సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనమండలి సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండలి డిప్యూటీ చైర్మన్ భోజెగౌడను కుర్చీ నుంచి లాక్కెళ్లారు. ఆయనకు చైర్‌లో ఉండే అర్హత లేదంటూ మూకుమ్మడిగా కిందకు దింపారు. దీంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. గోవధ నిషేధ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ మండలి ఛైర్మన్ కె. ప్రతాపచంద్ర శెట్టిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో అధికార, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. (చదవండి: ఒవైసీ కీలక నిర్ణయం.. ఆ పార్టీతో జట్టు!)
ఈ క్రమంలో ఆయన సభకు వచ్చే ముందు జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్సీ, డిప్యూటీ చైర్మన్ ఎస్‌ఎల్ ధర్మే గౌడను చైర్మన్ సీటులో కూర్చోబెట్టారు. దీంతో రాజ్యాంగం ప్రకారం ఆయనకు కుర్చీలో ఉండే అర్హత లేదని, తమ పార్టీకి చెందిన చంద్రశేఖర్ పాటిల్‌ను ఆ స్థానంలో కూర్చోబెట్టాలంటూ వాదనకు దిగారు. అనంతరం ధర్మే గౌడను లాగిపడేశారు. ఇంతలో మండలిలోకి వచ్చిన చైర్మన్ ప్రతాపచంద్ర శెట్టి సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఈనెల 7 నుంచి మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment