నెలాఖరున తమిళనాట పవన్ కల్యాణ్ దీక్ష | pawan to be protest on Tamil Language Special Provisions Act | Sakshi
Sakshi News home page

నెలాఖరున తమిళనాట పవన్ కల్యాణ్ దీక్ష

Published Mon, Sep 21 2015 7:22 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

నెలాఖరున తమిళనాట పవన్ కల్యాణ్ దీక్ష - Sakshi

నెలాఖరున తమిళనాట పవన్ కల్యాణ్ దీక్ష

హోసూరు(తమిళనాడు): నిర్బంధ తమిళ భాషా చట్టాన్ని వ్యతిరేకిస్తూ సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడులో దీక్ష చేపట్టనున్నారు. ఈ నెలాఖరున ఆయన చేపట్టే దీక్ష కోసం పవన్ అభిమానులు, తెలుగు భాషాభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్బంధ తమిళభాషా చట్టంతో ఈ రాష్ట్రంలో మైనార్టీ భాషలైన తెలుగు, కన్నడ, ఉర్దూ, మలయాళం విద్యాభ్యాసానికి  విద్యార్థులు దూరమైపోతున్నారని తమిళనాడు తెలుగు యువశక్తి, తెలుగు సాహిత్య పరిషత్ సంస్థలు ఈ నెల 10వ తేదీన  హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించిన విషయం విదితమే.

ఆ సమయంలో సమస్య తీవ్రతపై ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కూడా స్పందించారు. తెలుగు భాషా పరిరక్షణకు ముఖ్యమంత్రి జయలలితతో సంప్రదిస్తానని జగన్ హామీనిచ్చినట్లు ఆందోళనలో పాల్గొన్న తెలుగు వారు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ కూడా స్పందిస్తూ తమిళనాడులో దీక్ష చేపడతానని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement