బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం 1920లో నేరస్థుల గుర్తింపు చట్టాన్ని ఆమోదించింది. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన నెల రోజుల తర్వాత ఈ చట్టం అమలులోకి వచ్చింది. జాతీయవాదం పెల్లుబుకుతున్న వేళ, ప్రజలపై నిఘా పరిధిని విస్తరించడం ద్వారా వారిని మరింతగా నియంత్రించడానికిగానూ బ్రిటిష్ పాలకులు చేసిన ప్రయత్నంలో భాగంగా ఆనాడు నేరస్థుల గుర్తింపు చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం నేరస్థుల ఫొటోగ్రాఫ్‌లు, వేలిముద్రలు, పాద ముద్రలు వంటివాటిని (కొన్ని పరిమిత కేసుల్లో నేరస్థులు కానివారివి కూడా) భద్రపర్చే అధికారాలను చట్టాన్ని అమలు చేసే అధికారులకు దఖలు పర్చింది.
ఇలాంటి వివరాలను భద్రపర్చడానికీ, తొలగించడానికీ మరిన్ని నిబంధనలు తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ 102 సంవత్సరాల తర్వాత, స్వతంత్ర భారతదేశంలో నెహ్రూ తర్వాత సుదీర్ఘ కాలం దేశాన్ని పాలిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, వలస పాలనా కాలంనాటి చట్టం చేసిన దానికంటే మరింత అధికంగా వ్యక్తిగత డేటాను (అతితక్కువ భద్రతలతో) సేకరించడానికి ప్రయత్నిస్తూ తాజా ముసాయిదా బిల్లును తీసుకొచ్చి నేరస్థుల గుర్తింపు చట్టాన్ని మార్చనుంది. అయితే ఈ అధికారాలను చట్టపరంగా విస్తరించేటప్పుడు వాటిని క్రమబద్ధీకరించ వలసి ఉంటుందన్న ప్రజాభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ చట్టంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయనుంది. ఇందుకోసం మరింత ప్రజాస్వామికమైన ప్రక్రియను అనుసరించనుంది.
(చదవండి: స్వతంత్ర భారతి: షా బానో కేసు)
Comments
Please login to add a commentAdd a comment