
సాక్షి, అమరావతి: అసెంబ్లీ నుంచి చంద్రబాబు బాయికాట్ హైడ్రామాపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఇదంతా ముందస్తుగా రచించుకున్న వ్యూహంలో భాగమే. ఇకపై అసెంబ్లీకి వెళ్లకుండా ఏం చేయాలనేది గురువారం సాయంత్రమే పార్టీ నేతలతో చర్చించుకొని దానిని యథాప్రకారంగా నేడు అమలు చేశారు. ఈ విషయంపై మాకు ముందస్తు సమాచారం ఉంది.
మంత్రి బొత్స సత్యనారాయణతో కూడా ఇప్పటిదాకా అదే విషయంపై మాట్లాడుతున్నా. చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోతున్నారు అని బొత్స సత్యనారాయణ నాతో చెప్తున్నారు. అంతలోనే చంద్రబాబు తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేస్తూ సీఎం అయ్యేదాకా అసెంబ్లీలో అడుగుపెట్టనంటూ మొసలి కన్నీరు కారుస్తూ అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు.
చదవండి: (ఏపీ శాసన మండలి ఛైర్మన్‌గా మోషేన్‌రాజు బాధ్యతలు)
బాబు హయాంలో జరిగిన వంగవీటి మోహనరంగా, ఎలిమినేటి మాధవరెడ్డి హత్యల గురించి చర్చిద్దామంటే ఎందుకు స్పందించడం లేదు. ఇప్పుడు వ్యవసాయశాఖ మీద చర్చ జరుగుతోంది. దాని గురించి మాట్లాడమంటే నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు. నా భార్యను అవమానించారంటూ మాట్లాడటం ఏమైనా సంబంధం ఉందా?. అసెంబ్లీ నుంచి వెళ్లిపోవాలనే ఆలోచనతోనే ఈ డ్రామా మొదలెట్టారు. అధికారం కోసం, రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారే వ్యక్తి. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే మనస్తత్వం బాబుది. చంద్రబాబు పదవి కోసం కుటుంబ సభ్యుల్ని కూడా పట్టించుకునే వ్యక్తి కాదు' అని మంత్రి కొడాలి నాని అన్నారు.
చదవండి: (మా అమ్మ, చెల్లెలు, బాబాయ్ గురించి చంద్రబాబే మాట్లాడారు: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment