డీఎఫ్‌వో శేఖర్‌బాబు పర్యటన
సీలేరు: విశాఖ ఏజెన్సీలో విలువైన అటవీ కలప దొంగదారి పట్టకుండా ర వాణా నిరోధానికి ప్రభుత్వం అటవీ శాఖ చట్టాల్లో పెనుమార్పులను తీసుకు వచ్చిందని నర్సీపట్నం డీఎఫ్‌వో శేఖర్‌బాబు అన్నారు. బా ధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి సీలేరు రేంజీలో గురువారం పర్యటించారు. విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ఫారెస్ట్ యాక్టు ప్రకారం 1967 లో మార్పులు చేసిన ప్రకారం ఫారెస్ట్ కేసులన్నీ నాన్‌బెయిల్‌బుల్ కేసులుగా మార్పు చేసినట్టు తెలిపారు. ఈయాక్టు వచ్చిందని, దీంతోపాటు రూల్స్ రావాల్సి ఉన్నందున వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. కలప అక్రమ రవాణా నివారించేందుకు దారకొండ, చింతపల్లి తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఉన్నాయని, వీటితోపాటు 2 వెహికల్ పోస్టులు నిఘా పెట్టినట్టు తెలిపారు.
2029 నాటికి జీయోగ్రఫీకల్ ఆఫ్ ఏపీగా తీర్చిదిద్దుతాం..
2029 నాటికి ఏపీలో 50 శాతం జీయోగ్రఫీకల్ ఆఫ్ ఏపీ మొక్కలు ఉండే ప్రదేశంగా తీర్చిదిద్దిందేకు వనం–మనం కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. నర్సీపట్నం అటవీశాఖలో 225 హెక్టార్లలో వివిధ రకాల మొక్కలతో పాటు, 40 ఎకరాల్లో ఔషధజాతి మొక్కలు (నేషనల్ మెడికల్ ప్లాంట్ బోర్డు) నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. 160 హెక్టార్లలో టేకు, ఇతర జాతి మొక్కలను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గత ఏడాది చేపట్టిన 280 హెక్టార్లలో వుడా మెయింట్‌నెన్స్ పనుల కింద చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటనున్నట్టు వివరించారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో ఖాళీ ప్రదేశాలను గుర్తించి హెక్టార్‌కు 200 మొక్కలు పెంచేందుకుప్రభుత్వం ఎ¯Œæఆర్‌ఈజీఎస్ నిధులతో ట్రీగార్డులు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇచ్చిందన్నారు. హెలీకాప్టర్ ద్వారా విత్తనాలు చల్లేందుకు ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. డివిజన్ పరిధిలో 7 లక్షల వరకు నర్సరీలో మొక్కలు ఉన్నాయని వీటిని ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఫీల్డ్‌వోకు 0–50 పైసలకు పంపిణీ చేస్తామని వివరించారు.
కలప అక్రమ రవాణా నిరోధానికి చట్టం
Published Fri, Aug 5 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
Advertisement
Advertisement