
సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల కొనుగోలు స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కామ్‌లకు సంబంధించిన అవినీతిని బయటకు తీస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం రెండో రోజు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతి పరులపై విచారణ చేయకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. ప్రభుత్వం అవినీతి జరిగిందని నిర్ధారించిందని తెలిపారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వ హయాంలో అవినీతి జరగలేదని ఎందుకు ఖండించలేదని బొత్స నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో వాహనాలు కొనుగోలు చేయలేదని చెప్పండి అని సవాల్ విసిరారు. అప్పుడే తొందరపడితే ఎలా... ముందుంది ముసళ్ల పండుగ అని టీడీపీని ఉద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు. ('దొంగలా తాళాలు వేసుకొని ఉంటే అరెస్ట్ చేయరా')
Comments
Please login to add a commentAdd a comment