సాక్షి బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీలో గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. సోమవారం విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తూమకూరు కాంగ్రెస్ అభ్యర్థి ఇన్యతుల్లా ఖాన్ భారీ విజయం సాధించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు తూమకూరులో ర్యాలీ నిర్వహించారు. ప్రదర్శనగా వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. దాడి జరిగిన వెంటనే స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి వారికి తరలించారు. ఈ దాడిలో ముపై మందికి పైగా పార్టీ కార్యకర్తుల గాయపడ్డారు. అయితే వారు వాడిన యాసిడ్ తక్కువ మోతాదు కలిగినదని.. దాని వల్ల చిన్నచిన్న గాయలతో వారు బయటపడ్డారని వైద్యులు తెలిపారు.
ఘటనపై స్పందించిన తూమకూరు ఎస్పీ విచారణ ప్రారంభించామని, నిందితులను వీలైనంత త్వరగా గుర్తిస్తామని పేర్కొన్నారు. బాధితుల నుంచి ఇంతవరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. సోమవారం విడుదలైన పట్టణ,స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో 2,709 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 954, బీజేపీ 905, జేడీఎస్ 364 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఈ ఎన్నికల ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment