తుమకూరు: లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో టెక్కీ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద కర్నాటకలోని తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకాలోని హులియూరు గేట్ వద్ద చోటుచేసుకుంది. మృతులను రఘు (35) అతని భార్య అనూష (28)లుగా గుర్తించారు.
వివరాల ప్రకారం.. హాసన్ జిల్లాలోని అరసికెరెకు చెందిన రఘు, తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకాలోని తిగడనహళ్లికి చెందిన అనూషతో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. వారు బెంగళూరులో ఐటీ ఇంజనీర్లుగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. బళ్లారిలో బంధువుల పెళ్లి ఉండడంతో చిక్కనాయకనహళ్లి నుంచి కారులో వెళుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీ వారి కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాద ఘటనలో కారు నుజ్జయింది. దంపతులిద్దరూ తీవ్ర గాయాలతో కన్నుమూశారు. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరకుని వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక, ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment