స్పీకర్ విదేశీ పర్యటన రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చేనెల మూడోవారంలో జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ తమ విదేశీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. కామెరూన్‌లో జరగనున్న కామన్‌వెల్త్ దేశాల స్పీకర్ల సమావేశంలో పాల్గొనేందుకు వారు అక్టోబర్ మొదటివారంలో అక్కడికి వెళ్లాల్సి ఉంది. అయితే అక్టోబర్ మూడోవారంలో అసెంబ్లీ సమావేశాలు జరపాలనిప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించడంతో.. పర్యటనను రద్దుచేసుకున్నారు.