విజయ్ తో చేయాలని ఉంది | Is Keerthi Suresh the love interest of Vijay ? | Sakshi
Sakshi News home page

విజయ్ తో చేయాలని ఉంది

Published Sun, Jan 24 2016 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

విజయ్ తో చేయాలని ఉంది

విజయ్ తో చేయాలని ఉంది

వర్ధమాన నాయికలు ప్రముఖ కథానాయకుల సరసన నటించే అవకాశం రావాలని ఆశపడడం సాధారణ విషయమే. నటి కీర్తీసురేష్ అలా కోరుకోవడంలో ఆశ్చర్యం ఏముంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఒకప్పుడు కోలీవుడ్‌లో హీరోయిన్ల కొరత చాలా ఉండేది. నయనతార, త్రిష, కాజల్‌అగర్వాల్, తమన్న, అనుష్క లాంటి వారే ప్రముఖ కథానాయకులతో నటించేవాళ్లు.

ఇప్పుడా పరిస్థితి లేదు. హన్సిక, కీర్తీసురేష్, శ్రీదివ్య, క్యాథరిన్ ట్రెసా వంటి వర్ధమాన హీరోయిన్లు పోటీగా తయారయ్యారు. దీంతో హీరోయిన్లకు కొరత లేకుండాపోయింది. అంతేకాదు దర్శక నిర్మాతలకు పారితోషికాల విషయంలో బేరసారాలాడి నాయికల్ని ఎంపిక చేసుకునే అవకాశం కలుగుతోంది. అదే విధంగా ఇప్పుడు చిత్రానికో కొత్త నాయకి పరిచయం అవడంతో పలాన ప్రముఖ నాయకిలా ఉన్నావంటూ వారికి ప్రాచుర్యం తెచ్చిపెట్టడంతో ఆయా ప్రముఖ నాయికలు తమ అవకాశాలను తన్నుకు పోతారనే భయంతో తమ పారితోషకాలను దగ్గించుకోవడానికి సిద్ధపడుతున్నారని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

విషయం ఏమిటంటే విజయ్ తాజాగా నటిస్తున్న తెరి చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇది తనకు 60వ చిత్రం అన్నది గమనార్హం. విజయాప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరతన్ దర్శకుడు. ఇందులో కథానాయికగా కాజల్ అగర్వాల్ నటించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఆమె ఇందులో నటించడానికి రెండున్నర కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారంలో ఉంది. తాజాగా వర్ధమాన నటి నటి మియాజార్జ్ పేరు తెరపైకి వచ్చింది.

అయితే ఆమె ఆ ప్రచారాన్ని కొట్టివేయడంతో ఇప్పుడు మరో యువ నటి కీర్తీసురేష్ పేరు వార్తలో తేలుతోంది. దీని గురించి ఆ అమ్మడిని అడగ్గా విజయ్‌తో నటించాలని తనకూ చాలా ఆశగా ఉంది. అలాంటి అవకాశం వస్తే వదులుకోను అనిబదులిచ్చింది. అన్నట్టు ఈ బ్యూటీ నటించిన రజనీమురుగన్ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో వీరవిహారం చేస్తోంది. దీంతో కీర్తీసురేష్ ఆనందానికి అవధుల్లేకుండాపోతున్నాయి. మరి ఈ ముద్దుగుమ్మకు ఇళయదళపతితో నటించే అవకాశం అంత త్వరగా వస్తుందా? చూద్దాం ఈ భామ అదృష్టం ఎలాగుందో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement