అందంతో ఎరవేసి వంచన.. | woman fraud to the mens with her beauty | Sakshi
Sakshi News home page

అందంతో ఎరవేసి..ఐదో పెళ్లికి..

Published Wed, Sep 20 2017 8:43 AM | Last Updated on Wed, Sep 20 2017 11:53 AM

అందంతో ఎరవేసి వంచన..

అందంతో ఎరవేసి వంచన..

-వరుస వివాహాలతో కిలేడీ హల్‌చల్‌

తుమకూరు(బెంగళూరు): తన అందాన్ని ఎరగా వేసి ధనవంతులను వివాహం చేసుకొని తర్వాత వారి వద్ద బంగారు, నగదు కాజేసేది. అనంతరం మరొకరిని వివాహం చేసుకుంటున్న ఓ కిలేడీ వంచనను మాజీ భర్త బట్టబయలు చేశారు. ఇప్పటి వరకు నలుగురిని వివాహం చేసుకున్న మహిళ ఐదో పెళ్లికి సిద్దమైంది. విషయం తెలుసుకున్న మాజీ భర్త గమనించి ఆమె వ్యవహారాన్ని రట్టు చేశాడు. ఈ ఘటన తుమకూరు జిల్లా, తిపటూరు తాలుకాలో వెలుగు చూసింది.

ఈచనూరు గ్రామానికి చెందిన పుష్పావతి తన అందంతో ధనవంతులకు గాలం వేసేది. వారిని వివాహం​ చేసుకున్న తర్వాత ఆస్తిపాస్తులును కాజేసి వారిపైనే వేధింపులు కేసులు నమోదు చేయడం, విడాకులు తీసుకోవడం జరిగేది. ఇలా 2000 సంవత్సరంలో తిపటూరుకు చెందిన లింగదేవరు అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె.. అతని వద్ద నుంచి నగదు, ఆస్తి, నగలు కాజేసింది. తర్వాత అతని నుంచి విడాకులు తీసుకుంది.

2016లో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే జగదీష్‌ అనే వ్యక్తిని వివాహం‍ చేసుకుంది. అతని వద్ద సైతం నగలు, నగదు తీసుకుంది. తర్వాత ధనవంతులైన వైద్య విద్యార్థులను గుర్తించి వారితో కలిసి తిరుగుతూ జగదీష్కు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడింది. దాంతో సదరు కిలేడీ అతనితో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం మరో వ్యక్తితో బెంగళూరు నగరంలో వివాహానికి సిద్ధమవుతుండగా జగదీష్‌కు సమాచారం అందింది. దీంతో అతను తిపటూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆమె నుం‍చి వంచనకు గురైన మాజీ భర్తలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement