సాక్షి, అమరావతి: శాసన మండలిలో టీడీపీ సభ్యులు దౌర్జన్యంగా వ్యవహరించారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై టీడీపీ నేతలు అనవసర ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సంఖ్యాబలం ఉందని టీడీపీ సభ్యులు ప్రతి దాన్ని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘‘మా సభ్యులంటూ డిప్యూటీ చైర్మన్ అనటంలో అర్థమేమిటని’ మంత్రి బొత్స ప్రశ్నించారు. డిప్యూటీ ఛైర్మన్ మాటలను ఆయన ఖండించారు. (నాపై దాడికి లోకేష్ ప్రోద్బలమే కారణం)
టీడీపీ సభ్యులు పక్కా ప్లాన్‌తోనే మండలిలో ప్రవేశించారని మంత్రి తెలిపారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటే ఇదేనా అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. సభలో ఫోటోలు, వీడియోలు తీయొద్దంటే లోకేష్ వినిపించుకోలేదన్నారు. ‘‘టీడీపీ ఎమ్మెల్సీలు ఏం సాధిద్దామని అనుకుంటున్నారు. పదే పదే సభలో ఉద్రిక్తతలు సృష్టిస్తే ఏమనాలి. రేపటి కాలానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు’’ అంటూ మంత్రి బొత్స దుయ్యబట్టారు. (బిల్లులు అడ్డుకోవడానికే టీడీపీ కుట్ర: అనిల్)
Comments
Please login to add a commentAdd a comment