సాక్షి, హైదరాబాద్: శాసనస సభ స్పీకర్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి సభలో సభ్యులెవరూ సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర ఎల్రక్టానిక్ గ్యాడ్జెట్స్‌ను వినియోగించకూడదని రూలింగ్ ఇచ్చారు. వాటిని ఉపయోగించి వీడియోలు ప్రదర్శించకూడదని ఆదేశించారు. ‘కృష్ణా నది మీద నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్‌ఎంబీకి అప్పగించే అంశం’మీద సభలో ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా అధికార–ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన విషయం తెలిసిందే.
కేఆర్‌ఎంబీకి తాము ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత అప్పగించటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన సమయంలో, ఆ నిర్ణయానికి భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించిన అప్పటి నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ (ప్రస్తుతం మాజీ) మురళీధర్‌రావు పేర్కొన్నట్టుగా ఉన్న వీడియోను ఫోన్ ద్వారా ప్రదర్శించారు. ఇది ప్రభుత్వాన్ని కొంత ఇ రుకున పెట్టింది. ఈ నేపథ్యంలో సభలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగంపై గురువారం స్పీకర్ నిర్ణ యం వెల్లడించటం విశేషం. స్పీక ర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా సభలో వాటిని వినియోగించవద్దని స్పష్టం చేశారు.
మీడియా పాయింట్ వద్ద కూడా
ఇక సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మీదట బీఆర్‌ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు మీడియాతో మాట్లాడేందుకు సభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్దకు వస్తుండగా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. సభ జరుగుతున్న తరుణంలో మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశానికి అనుమతి లేదంటూ వారు పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు నేలమీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సభ ప్రారంభం అవుతూనే స్పీకర్ ప్రసాద్‌కుమార్ కీలక ప్రకటన చేశారు. సభ జరుగుతున్న తరుణంలో సభా ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశానికి అనుమతి లేదని, టీ, లంచ్ విరామ సమయాల్లో, సభ వాయిదా పడ్డ తర్వాత యధావిధిగా మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment