తెలంగాణ బడ్జెట్‌: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్‌ సర్కార్‌ | Telangana Assembly Budget Session 2024 And Politics Live Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ బడ్జెట్‌: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్‌ సర్కార్‌

Published Sat, Feb 10 2024 9:26 AM | Last Updated on Sat, Feb 10 2024 2:14 PM

Telangana Assembly Budget Session And Politics Live Updates - Sakshi

Live Updates..

తెలంగాణలో బడ్జెట్‌ సమావేశాలు..

ఉభయ సభలు సోమవారానికి వాయిదా.

భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రసంగం..

  • 2024-25 ఆర్థికసంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలు

  • రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు. 

  • మూలధన వ్యయం 29,669 కోట్లు

  • ద్రవ్యలోటు రూ.32,557 కోట్లు. 

  • రెవెన్యూలోటు రూ.5944 కోట్లు.

  • ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తాం 
  • తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తెస్తాం 
  • ప్రజల సంక్షేమం కోసం ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొంటాం 
  • ప్రజాపాలన మరింత పటిష్టంగా ముందుకు సాగుతుంది 
  • నిస్సహాయులకు సాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం 
  • సమానత్వమే మా ప్రభుత్వ విధానం 

  • అందరం కోసం మనందరం అనే స్పూర్తితో ముందుకెళ్తాం 
  • ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించడం మా చిత్తశుద్ధికి నిదర్శనం 
  • రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత 
  • గత ప్రభుత్వం దళిత బంధు పథకానికి రూ.17,700 కోట్లు చూపించారు.. ఒక్క పైసా ఇవ్వలేదు 
  • ఐటీ శాఖకు రూ.774 కోట్లు 
  • పంచాయతీరాజ్ శాఖకు రూ.40,080 కోట్లు
  • పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు 
  • జీఎస్డీపీ 2022-3తో పోలిస్తే 13,02,371 కోట్ల నుంచి 14,49,708 కోట్లకు
  • ఆర్ధిక వృద్ధి 14.7 శాతం నుంచి 11.3 శాతం క్షీణించింది 

  • దేశీయ స్థాయిలో వృద్ధి రేటు 16.1 శాతం నుంచి 8.9 శాతానికి పడిపోయింది 
  • అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది 5వ స్థానం 
  • టీఎస్ పీఎస్ సీ నిర్వహణ కోసం 40 కోట్లు కేటాయింపు 
  • అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు హామీలు నెరవేర్చాం 
  • విద్యుత్ రంగానికి ర.16,825 కోట్లు కేటాయింపు 
  • మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్ల అదనపు చెల్లింపు 
  • రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం 
  • గృహ జ్యోతి కింద రూ.500లకే వంటగ్యాస్ 
  • సంక్షేమ పథకాల అమలుకు రూ.53,196 కోట్లు

  • మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు 
  • కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ను మరింత అభివృద్ధి చేస్తాం 
  • రాష్ట్రంలో ప్రభుత్వం తరపున రెండు లెదర్ పార్కులు 
  • రాష్ట్రం నలుమూలల అభివృద్ధికి ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు 
  • త్వరలో డ్రై పోర్టులను అందుబాటులోకి తెస్తాం 
  • పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు ప్రతిపాదిస్తున్నాం 
  • గ్రామీణ ప్రజల అభివృద్ధికి ఏఐ టెక్నాలజీని వినియోగిస్తాం

  • ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బంది రానీయం 
  • ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరిస్తాం 
  • అమెరికాలోని ఐటీ సర్వ్ అనే సంస్థతో సంప్రదింపులు చేస్తున్నాం 
  • ఐటీ రంగంలో తెలంగాణ తిరుగులేని శక్తిగా నిలబడుతుంది 
  • 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే విధివిధానాలు 
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు 
  • పాలనకు కాదు రాష్ట్రాభివృద్ధికి హైదరాబాద్ గుండెకాయ 
  • హైదరాబాద్ కు ఆర్ధిక శక్తినిచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమే 
  • ఫార్మా, ఐటీ, ఓఆర్ఆర్, 24 గంటల విద్యుత్ ఘనత కాంగ్రెస్‌దే

  • హైదరాబాద్ అభివృద్ధి నాయకులు, అధికారుల కోసం కాదు 
  • మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పనా జోన్ గా మారుస్తాం 
  • మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధికి నూతన విధానాలు 
  • హైదరాబాద్ అభివృద్ధి నాయకులు, అధికారుల కోసం కాదు 
  • థేమ్స్ నది తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి 
  • సాంస్కృతిక కట్టడాల పరిరక్షణను పకడ్బందీగా అమలు చేస్తాం 
  • మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కోసం రూ.1,000 కోట్లు 

  • తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం 
  • హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని 3 జోన్ లుగా విభజిస్తాం 
  • ORR, RRR మధ్య ప్రాంతాన్ని పెరి అర్బన్ జోన్ 
  • RRR ఆవల ఉన్న భాగాన్ని గ్రామీణ జోన్ గా విభజన 
  • సాగుకు పనికి రాని భూములకు సైతం గత సర్కార్ రైతుబంధు ఇచ్చింది 
  • పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ భూములకు రైతుబంధు ఇచ్చారు 
  • రైతు బంధు కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం 
  • కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందిస్తాం 
  • ఆయిల్ పామ్ సాగుకు అదనంగా లక్ష ఎకరాలకు పెంపు 
  • కైలు రైతులకు రైతు బీమా పథకం వర్తింపజేస్తాం 
  • త్వరలో నూతన విత్తన విధానం అమల్లోకి తెస్తాం

  • ధరణి కొంతమందికి భరణంగా, మరికొంతమందికి ఆభరణంగా మారింది 
  • ధరణి పోర్టల్ సమస్యల అధ్యయనంపై ఐదుగురితో కమిటీ 
  • ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను మరింత అభివృద్ధి చేస్తాం 
  • ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1,000 కోట్లు 
  • ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.250కోట్లు 
  • గురుకులాల పాఠశాలల సొసైటీ ద్వారా రెండు ఎంబీఏ కాలేజీలు 
  • ఎస్టీ సంక్షేమానికి రూ.13,313 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2,262 కోట్లు 
  • బీసీ గురుకుల భవన నిర్మాణాలకు రూ.1,546 కోట్లు 
  • సాంప్రదాయ వృత్తుల వారికి శిక్షణతోపాటు పనిముట్లు 
  • బీసీ సంక్షేమానికి రూ.8,000 కోట్లు కేటాయింపు

  • కాంగ్రెస్ మేనిఫెస్టో సింహభాగం మహిళల సంక్షేమానికే
  • మహిళలకు గత డిసెంబర్ 9 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం
  • 35,781 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు పోషకాహారం
  • తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తాం 
  • త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
     

 

కేటాయింపులు ఇలా..

  • ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ.53,196 కోట్లు.  
  • ఐటీ శాఖకు రూ.774 కోట్లు. 
  • పంచాయతీరాజ్‌ శాఖకు రూ.40080 కోట్లు.
  • పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు. 
  • వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు. 
  • ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ.1250 కోట్లు. 
  • గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు. 
  • నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు. 
  • బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు. 
  • కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో సింహభాగం మహిళల సంక్షేమానికే. 
  • బీసీ గురుకుల భవన నిర్మాణాలకు రూ.1546 కోట్లు. 
  • సాంప్రదాయ వృత్తుల శిక్షణతో పాటు పనిముట్లు. 

  • విద్యుత్‌-గృహజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు. 
  • విద్యుత్‌ సంస్థలకు రూ.16825 కోట్లు.
  • రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. 
  • విద్యుత్‌ రంగానికి 16825 కోట్లు కేటాయింపు
  • మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు అదనపు కేటాయింపు. 
  • గృహజ్యోతి కింద రూ.500లకే వంటగ్యాస్‌, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌ 
  • విద్యారంగానికి రూ.21,389 కోట్లు. 
  • తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు రూ.500 కోట్లు.
  • యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు. 
  • ఎస్సీ సంక్షేమం రూ.21874కోట్లు. 
  • ఎస్టీ సంక్షేమం రూ.13013 కోట్లు. 
  • పరిశ్రమల శాఖకు రూ.2543 కోట్లు ప్రతిపాదిస్తాం. 

  • తెలంగాణను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తాం.
  • విద్యారంగానికి రూ.21389 కోట్లు.  
  • త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌. 
  • తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌కు రూ.500 కోట్లు కేటాయింపు. 
  • 65 ఐటీఐలను ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం. 
  • గుజరాత్‌, ఢిల్లీ, ఒడిశా తరహాలో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు. 
  • రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లు.
  • మా ప్రభుత్వంలో 6956 నర్సింగ్‌ ఆఫీసర్లను నియమించాం. 
  • వైద్య రంగానికి రూ.11,500 కేటాయింపు.
  • యువజన సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. 
  • యువకులను రెచ్చగొట్టం కాదు.. ఆత్మగౌరవంతో బతికేలా చేస్తాం. 

  • జాబ్‌ క్యాలెండర్‌ తయారు ప్రక్రియను ప్రారంభించాం. 
  • త్వరలో మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నాం. 
  • త్వరలో 15వేల కానిస్టేబుల్స్‌ రిక్రూట్‌మెంట్‌. 
  • 10 ఏళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ఒక్క ‍గ్రూప్‌-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదు. 
  • తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. 
  • టీఎస్‌పీఎస్సీకి రూ.40కోట్ల ఆర్థిక వనరులు. 
  • తాత్కాలిక ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. 
  • తాత్కాలిక ఉద్యోగి మరణిస్తే రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా.

