తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా | Telangana Assembly Budget Session 2024 Today Live Updates - Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

Published Mon, Feb 12 2024 10:07 AM | Last Updated on Mon, Feb 12 2024 4:20 PM

Telangana Assembly Budget Session Today Live Updates - Sakshi

Telangana Assembly Budget Session.. అప్‌డేట్స్‌..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు 

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

కేసీఆర్‌ తెలంగాణకు తీరని నష్టం చేశారు: ఉత్తమ్‌

  • పదేళ్లలో ఇరిగేషన్‌ శాఖను సర్వనాశనం చేశారు
  • రేపు కాళేశ్వరం సందర్శనకు అందరినీ ఆహ్వానిస్తున్నాం

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్‌ చిట్‌చాట్‌

  • ఉత్తమ్‌ పవర్‌ ప్రజెంటేషన్‌ మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉంది.
  • ఉత్తమ్‌ తెలుగులో మాట్లాడకుండా.. ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు
  • ఉత్తమ్‌ మాటలు మాకేం అర్థం కావడం లేదు.. ప్రజలకు ఏం అర్థమవుతుంది.

ఆనాడు పదవులు కోసం పెదవులు మూసుకుంది: హరీష్‌రావు

  • ప్రాజెక్టులు అప్పగిస్తామని కేంద్రానికి చెప్పి వచ్చి ఇక్కడ తంటాడు పడుతున్నారు
  • పోతిరెడ్డిపాడుపై పేగులు తెగేదాకి కొట్లాడింది మే​ం
  • అపోహలు సృష్టించి సభను తప్పుదోవ పట్టించొద్దు

రాష్ట్రానికి కృష్ణా జలాల కంటే ఎక్కువ మరేముంది: మల్లు భట్టి విక్రమార్క

  • కృష్ణా జలాల విషయంలో బీఆర్‌ఎస్‌సర్కార్‌ అనేక తప్పులు చేసింది
  • గత సర్కారు తప్పులను సరిచేయడానికి ఉత్తమ్‌ నానా తంటాలు పడుతున్నారు
     

కేసీఆర్‌పై రేవంత్‌ సీరియస్‌

  • కేసీఆర్‌ సభకు రావాలి.
  • పదేళ్ల పాలనలో జరిగిన పాపాలకు కేసీఆరే కారణం.
  • బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడే మాటలకు  విలువ లేదు.
  • కేసీఆర్‌ సభకు వస్తే ఎంతసేపైనా చర్చిస్తాం.
  • కృష్ణా జలాలపై చర్చకు కేసీఆర్‌ ఎందుకు రాలేదు?.
  • కేసీఆర్‌ సభ రాకుండా ఫాంహౌస్‌లో దాక్కున్నారు. 
  • తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ అవమానిస్తున్నారు. 
  • పద్మారావు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. 
  • పద్మారావును ప్రతిపక్ష నేతను చేయాలి. 


హరీష్‌ కామెంట్స్‌..

  • కాంగ్రెస్‌ ప్రాజెక్ట్‌లను అప్పగించేందుకు ఒప్పుకుంది. 
  • సీఎం రేవంత్‌ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. 
  • రేవంత్‌ కొడంగల్‌లో ఓడిపోయి మల్కాజ్‌గిరికి ఎందుకొచ్చారు?.
  • వాస్తవాలు చెప్తుంటే కాంగ్రెస్‌కు మింగుడుపడటం లేదు. 
  • అధికారులను బద్నాం చేసుకుంటూ ఎన్ని రోజులు తప్పించుకుంటారు. 

►తెలంగాణ శాసన మండలి ఈనెల 14కు వాయిదా

ఉత్తమ్‌ కామెంట్స్‌..

  • అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌ అబద్దాలు చెబుతోంది. 
  • ప్రాజెక్ట్‌లు అప్పజెప్పడంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
  • హరీష్‌రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. 
     

మంత్రి కోమటిరెడ్డి వర్సెస్‌ హరీష్‌ రావు
కోమటిరెడ్డి కామెంట్స్‌..

  • దక్షిణ తెలంగాణను నాశనం చేశారు.
  • నల్లగొండవాసులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది.
  • నల్లగొండ ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి. 
  • క్షమాపణ చెప్పి కేసీఆర్ నల్లగొండకు రావాలి.  


హరీష్‌రావు కామెంట్స్‌..

  • నల్లగొండలో సభ పెట్టినందునే ప్రభుత్వం తీర్మానం పెట్టింది. 
  • ఇది బీఆర్‌ఎస్‌ విజయం 
  • మాకు ప్రజెంటేషన్‌ అవకాశం ఎందుకు ఇవ్వలేదు. 
  • కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్‌ రావు అభ్యంతరం
  • కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. 
  • కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్‌

శాసనసభలో కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌..

  • రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాడు విఫలమైంది. 
  • కృష్ణా జలాలు తెలంగాణకు ప్రధాన ఆధారం. 
  • సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా కృష్ణా జలాలు తరలించే ప్రసక్తే లేదు. 
  • కృష్ణా ప్రాజెక్ట్‌లను కేంద్రానికి అప్పజెప్పే ప్రసక్తే లేదు.
  • వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం. 
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది. 
  • నదీ జలాల పంపకాల్లో అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం. 
  • తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని అందరూ ఆశించారు. 
  • కానీ, బీఆర్‌ఎస్‌ వచ్చాన కృష్ణా జలాల్లో మరింత అన్యాయం జరిగింది. 
  • ఉమ్మడి రాష్ట్రం కంటే.. ప్రత్యేక రాష్ట్రంలోనే ఎక్కువ అన్యాయం జరిగింది.
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 1200 టీఎంసీలు డైవర్ట్‌ అయ్యాయి. 

  • ఇన్‌ ఫ్లో తగ్గింది.. డైవర్షన్‌ పెరిగింది. 
  • కృష్ణా జలాలపై గత ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదు. 
  • ఏపీ ప్రభుత్వం అదనపు నీటని తరలిస్తున్నా మౌనంగా ఉన్నారు. 
  • పాలమూరు-రంగారెడ్డికి రూ.27500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. 
  • 811 టీఎంసీల్లో కేవలం 299 టీంసీలే క్లేయిమ్‌ చేశారు.
  • ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 50 శాతం కావాలని మాట్లాడుతున్నారు.  
  • అంతా చేసి నల్లగొండలో సభ పెడితే  ఏం లాభం. 

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ సీరియస్‌

  • కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. 
  • ప్రధాన చర్చ మిగులు గోదావరి జలాలపై.. కృష్ణా జలాలపై కాదు. 
  • ఏపీ సీఎం జగన్‌ కృష్ణా జలాలపై మాట్లాడలేదు.. గోదావరి జలాలపై మాట్లాడారు. 
  • దీన్ని కాంగ్రెస్‌ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంచేస్తోంది. 

కోమటిరెడ్డి రాజగోపాల్‌ షాకింగ్‌ కామెంట్స్‌

  • కేసీఆర్‌ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించాలి. 
  • కేఆర్‌ఎంబీపై సంతకం పెట్టి కేంద్రానికి అప్పగించింది కేసీఆరే. 
  • రాజకీయాల నుంచి కేసీఆర్‌ రిటైర్మెంట్‌ తీసుకోవాలి. 
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆగం చేసిన రాష్ట్రాన్ని మేము గాడిలో పెడుతున్నాం. 
  • నల్లగొండ జిల్లాకు కేసీఆర్‌, జగదీష్‌ రెడ్డి తీరని అన్యాయం చేశారు. 
     

తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీవేడీ చర్చ

  • కృష్ణా జలాలు, కాళేశ్వరంపై ప్రభుత్వం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌..
  • అసెంబ్లీలో రెండు ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు.
  • సభలో సభ్యులకు ప్రజెంటేషన్‌ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్‌
  • అయితే, సభలో తమకూ ప్రజెంటేషన్‌ అవకాశం ఇవ్వాలన్న బీఆర్‌ఎస్‌
  • బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తిని తిరస్కరించిన స్పీకర్‌ 
  • ఇక, ప్రజెంటేషన్‌ కాపీలను ఎమ్మెల్యేలకు ఇవ్వనున్నారు. 

►చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

►విద్యుత్‌, ఫారెస్ట్‌ కార్పొరేషన్‌ వార్షిక రిపోర్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. 

►అలాగే, దివంగత నేతలు మచిందర్‌ రావు, నర్సారెడ్డి, రాజమల్లుకు సంతాపం తెలపనుంది. 

►బడ్జెట్‌పైచర్చ-సమాధానం ఇవ్వనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.

►అలాగే ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. 

►మేడిగడ్డపై విజిలెన్స్‌ రిపోర్టుపై సభలో ప్రకటన చేయనుంది. 

►ఇక, టొబాకో అండ్‌ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. 

►2023-24 సప్లిమెంటరీ ఎస్టిమేట్స్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండేచర్‌పై ప్రకటన

►మరోవైపు కృష్ణా జలాలపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మద్య మాటల యుద్ధం నడుస్తోంది. 

►కృష్ణా జలాలు, కాళేశ్వరంపై ప్రభుత్వం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement