
కాంగ్రెస్‌కు వ్యూహమే లేదు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల చర్చల్లో పాల్గొనడానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు ఎలాంటి వ్యూహం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజా సమస్యలపై చర్చను వదిలేసి రాజకీయ వేదికగా అసెంబ్లీని వాడుకోవాలని చూస్తోందన్నారు. బుధవారం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఎజెండా లేకుండా, ఏ అంశానికి ప్రాధాన్యం ఉందో తెలుసుకోలేకపోతోందన్నారు. లేవనెత్తకూడని అంశాలను లేవనెత్తి తామే ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నారన్నారు. లోతుగా అధ్యయనం చేయకుండా సభకు వస్తున్న ప్రధాన ప్రతిపక్షం విమర్శల పాలవుతోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సభ్యుల రొటేషన్: తలసాని
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. సభలో చర్చ జరిగే సమయంలో కాంగ్రెస్ సభ్యులంతా ఉండడం లేదన్నారు. రొటేషన్ పద్ధతిలో నలుగురు చొప్పున సభకు వస్తున్నారని పేర్కొన్నారు.