![Four Elected MLCs Take Oath Presence Of Council Chairman Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/28/mlc-1.jpg.webp?itok=cXYFKJkf)
జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న యాదవరెడ్డి, చిత్రంలో మంత్రి హరీశ్‌రావు తదితరులు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి ఎన్నికైన నలుగురు సభ్యులు గురువారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్.రమణ (కరీంనగర్), పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్), డాక్టర్ వి.యాదవరెడ్డి (మెదక్)లతో ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ తన చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు.
జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎల్.రమణ
ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులతో పాటు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు తరలివచ్చారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు నూతన ఎమ్మెల్సీలను అభినందించారు. నూతన ఎమ్మెల్సీలకు వేముల ప్రశాంత్‌రెడ్డి రూల్స్ బుక్, గుర్తింపు కార్డు అందజేశారు.
జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పట్నం మహేందర్‌రెడ్డి
మండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కోటాలో మండలికి ఎన్నికైన మరో ఐదుగురు సభ్యులు దండె విఠల్ (ఆదిలాబాద్), టి.భానుప్రసాద్ (కరీంనగర్), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), శంభీపూర్ రాజు (రంగారెడ్డి), ఎంసీ కోటిరెడ్డి (నల్లగొండ) ఫిబ్రవరి మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.
జాఫ్రీ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కసిరెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment