Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YS jagan Slams TDP Governance In A Tweet
ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోంది: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అడుగడుగునా భయంతో సీఎం చంద్రబాబు విలవిలలాడిపోతున్నాడని మండిపడ్డారు. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ప్రజల్లో భయాన్ని నింపడానికి హింసాఖాండ సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.రాష్ట్రంలో అరాచక పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని..అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందన్నారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించే రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితి తీసుకొస్తున్నారని విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండేదని చెప్పారు.ఈ మేరకు ఎక్స్‌లో వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. ‘కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోంది. ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది అంటే.. ఈ ఏడాది, అంటే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్‌ కూడా ప్రవేశపెట్టలేక పోతోంది. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌ మీదే నడుస్తోంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుంది. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తూ, మభ్య పెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితి ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నాడంటే.. పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే, ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుందన్న “భయం’’,.ఎన్నికల్లో చేసిన మోసపూరిత హామీలు, అమలు చేయని పరిస్థితిలో.., ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న ‘‘భయం’’. అందుకే ప్రజల దృష్టిని మళ్లించే రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితి తీసుకొస్తున్నారు.హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం.. వీటన్నింటి ద్వారా ఎవరూ ప్రశ్నించే సాహసం చేయకూడదు అన్న పరిస్థితి సృష్టిస్తున్నారు.ప్రస్తుత అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి. ఒకటి అధికార పక్షం. మరొకటి ప్రతిపక్షం. ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉంది. కాబట్టి, ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలి. ఆ పార్టీ నాయకుడినే, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి!. కానీ, ఆ పని చేస్తే.. అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం. ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతను గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అసెంబ్లీలో హక్కుగా మైక్‌ ఇస్తే, ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్షనేత ఎండగడతారని, ఆ విధంగా వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతో.. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదు.ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్నా, చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నాడు. అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా, చంద్రబాబునాయుడి పాపాలు కూడా పండే రోజు వేగంగా దగ్గర్లోనే ఉంది. నాతో మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు ఢిల్లీకి వెళ్తున్నాం.రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని.. 24వ తేదీన, అక్కడ ఫోటో గ్యాలరీ.. ప్రొటెస్ట్‌ ద్వారా దేశం దృష్టికి, వివిధ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లి, ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరాన్ని, పరిస్థితులను చెప్పబోతున్నాం. ఈ కార్యక్రమంతో, మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం కొనసాగిస్తాం.కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోంది. ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది అంటే.. ఈ ఏడాది, అంటే 12 నెలల కాలానికి…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2024

Sakshi Editorial On Joe Biden departure in USA Politics
మలుపు తిప్పిన నిష్క్రమణ

అందరూ అనుమానిస్తున్నట్టే జరిగింది. చెప్పాలంటే అనివార్యమైనదే అయింది. మరో నాలుగు నెలల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉన్నాయనగా రెండోసారి ఆ పదవికి ఎన్నికయ్యేందుకు చేస్తున్న ప్రచారం నుంచి డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్‌ పక్కకు తప్పుకున్నారు. వైట్‌హౌస్‌ పీఠానికి రేసు నుంచి వైదొలగుతున్నట్టు ఆదివారం ఆయన ఆకస్మికంగా చేసిన ప్రకటన ఒక విధంగా సంచలనమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థి ఇలా అర్ధంతరంగా బరిలో నుంచి వైదొలగిన ఘటన మునుపెన్నడూ జరగనిదే. అలాగని కొద్ది వారాలుగా అమెరికాలో జరుగుతున్న పరిణామాల రీత్యా బైడెన్‌ ప్రకటన మరీ అనూహ్యమేమీ కాదు. ఎన్నికల్లో పోటీ పడకున్నా, పదవీకాలం పూర్తయ్యే వరకు దేశాధ్యక్షుడిగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రకటించిన ఆయన తన స్థానంలో పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్‌ పేరు ప్రస్తావించడం, ఆమె అభ్యర్థిత్వాన్ని తోటి డెమోక్రాట్లు బలపరుస్తుండడంతో అమెరికా ఎన్నికల కథ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇటీవలే ప్రత్యర్థి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్న ఘటనతో అన్నీ ప్రతికూలంగా కనిపిస్తున్న వేళ డెమోక్రాటిక్‌ పార్టీకి ఇది కొత్త ఊపిరి పోస్తోంది. మళ్ళీ ఆశలు చిగురింపజేస్తోంది. ఇరవై తొమ్మిదేళ్ళ వయసులో జో బైడెన్‌ జాతీయస్థాయి రాజకీయ జీవితం ప్రారంభించారు. రిపబ్లికన్‌ సెనెటర్‌ను ఓడించడం ద్వారా 1972లో ఆయన కెరీర్‌ మొదలైంది. సరిగ్గా 52 ఏళ్ళ తర్వాత అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద వయసు అధ్యక్షుడైన ఆయన యుద్ధం చేయకుండానే అస్త్రసన్యాసం చేయాల్సి వచ్చింది. నెలన్నర క్రితం కూడా బరిలో నుంచి తప్పుకొనేది లేదని బల్లగుద్ది చెప్పిన బైడెన్‌ ఇప్పుడిలాంటి నిర్ణయం తీసుకున్నారంటే... ఒక రకంగా అది ఆయన స్వయంకృతం. మరోరకంగా క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల పెరిగిన అవగాహన అని చెప్పక తప్పదు. ఆయనలో ఈ ప్రాప్తకాలజ్ఞతకు చాలా కారణాలే దోహదపడ్డాయి. ట్రంప్‌తో తొలి చర్చలోనే తడబడడం దగ్గర నుంచి నడకలో, నడతలో, మాటలో మార్పు తెచ్చిన వయోభారం, అభ్యర్థిని మార్చాలంటూ సొంత పార్టీ వారి నుంచే కొంతకాలంగా పెరుగుతున్న ఒత్తిడి వరకు ఇలా అనేకం అందులో ఉన్నాయి. అలాగే, ఆరునూరైనా సరే ముందనుకున్నదే చేసి తీరాలన్న మంకుపట్టు కన్నా రాజకీయాల్లో పట్టువిడుపులు ముఖ్యమనీ, కళ్ళెదుటి వాస్తవాలను బట్టి విజయం కోసం ఆట తీరు మార్చడం కీలకమనీ డెమోక్రాటిక్‌ పార్టీ అర్థం చేసుకుంది. అందుకే, బైడెన్‌ పోటీ ఉపసంహరణ నిర్ణయం తీసుకుంది. దీన్ని స్వాగతించాల్సిందే తప్ప తప్పుబట్టడానికి లేదు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పదవికి డెమోక్రాటిక్‌ అభ్యర్థిగా బరిలో దిగేందుకు 59 ఏళ్ళ కమలా హ్యారిస్‌ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నారు. భారతీయ మూలాలున్న ఈ లాయర్‌ మొదట అటార్నీ జనరల్‌గా ఎదిగి, ఆ పైన సెనెటరయ్యారు. నిజానికి, అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ, తొలి నల్లజాతి అమెరికన్, తొలి దక్షిణాసియా అమెరికన్‌ ఆమే! ఉపాధ్యక్షు రాలిగా ఆమె అద్భుతాలు చేయకపోయినా, చిందరవందరైన డెమోక్రాటిక్‌ పార్టీని మళ్ళీ చక్కదిద్ది గాడిన పెట్టగలరని ఆశ. ఇప్పుడు ఆమె ముందున్న అసలు సవాలదే. ఆమెను అభ్యర్థిగా ప్రకటించడానికి డెమోక్రాట్లు జాగు చేయకపోవచ్చు. అదే జరిగాక... ఎంతైనా స్త్రీ అనీ, ఆమె జాతి ఫలానా అనీ ప్రత్యర్థి ట్రంప్‌ బృందం ప్రచార దాడులు ప్రారంభించడం ఖాయం. అయితే, గతంలో ఇలానే బరాక్‌ ఒబామాపై ప్రచారాలు సాగినా, అవేవీ ఓటర్లు పట్టించుకోలేదు. అధ్యక్షుడిగా ఆయన రెండు సార్లు గెలిచారన్నది గమనార్హం. ధాటిగా మాట్లాడుతూ, ప్రచారం చేసే సత్తా ఉన్న కమల ఎన్నికల్లో అద్భుతం చేసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ట్రంప్‌కు అడ్డుకట్ట వేయలేకున్నా, కనీసం ఆయన తలతిక్క నిర్ణయాలు తీసుకొనే వీలు లేని రీతిలో అమెరికన్‌ కాంగ్రెస్‌ ఎన్నికయ్యేలా చేయగలరని విశ్లేషణ. పునర్వైభవం కోసం డెమోక్రాట్లు అంతా ఏకమవుతున్న వేళ సొంత నియోజకవర్గమంటూ లేని కమల ముందుగా భాగస్వాముల్ని, సమర్థకుల్ని, సహాయకుల్ని, అనుభవజ్ఞులూ – ప్రతిభావంతులైన బృందాన్నీ సమకూర్చుకోవాలి. కీలక రాష్ట్రాల్లో వారే ఆమెకు అండ. నిజానికి, పరిస్థితులు చూస్తుంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని నాయకత్వ కొరత పీడిస్తున్నట్టుంది. ఇటు డెమోక్రాట్లు, అటు రిపబ్లికన్లు – ఇరు పక్షాల్లోనూ ప్రజాదరణతో పాటు నేర్పు, ఓర్పున్న సమర్థులైన నాయకులెవరూ కనిపించడం లేదు. ఎవరూ రెండుసార్లకు మించి దేశాధ్యక్ష పదవిని చేపట్టరాదన్న అమెరికా రాజ్యాంగం ఒబామా లాంటి వారి పునఃప్రతిష్ఠకు అడ్డంకిగా మారింది. అది లోటే అయినా, ఆ నిబంధనలోని విస్తృత ప్రజాస్వామ్యస్ఫూర్తి, దూరాలోచన అర్థం చేసుకోదగినవే. అనుభవం లేనంత మాత్రాన అధ్యక్షబాధ్యతల్లో విఫలమవుతారనీ లేదు. మునుపటి అధ్యక్షులు చాలామంది అందుకు ఉదాహరణ. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఏ కొత్త బాధ్యతా కష్టం కాదు. పైగా, ట్రంప్‌కు మళ్ళీ పట్టం కట్టడానికి సుతరామూ ఇష్టం లేని అమెరికన్లకు ఇప్పుడు కమల మినహా ప్రత్యామ్నాయం లేదు. అదీ ఆమెకు కలిసిరావచ్చు. అయితే, హత్యాయత్నం తర్వాత పిడికిలి పైకెత్తి, పోరాటానికి నినదించి హీరో స్థాయికి పెరిగిన ట్రంప్‌ ప్రాచుర్యాన్ని తక్కువగా అంచనా వేయలేం. యువ ఓటర్లను ఆకర్షించడం కోసం ఉపాధ్యక్ష పదవికి 39 ఏళ్ళ జె.డి. వాన్స్‌ను ఎంపిక చేసుకొని ట్రంప్‌ మంచి ఎత్తుగడే వేశారు. మొత్తానికి, రోజులు గడుస్తున్నకొద్దీ అమెరికా ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే, అయిపోయిందనుకున్న ఆట అసలు ఇప్పుడే మొదలైంది!

Sakshi Guest Column On Union Budget 2024 Expectations
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం కావాలి!

దేశీయ ఆర్థిక వ్యవస్థ 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉండొచ్చు; అయితే బయటి ఎదురుగాలులు ఈ వృద్ధిని దెబ్బ తీయొచ్చు. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమాన స్థాయిలో మద్దతునిస్తూ, మౌలిక సదుపాయాలు, సేవల వంటి కీలక రంగాలను బలోపేతం చేయడంపై బడ్జెట్‌ దృష్టి పెట్టాలి. ప్రైవేట్‌ పెట్టుబడులకు సులభతర వాతావరణాన్ని సృష్టించే దిశగా కూడా ముందుకు సాగాలి. ఐఐటీలు, ఐఐఎమ్‌ల వంటి అద్భుతమైన ఉన్నత విద్యా సంస్థలతో కూడిన దేశంలో ప్రాథమిక, మాధ్యమిక విద్య దుర్భర స్థితిలో ఉంది. సమాజంలోని అన్ని వర్గాలూ ప్రయోజనాలను పొందేలా చూసుకోవాలి. భారీస్థాయిలోని మన యువ జనాభా శ్రామికశక్తిలోకి ప్రవేశించడానికి సన్నద్ధం అయ్యేలా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలి.భౌగోళిక రాజకీయ రంగంలో కొనసాగు తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రంలోని కొత్త ప్రభుత్వం తన మొదటి బడ్జెట్‌ను సిద్ధం చేస్తోంది. రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌–హమాస్‌ వివాదం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. దేశీయ ఆర్థిక వ్యవస్థ దాదాపు 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉండవచ్చు. అయితే బాహ్య వాతా వరణపు స్థిరత్వాన్ని బట్టి ఇది మారవచ్చు. ప్రపంచ చమురు ధరలు తగ్గింపు స్థితిలోనే ఉంటాయనీ, ఎగుమతి వృద్ధిని ప్రభావితం చేసిన మాంద్యం పోకడల నుండి పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలు బయటపడ తాయనీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆశిస్తూ ఉండ వచ్చు. అంతర్జాతీయ సముద్ర మార్గాలను కలహాలు లేకుండా ఉంచడం కూడా వచ్చే పోయే వాణిజ్య ఖర్చులలో అనవసరమైన పెరుగుదలను నివారించడంలో కీలకం. స్పష్టంగా, బయటి ఎదురు గాలులు భారతదేశ వృద్ధి కథనాన్ని చెడగొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల, వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమాన స్థాయిలో మద్దతునిస్తూ, మౌలిక సదుపాయాలు, సేవల వంటి కీలక రంగాలను బలోపేతం చేయడంపై బడ్జెట్‌ దృష్టి పెట్టడం అవసరం.మౌలిక వసతుల రంగంలో, గత కొన్నేళ్లుగా నమోదైన మూలధన వ్యయంలో విపరీతమైన పెరుగుదలను విధాన రూపకర్తలు కొన సాగించడం మంచిది. 2024–25 మధ్యంతర బడ్జెట్‌ మూలధన వ్యయంలో అంతకుముందు నమోదైన 30 శాతం పెరుగుదలను సుమారు 16.9 శాతానికి తగ్గించింది. దేశంలోని విస్తారమైన మౌలిక సదుపాయాల అంతరం కారణంగా మూలధన వ్యయంలో అధిక పెరుగుదల అవసరం. ఇది భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను వెంటనే సృష్టించలేకపోయినా, ఉపాధి కల్పనపై నిస్సందేహంగా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ. 2.11 లక్షల కోట్లను బదిలీ చేసిన వాస్తవం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ దిశలో కొనసాగడానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.ప్రభుత్వ రంగం కంటే వెనుకబడిన ప్రైవేట్‌ పెట్టుబడులకు సులభతర వాతావరణాన్ని సృష్టించే దిశగా కూడా బడ్జెట్‌ ముందుకు సాగాలి. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలు వంటి అమలులో ఉన్న విధానాలు తయారీకి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఈ విధానాలను మరింత క్రమబద్ధీకరించాలి. 1991 ఆర్థిక సంస్కరణల కాలం నుండి నియంత్రణ వాతావరణం కచ్చితంగా చాలా ప్రగతి సాధించింది. కానీ గతంతో పోల్చడం అసందర్భం అవుతుంది. ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో ఇప్పుడు పోల్చుకోవలసి ఉంది. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు సరళమైన, సులభ మైన పెట్టుబడి విధానాలను అందిస్తున్నాయి. బహుళజాతి సంస్థలు అక్కడ స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి ఇది ఒక ఆకర్షణ. దీనికి విరుద్ధంగా భారతదేశం అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు.దేశీయ పెట్టుబడిదారులు అధిక మూలధనం, లాజిస్టిక్స్‌ ఖర్చు లతో పోరాడవలసి ఉంటుంది. అయినప్పటికీ, కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు సమృద్ధిగా లభించకపోవడం అనేది దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాన అడ్డంకిగా మిగిలిపోయింది. ఈ సమస్యలు ఇప్పుడు ఎక్కువగా రాష్ట్రాలు లేదా స్థానిక మునిసిపాలిటీల స్థాయిలో ఉన్నాయి. సులభతరమైన వ్యాపారాన్ని ఈ స్థాయికి తీసుకురావడం తదుపరి తరం సంస్కరణల్లో భాగం కావాలి.మరో తరం సంస్కరణలు అవసరంఫిబ్రవరిలో 2024–25 మధ్యంతర బడ్జెట్‌తో విడుదల చేసిన ఆర్థిక ప్రకటనలో ఇది ఇప్పటికే పరిగణించబడుతుందనే సూచన కనిపిస్తోంది. ఇది మండలం, జిల్లా, గ్రామ స్థాయిలలో పాలనను మెరుగుపరచడం గురించి ప్రస్తావించింది. వృద్ధి, అభివృద్ధి ఆధారిత సంస్కరణల కోసం రాష్ట్రాలకు 75,000 కోట్ల రూపాయల రుణాన్ని కూడా అందించారు. ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, భూసేకరణ వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించడమైనది.సంస్కరణలు చేపట్టేందుకు రుణాలు అందుబాటులో ఉన్నప్ప టికీ, అన్ని రాష్ట్రాలు సహకరించకపోవడమే ఈ ప్రణాళికలోని ఏకైక చిక్కు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకు కట్టు బడి ఉండాల్సి ఉంటుంది, కానీ ఇతర రాష్ట్రాల నుంచి అదే స్పందన రాకపోవచ్చు. అందుకే తదుపరి తరం సంస్కరణలను ప్రారంభించే లక్ష్యం పాక్షికంగా మాత్రమే విజయవంతమవుతుంది. అదే సమయంలో, ముఖ్యంగా దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాలు, ఇప్పటికే నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఇన్వెస్టర్లు వారికి అండగా నిలుస్తున్నారు. ఉదాహరణకు, ఆపిల్, మైక్రోసాఫ్ట్‌ వంటి టెక్‌ దిగ్గజాలు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసుకొంటున్నాయి. ఈ రాష్ట్రాలు అవలంబించిన విధానాలను అధ్యయనం చేయాలి. ఇతర రాష్ట్రాల్లోనూ వీటిని పునరావృతం చేయాలి.ఈ సందర్భంలో, విద్య, నైపుణ్యాలకు చెందిన క్లిష్టమైన విభాగా నికి బడ్జెట్‌ కేటాయింపులు అవసరం. ప్రభుత్వ ఎజెండాలో ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉండాల్సి ఉండగా, అనేక రంగాలు నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయన్నది వాస్తవం. విద్య రకం, పరిశ్రమకు అవసరమైన నిర్దిష్ట నైపుణ్యాల మధ్య అసమతుల్యత కూడా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి దీర్ఘకాలిక విధాన చికిత్సలను రూపొందించాలి. అయితే స్వల్పకాలంలో, రాబోయే బడ్జెట్‌లో నైపుణ్యం కలిగిన సంస్థలకు తగిన కేటాయింపులను అందించవచ్చు.అదనంగా, విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఐఐటీలు, ఐఐఎమ్‌ల వంటి అద్భుతమైన ఉన్నత విద్యా సంస్థలతో కూడిన దేశం ఇది. కానీ ప్రాథమిక, మాధ్యమిక విద్య దుర్భరమైన స్థితిలో ఉంది. ఇక్కడ కూడా, మన భారీస్థాయిలోని యువ జనాభా శ్రామికశక్తిలోకి ప్రవేశించడానికి బాగా సన్నద్ధం అయ్యేలా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలి.జీడీపీ, ఉపాధి కల్పనలకు సహకారం అందిస్తున్నందున ప్రయాణం, పర్యాటకం వంటి సేవలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా మరింత మద్దతు ఇవ్వాలి. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికీ, మెరుగైన ఆర్థిక ఎంపికలు అందుబాటులోకి రావడానికీ హోటళ్లకు మౌలిక సదుపాయాల స్థితిని ఆతిథ్య పరిశ్రమ కోరుతోంది. కోవిడ్‌ ప్రభావిత పతనం నుండి ఈ రంగం బలంగా పుంజుకుంటోంది. అయితే కొంత లక్ష్యితి మద్దతు ఉపాధి అవకాశాలను విస్తరిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయడం తక్షణ అవసరం. వాటిని ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహకాలతో పాటు, రైతులు రిటైల్‌ మార్కెట్‌లను ప్రత్యక్ష మార్గంలో అందుకోవడానికి తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయడం అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఆదాయ మార్గాల కల్పనతో పాటు మౌలిక వసతుల కల్పనను తక్షణ ప్రాతిపదికన చేపట్టాలి. లేకుంటే రానున్న సంవత్సరాల్లో పట్టణ, గ్రామీణ అంతరం మరింత విస్తరిస్తూనే ఉంటుంది. సమాజంలోని అన్ని వర్గాలూ ప్రయోజనా లను పొందగలిగేలా చూసుకోవాలి. దేశవ్యాప్తంగా ఆకాంక్షలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయని ఇటీవలి ఎన్నికలు తెలియజేశాయి.సంక్షేమ విధానాలకు స్వాగతమే. అయితే దీర్ఘకాలంలో అవి స్థిరమైన అభివృద్ధికి దారితీయాలి.సుష్మా రామచంద్రన్‌ వ్యాసకర్త సీనియర్‌ ఫైనాన్షియల్‌ జర్నలిస్ట్‌(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Over 40 Pak Terrorists Hiding In Hilly Regions Of Jammu
జమ్మూలో 40 మందికి పైగా పాక్‌ ఉగ్ర మూకలు.. ఏరివేతలో భద్రతా బలగాలు

భారత్‌లో పాక్‌ ఉగ్ర మూకల వేట కొనసాగుతోంది. జమ్మూ ప్రాంతంలో సుమారు 40 నుంచి 50 మంది పాకిస్తాన్‌ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు కేంద్ర నిఘూ వర్గాలు గుర్తించాయి. దీంతో భద్రతా బలగాలు ఉగ్ర మూకల్ని ఏరిపారేసేందుకు కూంబింగ్‌ ప్రారంభించాయి..పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. జమ్మూ ప్రాంతంలోకి చొరబడిన ఉగ్రవాదులు అత్యున్నత శిక్షణ పొందారు. వారి వద్ద అమెరికా తయారు చేసిన ఎం4 కార్బైన్ రైఫిల్స్‌తో పాటు అత్యంత ఆధునిక, అధునాతన ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లోకి సైతం చొచ్చుకుపోయే సామర్థ్యం ఉన్న బుల్లెట్లను ఉన్నాయని తేలింది. జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదులు యాక్టీవ్‌గా ఉన్నారు. ముఖ్యంగా పర్వతాలు, అడవుల కేంద్రంగా ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. వారి ఏరివేత కోసం ఆర్మీ దళాలు కార్డన్, సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.

Former Minister Jagadishreddy Comments On Telangana Government
మోసం చేయడమే కాంగ్రెస్‌ పని: మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

సాక్షి,సూర్యాపేట జిల్లా: ఆరు గ్యారంటీలు అని చెప్పుకోవడానికే తప్ప ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చలేదని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో సోమవారం(జులై 23) జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఉచిత బస్సు అని నమ్మించి మోసం చేసి బస్సులు తగ్గించారు.మహిళలు ఒకరినొకరు తిట్టుకుని కొట్టుకునేలా చేశారు. రైతుల రుణమాఫీ కంటే ఫ్లెక్సీలు, పాలాభిషేకాలకే ఖర్చు ఎక్కువైంది. ఏ ఒక్క మంత్రికి వ్యవసాయం మీద అవగాహన లేదు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పని. 24 గంటల కరెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. గోదావరికి వరద వచ్చినా కాళేశ్వరం ఎక్కడికీ పోలేదు క్షేమంగా ఉంది. అక్కడ మీరు స్విచ్ ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీలు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది’అని జగదీష్‌రెడ్డి అన్నారు.

Charlie Cassell Become First Player In History To Rare Feat On ODI Debut
అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు.. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే!

స్కాట్లాండ్ ఫాస్ట్ బౌలర్ చార్లీ కాసెల్ స‌రి కొత్త చ‌రిత్ర సృష్టించాడు. వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా కాసెల్ రికార్డులకెక్కాడు. సోమవారం ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ లీగ్ 2లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాసెల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు కేవలం 21 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబడా పేరిట ఉండేది. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెబ్యూ చేసిన రబాడ.. తన అరంగేట్రంలో 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో రబాడ ఆల్‌టైమ్‌ రికార్డును కాస్సెల్‌ బ్రేక్‌ చేశాడు. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెబ్యూ చేసిన రబాడ.. తన అరంగేట్రంలో 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో రబాడ ఆల్‌టైమ్‌ రికార్డును కాస్సెల్‌ బ్రేక్‌ చేశాడు. అదే విధంగా మరో వరల్డ్‌రికార్డును కూడా అతడు నమోదు చేశాడు. అరంగేట్రంలో తొలి రెండు బంతుల్లోనే వరుసగా రెండు వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్‌గా కాస్సెల్‌ నిలిచాడు. తను వేసిన మొదటి ఓవర్‌లో తొలి రెండు బంతుల్లో ఒమన్‌ బ్యాటర్లు జీషన్ మస్కూద్ అయాన్ ఖాన్‌లను ఔట్‌ చేసిన కాసెల్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ ప్లేయర్‌ కూడా ఈ ఫీట్‌ను నమోదు చేయలేకపోయాడు.ఇక ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన ఒమన్‌.. కాసెల్ దాటికి కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని స్కాట్లాండ్‌ 2 వికెట్లు కోల్పోయి చేధించింది.Charlie Cassell's sensational seven-for on debut has helped Scotland bowl Oman out for a modest total 👏Catch all the live #CWCL2 action on https://t.co/CPDKNxoJ9v 📺#SCOvOMA 📝: https://t.co/woV3zYu9sG | 📸: @CricketScotland pic.twitter.com/iGeeVoyvTc— ICC (@ICC) July 22, 2024

YouTube Down For Users in India
యూట్యూబ్ డౌన్!.. గగ్గోలు పెడుతున్న యూజర్లు

గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ యాప్, వెబ్‌సైట్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయడంలో సమస్యను ఎదుర్కొన్నట్లు కొందరు యూజర్స్ పిర్యాదు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి యూట్యూబ్‌లో సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.యూట్యూబ్‌లో సమస్య గురించి వచ్చిన ఫిర్యాదుల్లో.. 43 శాతం మంది వినియోగదారులు యాప్‌తో సమస్య ఉన్నట్లు వెల్లడించారు. 33 శాతం మంది వీడియోను అప్‌లోడ్ చేయడంలో సమస్యను ఎదుర్కొన్నట్లు, 23 శాతం మందికి యూట్యూబ్ వెబ్‌సైట్‌తో సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు.నెటిజన్లు ఎదుర్కొన్న సమస్యలను గురించి ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. యూట్యూబ్ డౌన్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సమస్య మరువక ముందే.. యూట్యూబ్ సమస్య వచ్చిందని చెబుతున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని యూట్యూబ్ టీమ్ పేర్కొంది.Youtube Video Upload But not showing in YouTube application as well as Yt studio please fix this issue as early as possible.... #Youtubedown #Videouploadbutnotshowingproblem @TeamYouTube @YouTubeIndia @YouTubeCreators— Piyush Joshi (@Piyush_j_7) July 22, 2024#YouTube Ka Bhi Systumm Hang Ho Gya Aaj 🤦‍♀️🤦‍♀️Upload Nahi Ho Rahi Videos#YoutubeDown— Aditi Shharmaa (@AditiSharma780) July 22, 2024

Rashid parents Allegations On TDP Govt And Home Minister Anitha
నా బిడ్డది ముమ్మూటికీ రాజకీయ హత్యే: రషీద్‌ తల్లిదండ్రులు

సాక్షి, పల్నాడు జిల్లా: ముమ్మాటికీ తన బిడ్డది రాజకీయ హత్యేనని రషీద్‌ తల్లిదండ్రులు ఆరోపించారు. రషీద్‌ను వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీఎస్‌ అంజనేయులే చంపించారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీలో యాక్టివ్‌గా పనిచేస్తున్నాడనే టీడీపీ నేతలు తన బిడ్డను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్యాయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆమె కూడా ఓ మహిళే కదా.. తల్లి కడుపు కోత తెలియదా అని ప్రశ్నించారు. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారని నిలదీశారు.ప్రభుత్వం న్యాయం చేసేదే అయితే ఎందుకు తమ దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పలేదని రషీద్‌ తల్లిదండ్రులు ప్రశ్నించారు. కొంతమంది ఫోన్ చేసి తమ కుటుంబ సభ్యులను భయపెడుతున్నారని చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తమ ఇంటికి వచ్చి న్యాయం చేస్తానని చెప్పారని తెలిపారు. అసెంబ్లీలో రషీద్ హత్యపై వైఎస్‌ జగన్‌ పోరాడుతుంటే పోలీసులు ఎందుకు ప్లే కార్డులు లాక్కున్నారని ప్రశ్నించారు.‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు మాట్లాడను ఇవ్వటం లేదు. ఒక మనిషిని అన్యాయంగా చంపితే ఆయన తరుపున మాట్లాడే హక్కు లేదా?. పార్టీ పరంగా అడిగే హక్కు వైఎస్ జగన్‌కు లేదా?. ఎందుకు ప్రభుత్వం, పోలీసులు పదేపదే నా బిడ్డది వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్యానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు

AP Assembly Session 2024 July: Governor Speech Complete Lies
ఆఖరికి.. ఏపీ అసెంబ్లీలోనూ అబద్ధాలు!

అమరావతి, సాక్షి: ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి రాగానే పాలన మీద ఫోకస్‌ చేస్తుంది. కానీ, చంద్రబాబు మాత్రం శ్వేత పత్రాల పేరుతో, సమీక్షల పేరిట జగన్‌ పాలనపై నిత్యం నిందలు వేస్తున్నారు. చూస్తుంటే.. ఇలాగే ఐదేళ్లు గడిపిస్తారేమో అనిపించేలా ఉంది ఆయన వ్యవహారం. అయితే తాజాగా అసెంబ్లీ సాక్షిగా.. అదీ రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేత గవర్నర్‌ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించింది కూటమి ప్రభుత్వం.తన పాలనలో ఏనాడూ సంక్షేమం, కనీస మౌలిక వసతుల గురించి పట్టించుకోని చంద్రబాబు.. విజనరీ నాయకుడని, విభజిత ఏపీ అభివృద్ధికి కృషి చేశారని గవర్నర్‌ ప్రసంగంలో చెప్పించుకున్నారు. అంతేకాదు 2014-19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగిందని, 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయని, పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో అబద్ధపు ప్రసంగాన్ని చదివించారు. వాస్తవానికి.. జగన్‌ పాలన చేపట్టే నాటికి అభివృద్ధి కుంటుపడి ఉంది. ఆ కారణంగానే 2019లో అధికార మార్పిడి జరిగింది కూడా. అయితే కరోనా లాంటి విపత్తుతో రెండేళ్లు గడిచినప్పటికీ.. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండింటి మీద ఫోకస్‌తోనే జగన్‌ పాలన కొనసాగింది. సంబంధిత వార్త: జగన్‌ వల్లే పెట్టుబడులు పైపైకి..అమరావతిని కొంత మంది పెట్టుబడిదారుల కోసమే చంద్రబాబు తెర మీదకు తెచ్చారు. కానీ, జగన్‌ అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. ఈ మూడింటిలో అమరావతి కూడా ఒక రాజధానిగానే ఉంది కదా!. సంబంధిత వార్త: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు సహేతుకమే!గత ఐదేళ్లలో ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్న గవర్నర్‌ ప్రసంగం.. కూటమి ప్రభుత్వంలో గత 45 రోజులుగా శాంతి భద్రతల ఏ స్థాయిలో ఘోరంగా దెబ్బ తిన్నాయో స్పందించలేదు. కనీసం లా అండ్‌ ఆర్డర్‌ పునరుద్ధరణ ప్రస్తావన కూడా లేదు. వివిధ రంగాల్లో నష్టాలు వచ్చాయంటూ కాకి లెక్కలతో సాగింది గవర్నర్‌ ప్రసంగం. పైగా గత ఐదేళ్లుగా అవి ఎల్లో మీడియాలో వచ్చిన ఊహాగాన కథనాలు.. కల్పిత రాతలే. సంబంధిత వార్త: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ ముందడుగుఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించామన్న చంద్రబాబు ప్రభుత్వం.. సూపర్‌సిక్స్ వాగ్దానాలు ఎన్ని నెరవేర్చారో మాత్రం చెప్పలేదు కానీ రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలన్న మాటతో గవర్నర్ ప్రసంగం ముగిసింది. అయితే.. ఇప్పటికే జగన్ వల్లే ఖజానా ఖాళీగా ఉందంటూ చెబుతూ వస్తున్న చంద్రబాబు.. మళ్లీ ఎన్నికలొచ్చేదాకా ఇదే మాట చెబుతారేమో అనే అనుమానాలు ఉన్నాయి. దీనికి తోడు అసెంబ్లీలో శ్వేత పత్రాల పేరుతో అబద్ధాలకు ఆయన రెడీ అయ్యాడు కూడా. జనాలు కోరుకునేది తమకు ఇచ్చిన హామీల అమలు. అంతేకానీ ఇలా నిందలు వేస్తూ వెళ్లడం కాదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం.. చంద్రబాబును, ఆయన మాటలను, కూటమి పాలనను ప్రజలు అసహ్యించుకునే రోజులు తొందరగానే వస్తాయి.

Kuwait Couple Divorces Within 3 Minutes Of Getting Married Due To This Reason
పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. కారణం ఏంటో తెలుసా?

పెళ్లంటే నూరేళ్ల బంధం.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి.. పెళ్లి కొత్త జీవితానికి నాంది.. పెళ్లి అనేక మధురానుభూతులకు, జ్ఞాపకాలకు వేదిక.. ఇలాంటి పదాలన్నీ తరుచూ వింటుంటాం.. ఒకప్పుడు పెళ్లంటే గౌరవం, నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దంపతుల మధ్య అపార్థాలు, చిన్న సమస్యలనే పెద్దదిగా చూడటం.. ఇలా అనేక కారణాలతో పెళ్లైన వెంటనే విడాకుల బాట పడుతున్నారు.తాజాగా ఓ జంట వివాహం జరిగిన మూడు అంటే మూడు నిమిషాలకే విడాకులు తీసుకుంది. న్యాయమూర్తి సైతం ఆ జంటకు విడాకులు మంజూరు చేశాడు. వినడానికి కాస్తా ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ ఈ ఘటన కువైట్‌ దేశంలో జరిగింది. అయితే ఈ సంఘటన 2019 జరగ్గా.. తాజాగా మరోసారి వైరల్‌గా మారింది. కువైట్‌లో వధూవరులు, తమ వివాహ రిజిస్ట్రేషన్‌ కోసం న్యాయమూర్తి ఎదుట సంతకాలు పెట్టేందుకు వెళ్లారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న వేళ, వధువు పొరపాటున కాలు జారి కింద పడిపోయింది. దీంతో వెంటనే పక్కనే ఉన్న వరుడు ఆమెను తెలివి తక్కువదానా అంటూ పరుష పదజాలానికి దిగాడు.తనకు సాయం చేయాల్సింది పోయి, పరువు తీశావంటూ అవమానించడంతో వధువు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనితో తన జీవితం సాఫీగా ఉండదని భావించిన ఆమె, ఒక్కసారిగా జడ్జి దగ్గరకు వెళ్లి, విషయం చెప్పి, విడాకులు కావాలని అడిగింది. దీని న్యాయమూర్తి అంగీకరించి వెంటనే విడాకులు మంజూరు చేేశాడు.అయితే పెళ్లైన మూడు నిమిషాలకే ఆ జంట విడాకులు తీసుకోవడంతో.. దేశ చరిత్రలో అతి తక్కువ సమయం వివాహంగా రికార్డులకెక్కింది. ఇదిలా ఉండగా గతంలో దుబాయ్‌లో ఓ జంట పెళ్లయన 15 నిమిషాల వ్యవధిలో విడాకులకు దరఖాస్తు చేసి, మంజూరు చేయించుకుంది.

Advertisement
Advertisement
Advertisement
National View all
title
ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం.. నావికుడు గల్లంతు

ముంబై: భారత నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్ర యుద్ధన

title
జమ్మూలో 40 మందికి పైగా పాక్‌ ఉగ్ర మూకలు.. ఏరివేతలో భద్రతా బలగాలు

భారత్‌లో పాక్‌ ఉగ్ర మూకల వేట కొనసాగుతోంది.

title
Video: జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన యువకుడు

గత కొన్నేళ్లుగా యువతలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

title
7030 విమానాలు రద్దు.. గవర్నమెంట్ డేటా

దేశీయ విమానయాన సంస్థలు ఈ ఏడాది మే 31 వరకు 7,030 షెడ్యూల్ విమానాలను రద్దు చేశాయి.

title
ఈ వీడియోని చూసి ‘ముఖ్యమంత్రి గారు సిగ్గుతో తలదించుకోండి’

తన పొలంలో రోడ్డు వేయొద్దన్నందుకు ఇద్దరు మహిళలల్ని బ్రతికుండగానే నడుం లోతు పూడ్చిపెట్టిన వీడియోలు సోషల్‌ మీడియాలో వెలుగుల

International View all
title
పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. కారణం ఏంటో తెలుసా?

పెళ్లంటే నూరేళ్ల బంధం.. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి.. పెళ్లి కొత్త జీవితానికి నాంది..

title
దేశాధినేతల ర్యాంప్‌ వాక్‌! వైరల్‌ వీడియో

ఎ‍ప్పుడూ బిజీగా ఉండే దేశాధినేతలు చిత్ర విచిత్రమైన దుస్తులు ధరించి ర్యాంప్‌ వాక్‌ చేస్తే ఎలా ఉంటుంది?

title
గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి.. 15 మంది మృతి

ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది.

title
కీలక వడ్డీరేట్లను తగ్గించిన చైనా!

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉన్న చైనా కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

title
డెమోక్రాట్‌ అభ్యర్థిపై సస్పెన్స్‌.. ట్విస్ట్‌ ఇచ్చిన ఒబామా!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్‌ తప్పుకున్

NRI View all
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all