మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బైక్ తయారీదారు 'రాయల్ ఎన్‌ఫీల్డ్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2024 నవంబర్ 4న మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది.
కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను సంబంధించిన ఓ టీజర్ విడుదల చేసింది. అయితే నవంబర్ 4న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆవిష్కరించే ఎలక్ట్రిక్ బైక్ కేవలం కాన్సెప్ట్ అయి ఉండొచ్చని, రాబోయే రోజుల్లో మార్కెట్లో ఈ బైక్ లాంచ్ అవుతుందని సమాచారం.
ఇప్పటికి లీకైన సమాచారం ప్రకారం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ లేటెస్ట్ క్లాసిక్ డిజైన్ పొందుతుందని తెలుస్తోంది. ఫ్యూయెల్ ట్యాంక్ స్థలంలో బహుశా స్టోరేజ్ స్పేస్ ఉండొచ్చని సమాచారం. పేటెంట్ ఇమేజ్ సింగిల్-సీట్ లేఅవుట్‌ను కలిగి ఉండనున్నట్లు వెల్లడిస్తున్నప్పటికీ.. పిలియన్ సీటును కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలుస్తోంది.
ఇదీ చదవండి: బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదే..
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ సాధారణ డిజైన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. వెనుక భాగం అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్, మోనోషాక్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఈ బైక్ ఎలక్ట్రిక్01 అనే కోడ్ నేమ్ కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఇంకా చాలా వివరాలు అధికారికంఘా వెల్లడి కావాల్సి ఉంది. అనుకున్న విధంగా ఈ బైక్ మార్కెట్లో లాంచ్ అయితే ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment