
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ 2023-24 బడ్జెట్‌కు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఫిబ్రవరి 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభయ సభలకు ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఆ మరుసటి రోజున గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఇదిలా ఉండగా..
తెలంగాణ బడ్జెట్‌కు ఎట్టకేలకు గవర్నర్ ఆమోద ముద్ర లభించింది. బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం ఉంటుందా? అనే అభ్యంతరం లేవనెత్తిన గవర్నర్.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. దీంతో సర్కార్ హైకోర్టును ఆశ్రయించగా.. ఇరు పక్షాలను చర్చించుకుని ఓ కొలిక్కి తీసుకురావాలని బెంచ్ సూచించింది. దీంతో బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి గవర్నర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందడంతో ఈ వివాదం ముగిసినట్లయ్యింది.
ఇదీ చదవండి: ‘కోర్టు మొట్టే వరకు కేసీఆర్ బుర్ర పనిచేయలేదు’
Comments
Please login to add a commentAdd a comment