సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో తెలంగాణ భవన్‌కు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో ఆయనపాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్‌కు కేటీఆర్ చేరుకోగా, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకుంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.
రైతు రుణమాఫీ, నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నించాలని కేసీఆర్ సూచించనున్నారు. ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, ఇటీవల జరుగుతున్న పరిణామాలపై కూడా గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.
కాగా, తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 31 వరకు సమావేశాలు జరగనున్నాయి. మధ్యలో ఆదివారం 28వ తేదీన సభకు సెలవు ప్రకటించింది. 25వ తేదీన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 31వ తేదీన ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపనుంది.
Comments
Please login to add a commentAdd a comment