Telangana Assembly Budget Session 2022: CM KCR Announced 91,142 Jobs - Sakshi
Sakshi News home page

CM KCR: తెలంగాణలో నిరుద్యోగులకు భారీ బొనాంజ.. 91, 142 ఉద్యోగాల భర్తీ షురూ

Published Wed, Mar 9 2022 10:41 AM | Last Updated on Wed, Mar 9 2022 12:28 PM

Telangana Assembly Budget Session: CM KCR Announced Jobs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. ఊహించినట్లుగానే భారీగా కొలువుల భర్తీ ప్రకటనను స్వయంగా వెల్లడించారు. మొత్తం 91, 142 ఉద్యోగాలకు నేటి నుంచే భర్తీ ప్రక్రియ ప్రారంభం అని ప్రకటించారు. తమది ఎంప్లాయింట్‌మెంట్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అని, హయ్యెస్ట్‌ పెయిడ్‌ ఎంప్లాయిస్‌ తెలంగాణలో ఉన్నారని ప్రకటించుకున్న తెలంగాణ సీఎం.. కేంద్రం వైఖరి వల్లే భర్తీ ప్రక్రియ ఆలస్యమైందని ఆరోపించారు.

‘‘తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టం. నేనూ పోలీసు లాఠీ దెబ్బలు తిన్నా. అంతులేని వివక్ష, అన్యాయం ఎదుర్కొంది తెలంగాణ. వేరే పార్టీలకు రాజకీయాలంటే గేమ్‌.. టీఆర్‌ఎస్‌కు మాత్రం ఒక టాస్క్‌. ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్లం మేం. మేం ఏం చేశామో ప్రజలకూ తెలుసు. పోరాటాలు చేశాం. జైలుకు వెళ్లాం. వ్యక్తిగత నిందలు ఎదుర్కొన్నా. ఏకాగ్రత, లక్ష్యం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఊరుకున్నాం. తెలంగాణ కోసం క్షోభ, బాధ అనుభవించాం. తెలంగాణ భాష అంటే ఒకప్పుడు హాస్యాస్పదంగా ఉండేది. ఒకప్పుడు జోకర్లకు ఉండే తెలంగాణ యాస.. ఇప్పుడు హీరోలకు వచ్చేసింది.  అధికారికంగా పండుగలు జరుపుకుని.. సంస్కృతిని కాపాడుకున్నాం.

నీళ్లు, నిధులు, నియామకాలు.. ఉద్దేశంతో పోరాడాం. గోదావరి జలాలు సాధించుకున్నాం. తెలంగాణ కోసం విద్యార్థులు పోరాటాలు చేశారు. రెండు రోజులు ఆలస్యమైనా పని మంచిగా జరగాలనే కోణంలో పని చేసింది మా ప్రభుత్వం. ఇప్పటివరకు లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.  మరో లక్షా 56 వేల ఉద్యోగాలకు నోటిఫై చేశాం. రాష్ట్రపతి, ప్రధానులకు స్వయంగా నేనే చర్చించా. దేశంలో ఎక్కడా లేని విధంగా.. శాశ్వతంగా 95 శాతం స్థానికులకే వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇకపై అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే. టీచర్ల ప్రమోషన్లు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాం. 9, 10 షెడ్యూల్‌ పంచాయితీ ఇంకా తెగని కారణంగా.. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. 

తెలంగాణలో  గుర్తించిన ఖాళీలు 91, 142

11, 103 కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రైగ్యులరైజేషన్‌

గ్రూప్‌-1 పోస్టులు 503, 
గ్రూప్‌-2 పోస్టులు 582
గ్రూప్‌-3 పోస్టులు  1,373
గ్రూప్‌-4 పోస్టులు 9,168  

జిల్లా స్థాయిలో 39, 829 పోస్టులు.

హైదారాబాద్‌- 5,268
నిజామాబాద్‌- 1,976 
మేడ్చల్‌ మల్కజ్‌గిరి - 1,769
రంగారెడ్డి- 1,561
కరీంనగర్‌-1,465
నల్లగొండ-1,398
కామారెడ్డి- 1,340
ఖమ్మం- 1,340
భద్రాద్రి కొత్తగూడెం- 1,316
నాగర్‌ కర్నూలు-1,257
సంగారెడ్డి-1,243
మహబూబ్‌నగర్‌- 1,213
ఆదిలాబాద్‌-1,193
సిద్దిపేట- 1,178
మహబూబాబాద్‌: 1, 172
హన్మకొండ- 1,157
మెదక్‌- 1,149
జగిత్యాల- 1, 063
మంచిర్యాల-1, 025
యాదాద్రి-భువనగిరి- 1,010 
జయశంకర్‌ భూపాలపల్లి- 918
నిర్మల్‌-876
వరంగల్‌-842
కొమురంభీం ఆసీఫాబాద్‌- 825
పెద్దపల్లి-800
జనగాం-760
నారాయణ్‌పేట- 741
వికారాబాద్‌-738
సూర్యాపేట-719
ములుగు- 696
జోగులాంబ గద్వాల-662
రాజన్న సిరిసిల్ల- 601
వనపర్తి-556

జోనల్‌ లెవల్‌లో 18, 866 పోస్టులు

మల్టీజోనల్‌లో 13, 170 ఉద్యోగాల ఖాళీ

ఇతర కేటగిరీ, వర్సిటీల్లో 8, 174 పోస్టులు

నిరుద్యోగుల జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించడంతో పాటు మొత్తం ఖాళీలలో.. 11, 103 కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం కేసీఆర్‌. అలాగే మిగిలిన వాటిల్లో  80, 039 పోస్టులకు ఇవాళ్టి(మార్చి 9, 2022) నుంచే నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అంతేకాదు ఉద్యోగ గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. 

  • ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు
  • దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు
  • ఎక్స్‌ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు
  • హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు

► మొత్తం 80, 039 ఖాళీల్లో..  అత్యధికంగా హోం శాఖలో 18, 334 ఖాళీలు ఉన్నాయి. తర్వాతి  సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13, 086 ఖాళీలు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలో 12, 775 ఖాళీలు ఉన్నాయి. 

► ఉన్నత విద్యలో 7, 878, బీసీల సంక్షేమం 4, 311, రెవెన్యూలో 3, 560, షెడ్యూల్‌ కాస్ట్స్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో 2, 879, ఇరిగేషన్‌లో 2, 692, ఫైనాన్స్‌లో 1, 146, అత్యల్పంగా లెజిస్లేచర్‌లో 25, విద్యుత్‌ శాఖలో 16 ఖాళీలు ఉన్నాయి. 

► కాంట్రాక్ట్ ఉద్యోగాలు వద్దన్నందుకు రాష్ట్రంలోని పలు పార్టీలు కోర్టుకు వెళ్లాయని చెప్పారు సీఎం కేసీఆర్‌. ఉద్యోగి కన్నా కాంట్రాక్ట్ ఉద్యోగులే ఎక్కువ పనిచేస్తుంటార‌ని, అయినప్ప‌టికీ వారి జీతాలు మాత్రం తక్కువగా ఉంటున్నాయ‌ని చెప్పారు. 

► కాంట్రాక్ట్ పేరుతో శ్రమదోపిడి ఉండకూడ‌ద‌నేది త‌మ‌ అభిలాష అని ఆయన అన్నారు. అందుకే 11, 103 కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యుల‌రైజ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇక ఉద్యోగ క్యాలెండర్ విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. క్ర‌మంగా ఉద్యోగాల భ‌ర్తీ ఉంటుంద‌ని చెప్పారు. 

► రాష్ట్రంలో ఇప్ప‌టికే తాము 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చామని, 1.12 లక్షల కొత్త పోస్టులు మంజూరు చేశామ‌ని చెప్పుకొచ్చారు. తెలంగాణ‌లో 1,33,940 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని చెప్పారు. 

► 95 శాతం లోకల్‌ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామ‌ని అన్నారు. కేంద్ర స‌ర్కారు సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు. దేశంలోనే అతి త‌క్కువ అప్పులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయ‌న చెప్పుకొచ్చారు. తాము క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు.  కొంద‌రు ఉద్యోగ‌ నియామకాలపై అర్ధరహిత వివాదాలు సృష్టించారని ఆయ‌న అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement