మాజీమంత్రి హరీశ్‌రావు ధ్వజం
రేవంత్ అబద్ధాలతో శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారు
దీనిపై ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చాం
సభా హక్కుల ఉల్లంఘన నోటీసు కూడా ఇస్తాం
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో పాలక పక్షం ఆత్మరక్షణలో పడినప్పుడల్లా సీఎం రేవంత్‌రెడ్డి సభా నాయకుడిగా ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని అబద్ధాలతో చర్చలను పక్కదారి పట్టిస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆదర్శంగా ఉండాల్సిన సభా నాయకుడు ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోనూ అబద్ధాలు మాట్లాడుతున్నారని, వరుస అబద్ధాలతో సభ ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నారని విమర్శించారు. సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్న తీరుపై ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చామని, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు కూడా ఇస్తామని తెలిపారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు.
అన్నీ అబద్ధాలే
‘ప్రస్తుత అసెంబ్లీ తొలి సమావేశంలో మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని రిటైర్డు ఇంజనీర్లు చెప్పిన అంశంపై రేవంత్ సభను తప్పుదోవ పట్టించారు. ప్రస్తుత సమావేశాల్లో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు అంశంలో తమకు అనుకూలంగా ఉన్న వాక్యాన్ని మాత్రమే చదివి అందులోని కొన్ని పదాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు సంబంధించి కూడా బీఆర్‌ఎస్ మంత్రులపై రేవంత్‌రెడ్డి అసత్యాలు చెప్తున్నారు.
పులిచింతల ప్రాజెక్టు విషయంలో నాటి కాంగ్రెస్ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెదవులు మూసుకున్నారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా 2005లో ఆరుగురు బీఆర్‌ఎస్ మంత్రులు రాజీనామా చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ కింద ఎలాంటి రుసుము లేకుండా క్రమబద్ధీకరణ చేయాలని కోర్టుకు వెళ్లిన కోమటిరెడ్డి.. ఇప్పుడు డబ్బులు వసూలు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై ద్వంద్వ విధానంతో వ్యవహరిస్తున్నారు..’అని హరీశ్‌రావు విమర్శించారు.
18 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు గుండు సున్నా
‘బీఆర్‌ఎస్ పని అయిపోయిందని అధికార పక్షం అంటోంది. కానీ దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 18 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీ సీటూ దక్కలేదు. 1984 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏనాడూ సొంత బలంతో కేంద్రంలో అధికారంలోకి రాలేదు. 28 పారీ్టలతో ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్‌కు వచ్చింది 22 శాతం ఓట్లు, 99 సీట్లు మాత్రమే. తెలంగాణలో రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ను ఓడించింది బీఆర్‌ఎస్ పారీ్టయే..’అని మాజీమంత్రి గుర్తు చేశారు.
ఉద్యమ సమయంలో పెదవులు మూసుకున్న రేవంత్
‘తెలంగాణ ఉద్యమ సమయంలో పదవుల కోసం రేవంత్‌రెడ్డి పెదవులు మూసుకున్నారు. ఉద్యమంలో భాగంగా మేం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే.. రేవంత్ కనీసం రాజీనామా పత్రం జిరాక్స్ కాగితం కూడా ఇవ్వలేదు. ఉద్యమకారుల బలిదానానికి ఇలాంటి నేతలే కారణం. ఉద్యమకారులపైకి రైఫిల్‌తో వెళ్లిన రేవంత్.. ఇప్పుడు తనకు తాను తెలంగాణ చాంపియన్‌గా చెప్పుకుంటున్నారు. కేసీఆర్ తెచి్చన తెలంగాణ వల్లే రేవంత్ సీఎం అయ్యారు. దివంగత మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తనకు తాను జాతీయవాదిగా చెప్పుకున్నారు. రేవంత్‌ను ఆయన పురుగులా చూసేవారు. తాను జీవించి ఉన్న కాలంలో ఎన్నడూ రేవంత్‌ను కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు..’అని హరీశ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment