
ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
సాక్షి, విజయవాడ: ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మొదటి నుంచి చర్చలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీతాలు ప్రాసెస్ చేశాక ఆపమని చెప్పడం భావ్యం కాదన్నారు. పీఆర్సీ అమలులో సమస్యలుంటే చర్చిస్తామని తెలిపారు.
చదవండి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌పై సుబ్రమణ్యస్వామి మరో పిటిషన్
ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం సంయమనంగా వ్యవహరించిందన్నారు. కోవిడ్ జాగ్రత్తలు పాటించమని చెప్పాం. ఉద్యోగులతో పోలీసులు సంయమనంగానే వ్యవహరించారని’’ బొత్స అన్నారు. ఉద్యోగులకు చంద్రబాబు ఏం ఉద్ధరించారు. ఉద్యోగులకు చంద్రబాబు కంటే ఎక్కువగానే మేలు చేశామని’’ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.