
సాక్షి, బెంగళూరు: తుమకూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తల్లిగర్భం నుంచి బయటపడిన ఆడబిడ్డ మరుగుదొడ్డి పాలై విగతజీవిగా కనిపించింది. తుమకూరు జిల్లా కొరటగెరెలోని ప్రభుత్వ అస్పత్రిలో గురువారం ఉదయం ఒక మహిళా రోగి కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్డిలోకి వెళ్లగా శిశువు మృతదేహం కనిపించింది. ఆస్పత్రి వైద్యాధికారిణి పుష్పలత వచ్చి పరిశీలించగా ఒక రోజు వయసున్న ఆడశిశువుగా గుర్తించారు
ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుట్టింది ఆడబిడ్డ అని మరుగుదొడ్డి పాలు చేశారా? మృత శిశువుగా జన్మించగా ఇలా పారేశారా అనేది తెలియడం లేదు. మంగళ, బుధవారం ఆస్పత్రిలో ఎన్ని ప్రసవాలు జరిగాయి, ఎంతమంది బాలింతలు డిశార్జ్ అయ్యారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: హిజాబ్ సెగ: సిక్కు బాలికకు చేదు అనుభవం.. ఎక్కడికి దారితీస్తుంది..?
Comments
Please login to add a commentAdd a comment