
శాసనమండలి చైర్మన్ షరీఫ్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తున్న సునీత, భగీరథరెడ్డి
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పోతుల సునీత, చల్లా భగీరథరెడ్డిలతో చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ ప్రమాణం చేయించారు. అనంతరం ఇద్దరికీ అభినందనలు తెలిపి, మండలి నియమ నిబంధనలు వివరించారు. వారికి ధ్రువీకరణ పత్రాలు, బుక్‌లెట్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరీమున్నీసా, అసెంబ్లీ సహాయ కార్యదర్శి విజయరాజు, తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మండలి చైర్మన్
కాగా, శాసన మండలి ఆవరణలో చైర్మన్ ఎం.ఎ. షరీఫ్ బుధవారం కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు. ఆయనతోపాటు అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, పలువురు సహాయ, అసిస్టెంట్ కార్యదర్శులు, ఉద్యోగులు, మార్షల్స్ కోవిడ్ వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు డీఎంహెచ్‌వో యాస్మిన్, గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామింగ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రత్న మన్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment