేపో తెరుచుకుంటాయని ప్రతి రోజూ ఆశగా పడిగాపులు పడుతున్న బాధితులకు నిరాశే మిగిలింది. మూడునెలలైనా తలుపులు తెరుచుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయిండంతో ఘటన వెలుగు చూసింది. వెల్లువెత్తిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బాధితులు జిల్లా ఎస్పీ వంశీకృష్ణకు మొర పెట్టుకోవడంతో విచారణ జరిపించాలంటూ డీవైఎస్పీ తిప్పేస్వామికి సూచించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు మహ్మద్ కోసం వేట మొదలుపెట్టారు. ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే రఫిక్ అహ్మద్.. ప్రజలను వంచించిన నిందితుడు ఎక్కడ దాక్కున్నా అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెద్దసంఖ్యలో బాధితులు గొల్లుమంటూ వెల్లువెత్తారు. -
దేవెగౌడ నామినేషన్
బెంగళూరు: జనతాదళ్(సెక్యులర్) పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(85) సోమవారం కర్ణాటకలోని తుముకూరు లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన జేడీఎస్, కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. పొత్తుల్లో భాగంగా తుముకూరు సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన జేడీఎస్‌కు కేటాయించింది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ ముద్ద హనుమగౌడ తిరుగుబాటు జెండా ఎగరవేశారు. కాంగ్రెస్ కండువా ధరించి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. చివరి నిమిషంలోనైనా తనకే కాంగ్రెస్ టికెట్ లభిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. రాజన్న అనే మరో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తుముకూరు నుంచి నామినేషన్ చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణులు విభేదాలను వీడి, కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాల్లోని కూటమి అభ్యర్థులను గెలిపించాలని దేవెగౌడ పిలుపునిచ్చారు. పొత్తుల్లో భాగంగా జేడీఎస్ 8, కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. దేవెగౌడ ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్న హసన్ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి తన మనవడు, మంత్రి రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ పోటీ చేస్తున్నారు. దేవెగౌడ పోటీ చేస్తున్న తుముకూరు లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతోపాటు జేడీఎస్ కార్యకర్తల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. పొత్తులో భాగంగా సిట్టింగ్ స్థానాన్ని జేడీఎస్‌కు కేటాయించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. జేడీఎస్‌లో దేవెగౌడ కుటుంబానికి మాత్రమే అధిక ప్రాధాన్యత లభిస్తోందని కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దేవెగౌడ గెలుపు అంత సులువు ఏమీ కాదని పరిశీలకులు భావిస్తున్నారు. -
తుంకూరు నుంచి మాజీ ప్రధాని పోటీ
సాక్షి, బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కర్ణాటకలోని తుంకూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు జేడీఎస్ అధికార ప్రతినిధి రమేష్ బాబు శనివారం ప్రకటించారు. తుంకూరు నియోజకవర్గం నుంచి దేవెగౌడ పోటీ చేస్తున్నారని ప్రకటించగానే, అక్కడి సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ ముద్దహనుమెగౌడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఏమిటీ సంకీర్ణం, సమన్వయం ఎక్కడుంది? ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీని నేను. నాకెందుకు టిక్కెట్ నిరాకరించారు. ఇది సరైనది కాదు' అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో హనుమెగౌడ బీజేపీ అభ్యర్థి జీఎస్.బసవరాజయ్యపై 74 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తన హసన్ లోక్‌సభ స్థానాన్ని మనవడు ప్రజ్వల్‌కు ఇస్తున్నట్లు దేవెగౌడ ఇటీవల స్వయంగా ప్రకటించారు. జేడీఎస్‌కు గట్టిపట్టున్న మాండ్యాం నుంచి పోటీచేయాలని ఆయన యోచించినా అక్కడ సీఎం కుమార స్వామి కుమారుడు నిఖిల్ బరిలో నిలవడంతో పోటీ నుంచి తప్పుకోక తప్పలేదు. కీలకమైన ఎన్నికలు కావడంతో అటు కాంగ్రెస్ నుంచి, ఇటు సొంతపార్టీ నుంచి ఆయన పోటీకి తీవ్రంగా పట్టుబట్టారు. దీంతో దేవెగౌడ పోటీకి దిగక తప్పలేదు. మొత్తం 28 సీట్లలో కాంగ్రెస్ 19, జేడీఎస్ 9 చోట్ల పోటీచేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దేవెగౌడ 1991నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. -
పోలీస్‌స్టేషన్‌లో దెయ్యాలు?
పోలీసులంటే సామాన్య ప్రజలకు హడల్. అటువంటి పోలీసులకే నిద్రలేకుండా చేస్తున్నాయట ఆత్మలు. నేటి డిజిటల్ యుగంలోనూ ఇలాంటివేమిటని కొట్టిపారేయకండి. తుమకూరు జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్లో దయ్యాల సంచారం ఖాకీలకు, ప్రజలకు భీతిగొలుపుతోంది. తుమకూరు : తుమకూరు జిల్లాలోని శిర తాలూకాలోని 4వ జాతీయ రహదారిపై ఉన్న కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్‌ను దెయ్యాల భయం ఆవహించింది. స్టేషన్‌లోని సీసీ కెమెరాల చిత్రాలను పరిశీలిస్తున్న పోలీసులు అందులో రెండు ఆకారాలు స్టేషన్ ఆవరణలో సంచరించడం చూసి భయంతో వణికిపోయారు. బూడిద రంగులోని చుక్కల వంటి ఆకారాలు స్టేషన్ లోపలికి, బయటకు తిరగడం వీడియోలో కనిపించింది. ఆ సీసీ కెమెరా వీడియోలు, ఫోటోలు ఇప్పుడు టీవీ చానెళ్లలో ప్రసారం కాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తరచూ రోడ్డు ప్రమాదాలు కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ప్రతి రోజూ ప్రమాదాల్లో కనీసం ఇద్దరైనా మృత్యువాత పడుతుంటారు. గతంలో కూడా పలు ఘోరమైన రోడ్డు ప్రమాదాలో కళ్లంబెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి లభించని ఆత్మలు దెయ్యాలై పోలీస్‌స్టేషన్‌లో తిరుగుతున్నాయంటూ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. దెయ్యాలున్నట్లు వదంతులు వ్యాపించడంతో రాత్రి వేళల్లో స్టేషన్ చుట్టుపక్కలకు రావడానికి ప్రజలు భీతిల్లుతున్నారు. రాత్రి వేళల్లో స్టేషన్లో పనిచేయడానికి స్టేషన్ సిబ్బంది కూడా జంకుతున్నారు. దయ్యాలను పారదోలడానికి ఏం చేయాలా అని పోలీసులు ఆలోచిస్తున్నారు. -
శివకుమార స్వామికి తుది నివాళులు
-
శివకుమార స్వామికి తుది నివాళులు
సాక్షి, బెంగళూర్ : లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ సోమవారం తుదిశ్వాస విడిచిన ఆథ్యాత్మిక గురు, సిద్ధగంగ మఠానికి చెందిన శివకుమార స్వామి (111) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం జరగనున్నాయి. శివకుమార స్వామిని కడసారి వీక్షించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు, సన్యాసులు తుంకూర్లోని మఠానికి తరలివచ్చారు. లింగాయత్‌ల ఆరాధ్యదైవంగా పేరొందిన స్వామిని నడిచే దేవుడిగా వారు భావిస్తుంటారు. శివకుమార స్వామి మృతికి రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల సంతాపదినాలను ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. స్వామి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి ఆయన ఎనలేని కృషి సాగించారని కొనియాడారు. -
కాంగ్రెస్ ర్యాలీపై యాసిడ్ దాడి
సాక్షి బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీలో గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. సోమవారం విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తూమకూరు కాంగ్రెస్ అభ్యర్థి ఇన్యతుల్లా ఖాన్ భారీ విజయం సాధించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు తూమకూరులో ర్యాలీ నిర్వహించారు. ప్రదర్శనగా వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. దాడి జరిగిన వెంటనే స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి వారికి తరలించారు. ఈ దాడిలో ముపై మందికి పైగా పార్టీ కార్యకర్తుల గాయపడ్డారు. అయితే వారు వాడిన యాసిడ్ తక్కువ మోతాదు కలిగినదని.. దాని వల్ల చిన్నచిన్న గాయలతో వారు బయటపడ్డారని వైద్యులు తెలిపారు. ఘటనపై స్పందించిన తూమకూరు ఎస్పీ విచారణ ప్రారంభించామని, నిందితులను వీలైనంత త్వరగా గుర్తిస్తామని పేర్కొన్నారు. బాధితుల నుంచి ఇంతవరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. సోమవారం విడుదలైన పట్టణ,స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో 2,709 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 954, బీజేపీ 905, జేడీఎస్ 364 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఈ ఎన్నికల ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. -
అయ్యో.. ఎంత ఘోరం..!
సాక్షి, తుమకూరు: కుమారుడి పెళ్లి పత్రికలను బంధువులకు ఇచ్చేందుకు పయనమైన తల్లీ తనయుడిని మృత్యువు కాటేసింది. మరికొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడిని విధి కాటికి తరలించింది. ఈ విషాద ఘటన జిల్లాలోని మధుగిరి తాలూకా, మిడిగేశి పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. తాలూకాలోని మాడగానహట్టి గ్రామానికి చెందిన కంబక్క(48)కుమారుడు మంజునాథ్(26) పడసాలహట్టికి చెందిన యువతితో వివాహం నిశ్చచమైంది. ఈ నెల 22న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో బంధువులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చేందుకు కంబక్క, మంజునాథ్‌లు బుధవారం బైక్‌పై బయల్దేరారు. మధుగిరి– పావగడ మధ్యలో కేశిప్ రోడ్డులో పడసాలహట్టి బస్టాండు సమీపంలో వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొంది. ప్రమాదంలో కంబక్క అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మంజునాథ్‌ను ఆస్పత్రకి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మిడిగేశి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
ప్రేమ ఆవిరైందో ఏమో..
సాక్షి, తుమకూరు: మాయమాటలతో కాలేజీ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడిన వంచకుడు ఆమెకు నరకం చూపించాడు. అతను బస్ డ్రైవర్, యువతి ఎం.ఏ. పట్టభద్రురాలు, ఇద్దరి మధ్య ఒక టూర్లో ప్రేమ పుట్టింది. నాలుగు సంవత్సరాల ప్రేమ తరువాత పెళ్ళి చేసుకున్నారు. అయితే ప్రేమ ఆవిరైందో ఏమో.. ఆ భర్త భార్యను శారీరకంగా, మానసికంగా హింసిస్తుండడంతో బాధితురాలు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కనాయకనహళ్ళి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయినా, మళ్లీ ప్రేమ జిల్లాలోని ఉర్డిగెరె గ్రామానికి చెందిన మంజుల అనే యువతి కాలేజీలో చదువుకునే రోజుల్లో విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్ళింది. చిక్కనాయకనహళ్ళి తాలూకాలోని దేవరహళ్ళి గ్రామానికి చెందిన బస్‌డ్రైవర్ రంగనాథ్ స్వామి విద్యార్థుల బస్‌కు డ్రైవర్‌గా వెళ్లాడు. యాత్రలో అతని కన్ను మంజులపైన పడింది. బస్సులో ఉన్న సమయంలో పరిచయం పెంచుకుని, సుమారు నాలుగు సంవత్సరాల పాటు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆమె గర్భం కూడా దాల్చింది. ఆమె పెళ్లి చేసుకోమని కోరగా, రంగనాథ్ తనకు అప్పటికే పెళ్లయిన విషయాన్ని చల్లగా చెప్పాడు. చివరికి రంగనాథ్ తన మొదటి భార్యను ఒప్పించి ఇటీవలే మంజులకు కూడా తాళి కట్టాడు. అప్పటి నుంచి మంజులను తీవ్రంగా వేధించడంతో పాటు, కొట్టడం కూడా జరిగింది. అయినా మంజుల భరిస్తు వచ్చింది. కొన్ని రోజుల నుంచి అతడు మరింత క్రూరంగా ప్రవర్తిస్తూ భార్యను తీవ్రంగా కొట్టి ఒంటినిండా గాయాలు అయ్యేలా చేశాడు. దాంతో బాధితురాలు మంజుల చిక్కనాయకనహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అందంతో ఎరవేసి వంచన..
-వరుస వివాహాలతో కిలేడీ హల్చల్ తుమకూరు(బెంగళూరు): తన అందాన్ని ఎరగా వేసి ధనవంతులను వివాహం చేసుకొని తర్వాత వారి వద్ద బంగారు, నగదు కాజేసేది. అనంతరం మరొకరిని వివాహం చేసుకుంటున్న ఓ కిలేడీ వంచనను మాజీ భర్త బట్టబయలు చేశారు. ఇప్పటి వరకు నలుగురిని వివాహం చేసుకున్న మహిళ ఐదో పెళ్లికి సిద్దమైంది. విషయం తెలుసుకున్న మాజీ భర్త గమనించి ఆమె వ్యవహారాన్ని రట్టు చేశాడు. ఈ ఘటన తుమకూరు జిల్లా, తిపటూరు తాలుకాలో వెలుగు చూసింది. ఈచనూరు గ్రామానికి చెందిన పుష్పావతి తన అందంతో ధనవంతులకు గాలం వేసేది. వారిని వివాహం చేసుకున్న తర్వాత ఆస్తిపాస్తులును కాజేసి వారిపైనే వేధింపులు కేసులు నమోదు చేయడం, విడాకులు తీసుకోవడం జరిగేది. ఇలా 2000 సంవత్సరంలో తిపటూరుకు చెందిన లింగదేవరు అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె.. అతని వద్ద నుంచి నగదు, ఆస్తి, నగలు కాజేసింది. తర్వాత అతని నుంచి విడాకులు తీసుకుంది. 2016లో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే జగదీష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అతని వద్ద సైతం నగలు, నగదు తీసుకుంది. తర్వాత ధనవంతులైన వైద్య విద్యార్థులను గుర్తించి వారితో కలిసి తిరుగుతూ జగదీష్‌కు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. దాంతో సదరు కిలేడీ అతనితో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం మరో వ్యక్తితో బెంగళూరు నగరంలో వివాహానికి సిద్ధమవుతుండగా జగదీష్‌కు సమాచారం అందింది. దీంతో అతను తిపటూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆమె నుంచి వంచనకు గురైన మాజీ భర్తలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. -
కమలం కరువు భేరి
► తుమకూరులో శ్రీకారం ► హాజరైన కేంద్రమంత్రులు ►పార్టీలో విభేదాల్లేవు: యడ్డి తుమకూరు: తమ మధ్య ఎటువంటి విభేదాలు, అంతర్గత కలహాలు లేవు, పార్టీ సమావేశాలు, కార్యక్రమాల్లో మేమంతా కలిసే పాల్గొంటున్నాం, రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందంటూ వచ్చిన వార్తలు కేవలం మీడియా సృష్టేనని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. కేంద్రమంత్రులు సదానందగౌడ, అనంత్‌కుమార్, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ మురళీధర్‌రావు, ఇతర సీనియర్ నాయకులు 40 రోజుల రాష్ట్రవ్యాప్త కరువు పర్యటనను గురువారం తుమకూరులో ఆరంభించారు. తుమకూరు సిద్ధగంగా మఠాధీశుడు శివకుమార్స్వామీజీ దర్శనం చేసుకున్నారు. అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 రోజుల పాటు అన్ని జిల్లాలు, తాలూకాల్లో పర్యటించి కరువుపై సమాచారాన్ని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. నిత్యం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కరువు అధ్యయన పర్యటన సాగుతుందని చెప్పారు. పార్టీలో ఎలాంటి అనైక్యత లేదని తేల్చిచెప్పారు. త్వరలో సిద్ధగంగ మఠానికి ప్రధాని మోదీ కేంద్రమంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ.. ఇటీవల అనారోగ్యానికి గురైన శివకుమార్స్వామీజీ ఆరోగ్యంపై విచారించిన ప్రధాని నరేంద్రమోదీ త్వరలోనే మఠానికి వచ్చి స్వామీజీని దర్శించుకుంటారని తెలిపారు. రాష్ట్ర కరువు నివారణ అధ్యయన పర్యటనను స్వామీజీ ఆశీర్వాదంతో తుమకూరు జిల్లా నుంచి ప్రారంభించడం సంతోషకరమన్నారు. అనంతరం తుమకూరు నగరంలోని దళితవాడలో కరువు నివారణ, తాగునీరు తదితర సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి రమేశ్ జిగజణగి, నేతలు జగదీశ్ శెట్టర్, ఈశ్వరప్ప, శోభ, శ్రీరాములు పాల్గొన్నారు. -
నెరవేరిన దంపతుల కల
► 9 మంది కుమార్తెల తరువాత 10వ సంతానంగా వారుసుడు ► కుమారుడితో ఆస్పత్రిలో దంపతులు ► 10వ సంతానం కుమారుడితో రామకృష్ణ తుమకూరు : వంశోద్ధారకుడి కోసం తపించిన ఆ దంపతుల కల నెరవేరింది. తొమ్మిది మంది కుమార్తెల తర్వాత ఆ దంపతులకు పదవ సంతానంగా కుమారుడు జన్మించాడు. దీంతో వారు పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా, కోడగెనహళ్లి సమీపంలోని కురికనహళ్లిలో రామకృష్ణ, భాగ్యమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. 15 సంవత్సరాల క్రితం వీరికి వివాహమైంది. మొదటి సంతానం కుమార్తె జన్మించగా ఆ బాలిక వయస్సు 14 సంవత్సరాలు. మరో కాన్పులోనూ ఆడబిడ్డ జన్మించింది. కుమారుడు కావాలనే కోరికతో ఉన్న దంపతులకు వరుసగా తొమ్మిది మంది కుమార్తెలు కలిగారు. ఈక్రమంలో మరోమారు ఆమె గర్భం దాల్చడంతో వెంటవెంటనే ఆడపిల్లలు పుట్టడంతో ఎలాగైన వంశాన్ని పెంచడం కోసం కుమారుడు కావాలను కున్నారు. దాంతో 9 మంది ఆడపిల్లలన కన్నారు. 10వ సంతానంగా శుక్రవారం బాగ్యమ్మ (39). మగపిల్లాడి జన్మనివ్వడంతో దంపతూలు సంతోషంగా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం మహిళలకు పురిటి నొప్పులు వస్తున్న సమయంలో ఆంబూలేన్స్లో హిందుపురంలో ఉన్న ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మద్యలో మగ శిశువుకు జన్మనివ్వడం జరిగింది. దాంతో 10 సంతానం అయినా కుడ వారసుడు రావడంతో కుటుంబం అంత సంతోషంగా ఉన్నారు.