సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవనున్నారు. మంగళవారం(జులై 23)నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తెలంగాణలో గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు.
కాగా, మంగళవారం మధ్యాహ్నం బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్ శాసనసభపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికి మొత్తం 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లడతారనేది ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీలో బీఆర్ఎస్ లేవనెత్తనున్న అంశాలు ఇవే..
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు
జాబ్ కేలండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్ధులపై ప్రభుత్వ దమనకాండ
రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం
చేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి
ఆరు గ్యారంటీల అమలు ..శాసన సభలో చట్టబద్దత
రైతు రుణ మాఫీ అమల్లో ఆంక్షలు-నష్టపోతున్న రైతాంగం
పంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యం
రైతుభరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు
గ్రామాలు ,పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం -పారిశుధ్య నిర్వహణ సరిగా లేక కుంటు పడుతున్న ప్రజారోగ్యం
ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు
Comments
Please login to add a commentAdd a comment