కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఏపీ మధ్య రెండున్నరే ళ్లుగా నలుగుతున్న వివాదం హస్తిన చేరింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఇందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శ ర్మ, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ విజయ్‌ప్రకాశ్‌లు మంగళవారం సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.