  • చేనేత కార్మికుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 
  • రాష్ట్రం నలుమూలల నుంచి స్కూల్‌ యూనిఫామ్స్‌ కొనుగోలు చేస్తాం. 
  • అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన ఘనత తెలంగాణది. 
  • రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ది.
  • రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌కు కట్టుబడి ఉన్నాం. 
  • గృహజ్యోతి పథకం కింద రూ.200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌. 
  • గృహజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు కేటాయింపు. 
  • ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ.16,825 కోట్లు.
  •  స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల సాయం. 
  • ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మంజూరు. 
  • గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు. 

  • డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం. 
  • రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించాం. 
  • నూతన హైకోర్టు భవనానికి వంద ఎకరాల స్థలం.
  • ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అయిష్టంగా ఉంది. 
  • ప్రణాళిక, హేతుబద్దత లేకుండా గత ప్రభుత్వం అప్పులు చేసింది. 
  • గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు సవాళ్లుగా మారాయి. 
  • నీళ్లు, నిధులు, నియామకాలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగుతుంది. 

►తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం. 
►బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి భట్టి విక్రమార్క. 
►మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మంత్రి శ్రీధర్‌ బాబు. 

తెలంగాణ బడ్జెట్‌ 2.75 లక్షల కోట్లు.

నేటి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశానికి కేటీఆర్‌ దూరం

  • ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ
  • బీఆర్‌ఎస్‌ సభకు హాజరుకానున్న కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని.
  • అనంతరం తెలంగాణ భవన్‌కు కేటీఆర్
  • ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్‌ ప్రత్యేక భేటీ

రేపు సాయంత్రం సీఎల్పీ సమావేశం. 

  • సీఎల్పీలో కాళేశ్వరం టూర్, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్న నేతలు
  • సీఎల్పీ భేటీకి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు

►బడ్జెట్ ప్రతులను సీఎం రేవంత్‌కు అందించిన ఆర్థిక మంత్రి భట్టి, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.

►శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బడ్జెట్ పత్రాలు అందజేసిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు


►ఈనెల 12వ తేదీన బడ్జెట్‌ సమావేశాలను ముగించే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ‍ప్లాన్‌. 

►మరోవైపు.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్ శ్వేత పత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 

►విజిలెన్స్ ఇరిగేషన్ అంశాలను సభలో మాట్లాడనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

►ఈనెల 13న మేడిగడ్డ పర్యటనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ సర్కార్‌.


►సీఎం రేవంత్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించిన ప్రభుత్వం.

►కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయం. 

►కేసీఆర్‌ను ఆహ్వానించే బాధ్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌కు అప్పగించిన సీఎం రేవంత్

►కాసేపట్లో అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్‌. ఇప్పటికే అసెంబ్లీ వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు. 


►బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి ఆసక్తికర కామెంట్స్‌

  • అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి కామెంట్స్‌
  • స్పీకర్ పదవి ఆఫర్ ఇచ్చారు. నేనే వద్దన్నాను. 
  • రెండో విడతలో మంత్రి పదవి వస్తుంది అని ఆశిస్తున్నాను.
  • కేసీఆర్ ముర్కుడు.. రేషన్ బియ్యం సరఫరాలో, ధాన్యం సేకరణలో అవినీతికి పాల్పడ్డారు
  • ప్రాణహిత చేవెళ్ల కోసం రెండువేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తే పైపులకే కేసీఆర్ మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో SLBCకి కొంత నిధులు ఇస్తే ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేది. దానికి కూడా నిధులు ఇవ్వలేదు

9:50AM, Feb 10, 2024

  • బడ్జెట్‌లో అన్ని అంశాలు ఉంటాయి: భట్టి విక్రమార్క
  • ఇచ్చిన హామీలను అమలు చేస్తాం

9:47AM, Feb 10, 2024

  • ముగిసిన తెలంగాణ కేబినెట్‌సమావేశం
  • ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం
  • మధ్యాహ్నం గం. 12.లకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌
  • తెలంగాణ బడ్జెట్‌ అంచనా రూ. 3లక్షల కోట్లు
  • శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న భట్టి
  • మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు

►తెలంగాణ కేబినెట్‌ సమావేశం ప్రారంభం

►బడ్జెట్‌లో అన్ని అంశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తాం: భట్టి విక్రమార్క

►బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమైన రాష్ట్ర కేబినెట్ సమావేశం.

►తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

►కాసేపట్లో బడ్జెట్‌కు ఆమోదం తెలుపునున్న రాష్ట్ర కేబినెట్‌

►తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నేడు బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నాం 12 గంటలకు ఓటాన్ అకౌంట్ (ఓట్ ఆన్ అకౌంట్) బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క..  మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌ బాబు  ప్రవేశపెడతారు. 

►మాజీ సీఎం కేసీఆర్‌ ప్రతిపక్ష నాయకుడి హోదాలో శనివారం తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ చేసిన ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్‌ రెండ్రోజులుగా దూరంగా ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్‌ తెలంగాణ అసెంబ్లీలో తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement