కాంగ్రెస్ పార్టీ సభలో ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్ పార్టీ నేత, మంత్రి హరీశ్ రావు అన్నారు. శాసన సభ గౌరవాన్ని కాంగ్రెస్ మంటగలిపిందని మండిపడుతూ వారి చర్యను ఖండించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలొద్దని, హుందాగా వ్యవహరించాలని గత బీఏసీ సమావేశాల్లోనే అందరి సమక్షంలో నిర్ణయించామని, అయినా ఎందుకు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.