రెండువారాల క్రితం విడుదలైన, విజయవంతంగా నడుస్తున్న 36 వయదినిలే సినిమా సక్సెస్తో సినీ జంట సూర్య, జ్యోతిక మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ భార్యభర్తలిద్దరూ జంటగా నటించి ప్రేక్షకులను అలరించనున్నారట. 36 వయదినిలే సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడిన సూర్య స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.