ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఈవీ) వినియోగం పెరిగిపోతుంది.టెక్నాలజీని ఫోలో అవుతూ వినియోగదారులు పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయా దేశాల ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ వెహికల్స్ కోసం కొత్త చట్టాల్ని అమలు చేయనున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్లను ఎంకరేజ్ చేస్తూ ఓ నూతన చట్టాన్ని అమలు చేయనుంది.
2030 నాటికి ఇంగ్లాండ్‌లో ఫ్యూయల్ వెహికల్స్‌ను పూర్తిగా బ్యాన్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ లో నిర్మించే ఆఫీస్‌ల్లో, ఇళ్లల్లో స్మార్ట్ ఛార్జింగ్‌లను ఏర్పాటు చేయాలని తెలిపింది. వీటితో పాటు ప్రతి ఐదు పార్కింగ్ స్థలాలకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జర్‌ను ఏర్పాటును తప్పని సరి చేసింది. లేదంటే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి.
ఎలక్ట్రిక్ వెహికల్ చట్టం మంచిదే
వరల్డ్ వైడ్‌గా తొసారి ఇంగ్లాండ్ ఈ చట్టాన్ని అమలు చేయనుంది. ఈ చట్టంపై పలువురు అ దేశాది నేతలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన ఇళ్లలో సరైన పార్కింగ్ లు, గ్యారేజీలు లేకపోవడంతో పర్యావరణం దెబ్బతింటుందని, ఈ నూతన చట్టం అమలు చేయడం ప్రయోజకరంగా ఉంటుందని అమెరికన్ మీడియా 'ఎలక్ట్రిక్' తన కథనంలో పేర్కొంది.
చదవండి: అన్నీ ఎలక్ట్రిక్ వాహన కంపెనీల ఛార్జింగ్ స్టేషన్లు ఒకే యాప్‌లో
Comments
Please login to add a commentAdd a comment