Telangana Assembly Sessions 2024 LIVE updates
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చ
సీఎం రేవంత్ రెడ్డి
- రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాడదు.
- వ్యవసాయం చేసుకునే వారికి సహాయం చేయడం రైతు బంధు లక్ష్యం.. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో లో చేర్చింది.
- రూ.22606 కోట్ల రూపాయల రైతు బంధు అనర్హులకు వేశారు
- రోడ్లు ,రాళ్లు ఉన్న భూములకు రైతు బంధు ఇచ్చారు.
- రాజీవ్ రహదారికి రైతు బంధు ఇచ్చారు
- క్రషర్లు నడుస్తున్న భూములకు , మైనింగ్ భూములకు రైతు బంధు ఇచ్చారు
- గిరిజన పోడు పట్టాలకు.. నకిలీ పట్టాలు తయారు చేసి రైతు బంధు పొందారు
- హైదరాబాద్ చుట్టూత రియల్‌ఎస్టేట్ జరుగుతుంది.. వాటికి రైతు బంధు ఇచ్చారు
- మేము ఇచ్చినట్లు గానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని కేటీఆర్ అంటుంన్నారు
- మీరు ఇచ్చినట్లు ఇస్తే..మేము ప్రతిపక్షంలో ఉంటాం..ఆ తర్వాత బయటకు వెల్లాల్సి వస్తుంది
- కేసీఆర్ చేసిస ఘనకార్యానికి ఆయన సభకు రాలేకపోతున్నారు
- గుట్టలు ,రోడ్డు ,రియలెస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా.. బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలి.
- మా ప్రభుత్వం సూచనలను తీసుకోవడానికి సిద్ధంగా ఉంది
- బీఆర్ఎస్ సభలో ఎంత చిల్లరగా వ్యవహరించినా ఓపికతో ఉన్నాం.
మంత్రి సీతక్క
- రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది
- రైతులు వరి వేస్తే ఉరి అన్నది మీరు
- ఇప్పుడు కౌలు రైతుల గురించి మీకు మాట్లాడే అర్హత ఉందా
- కౌలు రైతులకు రైతు బంధు ఎందుకు ఇవ్వాలని అన్నది మీరు కాదా?
- అద్దె ఇంట్లో ఉన్నవాళ్లు ఓనర్లు అవుతారా? అన్నది మీరు కాదా?
- ఈ రాష్ట్రంలో భూముల పై సమగ్ర సర్వే జరగాలి
- వందల ఎకరాల ఫౌంహౌజ్‌లు ఉన్నాయి
- రూ.5, రూ.6 లక్షల జీతాలు తీసుకునేవారు కూడా రైతుల ముసుగులో రైతు బంధు తీసుకున్నారు
- గుట్టలకు,రోడ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది
- నిజంగా వ్యవసాయం చేసే కౌలు రైతులకు రైతు బంధు రాలేదు
- బీఆర్ఎస్ ఇచ్చింది రైతు బంధు కాదు.. పట్టా పెట్టుబడి
- పట్టాలేని ఎంతో మంది రైతులకు రైతు బంధు రాలేదు
- బీఆర్ఎస్ చేసింది రుణమాఫీ కాదు..వడ్డీ మాఫీ
- బీఆర్ఎస్ అందరికీ రుణమాఫీ చేస్తే...ఇప్పుడు రూ.30 వేల కోట్ల రుణ భారం ఎందుకైంది
- భూమి లేని పేదలకు మీరు ఏమిచ్చారు
- ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే..బీఆర్ఎస్ ఓర్వలేకపోతుంది
- వందల ఎకరాల ఫౌంహౌస్‌లకు రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ అడుగుతుందా
- రైతు భరోసా ఎవరికి ఎంత పోతుంది.. అని అన్ని గ్రామాల్లో వివరాలు ఉంచాలి
మాజీ మంత్రి కేటీఆర్
- అదాని కోసం కొడంగల్ రైతులను అరెస్ట్ చేశారు
- రైతు రుణమాఫీ పూర్తి జరిగింది అంటున్నారు
- 60 శాతం అయ్యింది అని మరొకరు అంటున్నారు
- రైతు రుణమాఫీ ఎంత మేర జరిగిందో స్పష్టంగా చెప్పండి
- 25 శాతమా, 50 శాతమా మీకే స్పష్టత లేదు
- కోతలు పెడితే అది మీ ఇష్టం
- కౌలు రైతులకు ఇస్తారా లేదా క్లారిటీ ఇవ్వాలి
- రాష్ట్ర రైతాంగం కోసం చేయండి
- అదాని కోసం కొడంగల్ రైతులను జైల్లో పెట్టారు
- అనుముల కుటుంబం కోసం, బామర్ధి కోసం, అన్నదమ్ముల కోసం, అదాని కోసం చేయకండి
జూపల్లి కృష్ణారావు మంత్రి
- కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా
- కేటీఆర్‌తో పాటు రాజీనామా చేయడానికి నేను సిద్ధం
- మా జిల్లాకు నీళ్లు ఇవ్వలేదు
- గత ప్రభుత్వం అప్పులు చేసింది నిజం కాదా
- కేటీఆర్ నిజాలు మాట్లాడాలి
మాజీ మంత్రి కేటీఆర్
- మహబూబ్ నగర్ జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం
- జూపల్లి కృష్ణారావు అబద్ధాల గురించి మాట్లాడవద్దు...ఇదే సభలో కేసీఆర్‌ని పొడిగారు
జూపల్లి కృష్ణారావు మంత్రి
- కేటీఆర్ పదే పదే అబద్ధాలు చెప్తున్నారు
- అప్పులపై మాజీ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెప్తున్నారు
- 30 నిమిషాలు టైం ఇస్తున్నా రికార్డులు తీయాలని కోరుతున్నా
మాజీ మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా ఇవ్వలేదు
- రెండు పంటలది రైతు భరోసా ఇవ్వలేదు
- ఏడాది కాంగ్రెస్ పాలనలో రూ.17వేల బాకి పడ్డారు.
- రూ. 26వేల కోట్లు రైతులకు బాకీ పడ్డారు.
- రైతులకు ఉన్న బకాయిలను క్లియర్ చేసి...కొత్త రైతు భరోసా రైతులకు ఇవ్వాలి
- రుణమాఫీ రూ.40 వేల కోట్లు సిఎం రేవంత్ రెడ్డి అన్నారు...కేబినెట్‌లో రూ.31వేలు అయ్యింది. బడ్జెట్ కి వచ్చే సరికి రూ.26 వేల కోట్లయ్యింది
- రుణమాఫీ కాలేదు...కొండారెడ్డి, సిరిసిల్ల పోదామా?
- ఏ ఊరిలో అయినా రుణమాఫీ పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా
- ఎన్నికల హామీలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి
మాజీ మంత్రి కేటీఆర్
- మహబూబ్ నగర్ జిల్లాలో 30 ఎకరాలు ఉన్నా కూలీలుగా పనిచేశారు..అందుకే రైతు బందుపై సీలింగ్ పెట్టలేదు
- కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బందు కోతలు పెట్టొద్దు అని కోరుతున్నాం
- రైతు బందు ను కాఫీ కొట్టి కేంద్రం పీఎం కిసాన్ అని పెట్టింది
- ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం
- 1లక్షల 34వేల కోట్ల ధాన్యం కొనుగోలు పదేళ్ళలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది
- రైతులకు డబ్బులు పంచుతుంటే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు
- పోడు భూముల్లో ఒక పంట మాత్రమే పండుతుంది
- ఒక పంట పండుతుందని ఒకే సారి రైతుబందు ఇస్తామనడం కరెక్ట్ కాదు
- గిరిజనులకు రెండు పంట పండినా..పండకపోయినా రెండు సార్లు రైతు బందు ఇవ్వాలి
తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రి
- మేము రైతు భరోసా లో కటాప్ పెడతమని చెప్పలేదు
- సభ్యుల అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుంది
- బీఆర్ఎస్ ఇవ్వకుండా వదిలిపెట్టిన రైతు బంధును మా ప్రభుత్వం వచ్చాక వేశాం
మాజీ మంత్రి కేటీఆర్
- కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లాకు 2లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు.
- కేసీఆర్ పాలనలో వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉన్నది
- నల్గొండ జిల్లా ఇరిగేషన్‌పై చర్చ పెట్టాలని కోరుతున్నాం
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి
- బావ,బామ్మర్దికి నల్గొండ జిల్లాపై కోపం ఎందుకు?
- మాకు విషం ఇచ్చి చంపండి
మాజీ మంత్రి కేటీఆర్
- కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది మేమే అని డబ్బా కొట్టుకోవచ్చు. కానీ మేము చేసింది చెప్పొద్దా?
- 24 గంటల కరెంట్ వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు.
- సభ తరువాత బస్సులో నల్గొండకు వెళ్దాం
- ఇవ్వాళ 24 గంటల కరెంటు ఈ రోజు ఇస్తున్నట్లు రైతులు చెప్తే మా మొత్తం శాసన సభ్యులం రాజీనామా చేస్తాం
హరీష్‌రావు సవాల్‌ను స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- నల్గొండ జిల్లా సూర్యాపేటకు వెళ్దాం
- నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది ఎవరు?
మాజీ మంత్రి హరీష్ రావు
- రాష్ట్రంలో రైతు బందుపై ప్రజలు గమనిస్తున్నారు.
- కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు మంత్రులు వరుసగా ఇంట్రాప్ చేస్తున్నారు
- మిషన్ భగీరథలో రూ.50వేలు తిన్నట్లు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
- మిషన్ భగీరథకు పెట్టిన ఖర్చే రూ. 25వేల ఖర్చు
- సభ తరువాత కోమటి రెడ్డి వస్తే నేరుగా నల్గొండకు వెళ్దాం
- నల్గొండ జిల్లాలో 2లక్షల ఎకరాలు, మెడికల్ కాలేజీలు ఇచ్చాం
- కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర మంత్రి
- కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు ఇవ్వలేదు
- 24గంటల కరెంట్ ఇవ్వలేదని లాగ్ బుక్స్ తెచ్చి చూపిస్తా
- ఎక్సైజ్ టెండర్లు ఒక ఏడాది ముందు పెట్టారు.. రూ.2 వేల కోట్లు ముందుగా వసూలు చేశారు
- కేటీఆర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.
- గత ప్రభుత్వం లో కేవలం 14 గంటల కరెంటు మాత్రమే ఇచ్చారు
- నేను సబ్ స్టేషన్ వెళ్లి చెక్ చేశాను
- నేను ఎమ్మెల్యే, ఎంపీగా గత పదేళ్లుగా పని చేశాను.
- కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు ఇవ్వలేదు.
- ఎక్సైజ్ టెండర్లు 2లక్షలు పెట్టీ...2వేల కోట్లు వసూళ్లు చేశారు... ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో తెలీదు.
- కాళేశ్వరం నీళ్లు నల్గొండ జిల్లా ఒక్క ఎకరానికి నీళ్లు ఇస్తే రాజీనామా చేస్తా
- తెలంగాణ వచ్చాక నష్టపోయిన జిల్లా నల్గొండ
- తెలంగాణ వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు కేసీఆర్...మాట తప్పారు
- పదేళ్ల కేసీఆర్ పాలన..వందేళ్లు వెనక్కి తీసుకెళ్ళారు
- కూలిపోయే ప్రాజెక్టులు మాత్రమే కట్టారు
- ఇంటింటికి నీళ్లు ఇయ్యకపోతే ఓట్లు అడుగా అన్నావ్
- సిరిసిల్లకు పోదాం ఏ ఇంటికి నీళ్లు వస్తున్నాయో తెలుస్తుంది
- హరీష్ రావు ఒక ఎమ్మెల్యే...ఆయన డిప్యూటీ లీడర్ కాదు
- హరీష్ రావుకు మైక్ ఇవ్వొద్దు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏక వచనంతో సంబోధించవద్దని కేటీఆర్‌కి సూచన
మాజీ మంత్రి కేటీఆర్
- గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి.. కెసిఅర్ పట్ల గౌరవంగా మాట్లాడితే మేం గౌరవం ఇస్తాం
- వ్యవసాయ స్థిరీకరణ కోసమే రైతు బంధు ఇచ్చాం
- 24 గంటలకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చాం
- రైతుల ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నా
- సద్విమర్శగానే చూడాలని కోరుతున్నా
- రైతు బంధు పథకంలో 21 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యిందని మంత్రి అంటున్నారు
- రైతు బంధు ఇవ్వడం వల్లే సాగు విస్తీర్ణం పెరిగింది
- నాలుగున్నర లక్షల మంది గిరిజన రైతులకు పొడు భూములకు ROFR కింద పట్టాలు ఇచ్చాం
- పోడు భూముల్లో రెండో పంటకు రైతు బంధు ఇవ్వరా ?
- కంది, పత్తి పంటలు 8 నెలల పంట.. రెండో పంట పండించలేరు. వాటికి రెండో పంట రైతు బంధు ఇస్తారా ? ఇవ్వరా ?
తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రి
- గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు వివరాలను మాత్రమే ఇచ్చాం
- రైతు బంధు పై అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం
- రెండో పంట పండించకపోతే రైతు కు రైతు బంధు ఇవ్వాలో ? వద్దో? మీరే చెప్పండి
- రైతు భరోసా పై మేం ఇంకా ఏమి చెప్పలేదు
మాజీ మంత్రి కేటీఆర్
- రైతు బంధు రెండో పంట పండించకపోతే ఇస్తారో.. ఇవ్వరో చెప్పకపోతే ఈచర్చ ఎందుకు ?
- మూడో పంట కూడా వేయడానికి రైతులు సిద్దంగా ఉన్నారు
- వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మూడో పంట కూరగాయలు వేస్తారు
- మూడో పంటకు రైతు భరోసా ఇస్తారా ?
- రైతు ఆత్మహత్యలు సాధ్యమైనంత వరకు తగ్గించాం
ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్
- రైతు భరోసా పై సూచనలు, సలహాలు ఇవ్వండి
- కావాలని రైతులకు లేనిపోని అనుమానాలు కల్పిస్తున్నారు
- తెలంగాణ రాకముందు అంశాలు ఇప్పుడు ఎందుకు ?
- తెలంగాణకు అన్యాయం జరిగినందుకే రాష్ట్రం తెచ్చుకున్నాం
రైతుబంధుపై సమగ్రంగా చర్చ జరగాలి : కేటీఆర్
- మంత్రి తుమ్మల మాకు ఆత్మీయ మిత్రుడు
- రైతుబంధులోనే సాగు విస్తీర్ణం పెరిగింది
- రైతుబంధుపై తుమ్మల సావధాన సమాధానం చెప్పాలి
- రైతుబంధుపై సమగ్రంగా చర్చ జరగాలి
- ఉన్నది ఉన్నట్లు ఇస్తామంటే.. రైతుభరోసాపై చర్చ ఎందుకు
- సాగు చేస్తేనే రైతుభరోసా ఇస్తామంటే.. రైతులు అని పంటలు వేస్తామంటారు
- రైతుబంధు ఇవ్వడం వల్లే 2కోట్ల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది
- 11.5శాతం ఉన్న రైతుల ఆత్మహత్యలను 1.5 శాతానికి తగ్గించాం
రైతుభరోసాపై ఏ నిర్ణయం తీసుకోలేదు : మంత్రి తుమ్మల
- ఏ పంటకు ఎలా ఇవ్వాలో.. బీఆర్‌ఎస్ సూచనలు ఇస్తే తీసుకొని.. అమలు చేస్తాం
- రైతుభరోసాపై ప్రభుత్వం ఏ నిర్ణయం ప్రకటించలేదు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టింది
- గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టింది
- సీఎం రేవంత్‌రెడ్డి అంటే రైతులకు నమ్మకం
- రైతులను కన్ఫ్యూజ్ చేసి.. ఇబ్బంది పెట్టారు
- కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కలసి రైతులను తీవ్రంగా ఇబ్బందికి గురి చేశాయి.. అసెంబ్లీలో కాంగ్రెస్
మంత్రి తుమ్మల
ధరణి పోర్టల్ ఆధారంగా గతంలో రైతుబంధు ఇచ్చారు
రైతు బంధులో 21 వేల కోట్ల రూపాయల దుర్వినియోగం
హరీష్ రావును ఉద్దేశించి స్పీకర్ సభ
- ఎప్పుడు పెద్దగా లేట్ కాలే !
- ఈరోజు జీరో వరకు తీసుకోవాలనే అంశం మీద చర్చ జరిగింది
- అందుకే కొద్దిగా ఆలస్యమైంది
హరీష్ రావు
- అసెంబ్లీ పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కావడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన బీఆర్ఎస్
- సభ సమయపాలన పాటించాలి
- ప్రతిరోజు ఆలస్యంగా ప్రారంభమవుతుంది
- అందరికి ఆదర్శంగా మనం ఉండాలి సభ ఇలా ఆలస్యంగా జరుగుతే ఎలా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం
నేడు సభ ఆఖరి రోజు
హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పన .. అభివృద్ధిలో ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం
మహిళలకు రూ.2500 ఆర్దిక సహాయం, కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్‌లు, కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని దీనిపై శాసనసభలో చర్చకు బీజేపీ వాయిదా తీర్మానం
కాంటాక్ట్ ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీల ద్వారా కాకుండా కార్పోరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలని సీపీఐ వాయిదా తీర్మానం
వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగియాల్సి ఉండగా.. ఈ సమావేశాలను ఒకరోజు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నిన్న భూ భారతి, రైతు భరోసా వంటి అంశాలపై స్వల్ప కాలిక చర్చ జరగాల్సి ఉంది. అయితే సభ్యుల ఆందోళన ఫలితంగా నిన్న భూభారతి చర్చ వరకే పరిమితమయింది.
Comments
Please login to add a commentAdd a comment